Ravi Teja BMW: మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) హీరోగా వచ్చిన సంక్రాంతి బ్లాక్ బస్టర్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaki Wignyapthi). కిషోర్ తిరుమల (Kishore Tirumala) దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్లతో సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. చిత్ర సక్సెస్‌ను పురస్కరించుకుని మేకర్స్ శనివారం సంక్రాంతి బ్లాక్ బస్టర్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమం చాలా సరదాగా సాగింది. సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాలతో పాటు మా సినిమా కూడా చాలా బాగా ఆడుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు.
Also Read- Sanjay Dutt: ముంబై రోడ్లపై సంజయ్ దత్ ‘టెస్లా సైబర్‌ట్రక్’ హవా.. కిర్రాక్ ఎంట్రీ!
మేమంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్
ఈ కార్యక్రమంలో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. ‘‘చాలా హ్యాపీగా ఉంది. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, డిఓపి ప్రసాద్‌తో ఎన్నో ఏళ్ళుగా వర్క్ చేస్తున్నాను. వాళ్ళతో కలిసి మరోసారి ఈ సినిమాకు పని చేసినందుకు హ్యాపీగా ఉంది. ప్రసాద్ సినిమాని చాలా కలర్ ఫుల్‌గా తీశారు. మురళీధర్ గౌడ్ ఇందులో అద్భుతంగా చేశారు. తన జోక్స్‌కి థియేటర్స్‌లో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే కిషోర్, సత్య, గెటప్ శీను వాళ్ళ అందరితో చాలా బాగా ఎంజాయ్ చేశాను. సునీల్‌తో నాకు చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. మేమంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ‘దుబాయ్ శీను’ తర్వాత మళ్లీ అంతలా ఈ సినిమాతో ఎంజాయ్ చేశాను. ప్రతి సీను విపరీతంగా ఎంజాయ్ చేశా. తనతో మళ్ళీ మళ్ళీ ఇలాంటి సినిమాలు చేయాలని ఉంది. నిర్మాత సుధాకర్‌కు కంగ్రాజులేషన్స్. మా కాంబినేషన్‌లో ఇంతకు ముందు వచ్చిన సినిమా సరైన విజయం అందుకోలేదు. ఆ లోటుని ఈ సినిమా తీర్చేసింది.
Also Read- MSG Collections: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ 5 డేస్ కలెక్షన్స్.. మైండ్ బ్లోయింగ్!
సినిమా మెయిన్ క్రెడిట్ వారికే..
సినిమా అద్భుతంగా ఉంది.. సంక్రాంతికి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాం. ఈ సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాలతో పాటు మా సినిమా కూడా చాలా బాగుంది. ఈ సినిమాని హిట్ చేసిన ప్రేక్షక మహాశయులకు కృతజ్ఞతలు. సినిమాకు ఇంకా చాలా మంచి రన్ ఉండబోతుంది. డింపుల్ తన పాత్రని అద్భుతంగా చేసింది. తన పాత్రకి చాలా మంచి పేరు వచ్చింది. తనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. అలాగే ఆషిక కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. అందరు కూడా కామెడీ చాలా ఆర్గానిక్‌గా ఉందని చెప్తున్నారు. డైరెక్టర్ కిషోర్‌కి ఆర్గానిక్ కామెడీపై మంచి పట్టు, టైమింగ్ ఉంది. బాలు మహేంద్ర, జంధ్యాల, క్రేజీ మోహన్ వంటి ఫ్లేవర్ ఉన్న రైటింగ్ తనది. తన రైటింగ్ అంటే, నాకు మొదటి నుంచి చాలా ఇష్టం. ఎమోషన్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్ చేస్తూ అద్భుతంగా రాస్తాడు. ఇలాంటి సినిమా చేయాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. కిషోర్ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇలాంటి సినిమాలు మళ్లీ చేయాలని కోరుకుంటున్నాను. భీమ్స్ వండర్‌ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా మెయిన్ క్రెడిట్ కిషోర్, భీమ్స్‌కే ఇస్తాను. అందరూ థియేటర్లకు వెళ్లి, సినిమా చూసి ఎంజాయ్ చేయండి. అందరికీ థాంక్యూ’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

