Medak District: ఆ జిల్లాలో అమావాస్య వేడుకలకు సిద్ధం
Medak District (image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Medak District: ఆ జిల్లాలో అమావాస్య వేడుకలకు సిద్ధం.. పుణ్యస్నానం ఏడుపాయలకు రానున్న లక్షలాది మంది భక్తులు!

Medak District:  మాఘ అమావాస్య జాతరకు ఉమ్మడి మెదక్ జిల్లా (Medak District) సిద్ధమైంది. ప్రధానంగా ఏడుపాయల కూడవెల్లి రాజరాజేశ్వర స్వామి దేవస్థానం,కేతిక సంగమేశ్వర ఆలయం,తో పాటు మెదక్ (Medak )మండలం పేరూరు సరస్వతిమాత ఆలయం గరుడ గంగా వద్ద మంజీర నది లో స్నానాలు ఆచరించి భక్తులు మొక్కలు తీర్చుకుంటారు. జాతర ఏర్పాట్లకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా మాఘ అమావాస్య సందర్భంగా నిర్వహించే జాతరకు ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం ముస్తాబైంది. పుణ్య స్నానాలు ఆచరించేందుకుగాను తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సుమారు లక్ష వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంది.

నదీపాయల వద్ద సైతం షవర్లను ఏర్పాటు

భక్తుల రాకకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆలయం వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు గాను షవర్లను ఏర్పాటు చేశారు. సింగూరు ప్రాజెక్టు నుండి నీరు కిందికి వదలతుండడంతో ఘనపురం ప్రాజెక్టు నిండుగా పొంగి పొర్లుతుంది. భక్తులు స్నానమాచరించేందుకు నదీపాయల వద్ద సైతం షవర్లను ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే వారికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆలయ రాజగోపురం నుండి అమ్మవారి గర్భగుడి వరకు షామియానాలను ఏర్పాటు చేశారు. భక్తుల వాహనాలను నిలుపుదల చేసేందుకుగాను పార్కింగ్ స్థలాన్ని సైతం సిద్ధం చేశారు.

Also Read: Medak District: స్టీల్ పరిశ్రమలో భారీ పేలుడు.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు!

250 మంది సిబ్బందితో బందోబస్తు

బాగా అమావాస్యపురస్కరించుకొని పుణ్య స్నానం ఆచరించేందుకుగాను ఏడుపాయలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకుగాను 250 మంది సిబ్బందితో బందోబస్తును నిర్వహించడం జరుగుతుందని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. ఏడుపాయలకు వచ్చే భక్తులు పోలీసు సిబ్బందికి సహకరించాలన్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనికి, తెలియని లోతట్టు ప్రదేశాలకు వెళ్లకూడదని పోలీసులు సూచించిన సురక్షిత ప్రదేశాల్లోనే స్నానాలు చేయాలని ఆయన భక్తులను కోరారు.

Also Read: Medak District: పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏర్పాట్లు పూర్తి

Just In

01

NTR Statue Controversy: అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం.. వైసీపీ వింత వాదన.. ఎక్కడో కొడుతుంది సీనా?

Republic Day Alert: ఆ రోజు ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉంది.. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక!

BRS Party: మున్సిపల్, ఎన్నికల్లో నమ్మకస్తులకే బాధ్యతలు.. ఆ మాజీ ఎమ్మెల్యేలకు చెక్!

Bhatti Vikramarka: విద్యారంగంలో సరికొత్త చరిత్ర.. గేమ్ చేంజర్’గా ఇంటిగ్రేటెడ్ స్కూల్లు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!

Honeytrap Couples: 1500 మందిని హనీ ట్రాప్.. 100 మందితో శృంగారం.. ఈ కపుల్ సమాజానికే సిగ్గుచేటు!