Seethakka: మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా శాంతి భద్రతల ఏర్పాట్లపై మంత్రి సీతక్క (Seethakka) ప్రత్యేక దృష్టి సారించారు. (Medaram)మేడారంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించి, అక్కడి నుంచి కొనసాగుతున్న భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. జాతర ప్రాంతం అంతటా 450 సీసీ కెమెరాల ద్వారా పోలీసులు కట్టుదిట్టమైన నిఘా కొనసాగిస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌పై జాతర ప్రాంగణంలో జరుగుతున్న కార్యక్రమాలు, భక్తుల రాకపోకలు, జనసాంద్రత పరిస్థితులను సీతక్క ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరిగితే పోలీసులు ఎలా స్పందిస్తారు, ముందస్తు చర్యలు, సన్నాహాలు ఏమిటనే అంశాలను పోలీస్ అధికారులు వివరించారు. భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, ప్రతి చిన్న అంశాన్ని కూడా అప్రమత్తతతో పర్యవేక్షించాల సీతక్క స్పష్టంగా ఆదేశించారు.
Also Read: Seethakka: మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలి : మంత్రి సీతక్క!
భక్తులకు ట్రాఫిక్ ఆంక్షలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన నేపథ్యంలో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ నియంత్రణ చర్యలు అమలు చేస్తామని ఎస్‌పీ కేకాన్ సుధీర్ రామనాథ్ తెలిపారు. భక్తులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఒకే ప్రవేశ మార్గం అనగా పస్రా నుండి ప్రాజెక్ట్ నగర్, నర్లాపూర్ మీదుగా మాత్రమే మేడారం చేరుకోవాలన్నారు. తిరుగు ప్రయాణం బయ్యాక్కపేట భూపాలపల్లి పరకాల గుండెప్పాడ్ మీదుగా మాత్రమే వెళ్లాలని చెప్పారు. ప్రజలు పోలీసుల సూచనలను పాటిస్తూ, ట్రాఫిక్ నియమాలు అనుసరించి ప్రశాంతమైన దర్శనం చేసుకొని సురక్షితంగా ఇంటికి చేరుకోగలరని తెలిపారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసుల అనుమతి లేకుండా ఎవరైనా డ్రోన్ ఎగురవేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటమని ఎస్‌పీ స్పష్టం చేశారు.
Also Read: Seethakka Meets KCR: మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసి మంత్రులు సీతక్క, కొండా సురేఖ.. కారణం ఏంటంటే?

