Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్రం విద్యారంగంలో సరికొత్త చరిత్ర సృష్టించబోతుందని, ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు విద్యార్థుల భవిష్యత్తును మార్చే ‘గేమ్ చేంజర్’గా నిలుస్తాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆకాంక్షించారు. మధిరలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన ఎస్‌టీఎఫ్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
Also Read:
విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ద్వారా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. నిరుపేద విద్యార్థులకు కూడా అంతర్జాతీయ స్థాయి నాణ్యమైన విద్యను, వసతులను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ పాఠశాలలు విద్యా ప్రమాణాలను పెంచడమే కాకుండా, విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ సైదులు, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ, ఎస్‌టీఎఫ్ జిల్లా బాధ్యులు గండు యాదగిరి, షేక్ మన్సూర్, వివిధ జిల్లాల నుండి వచ్చిన సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

