MLA Daggupati Prasad: రాష్ట్రాభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వానికి.. ఎమ్మెల్యేల వరుస వివాదాలు తలనొప్పిగా మారుతున్నాయి. తాజాగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరో వివాదంలో చిక్కుకొని వార్తల్లో నిలిచారు. ఆప్తమాలజిస్ట్ డాక్టర్ సమయ భర్తను అసభ్య పదజాలంతో ఇటీవల బూతులు తిట్టిన వీడియో వైరల్ కాగా.. తాజాగా రూ.కోట్ల విలువైన ఆస్తి డబుల్ రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఎమ్మెల్యేపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యేతో ఉన్న వివాదంపై గతేడాది ఆగస్టులోనే సమయ ఓ వీడియో రిలీజ్ చేశారు. తమ ఆస్పత్రికి కొందరు వచ్చి దౌర్జన్యం చేశారని ఆమె ఆరోపించారు.
రూ.3 కోట్ల విలువైన ప్రాపర్టీని డబుల్ రిజిస్ట్రేషన్ చేయించి.. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తన ఆస్తి కాజేసే కుట్ర చేశాడని డా. సుమయ ఆరోపించారు. దీనిపై డీఎస్పీకి ఫిర్యాదు చేశామని.. అప్పటి నుంచి బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయని ఆమె తెలిపారు. తమ వద్ద పని చేసే వారిపై కొందరు దాడికి యత్నించినట్లు డా. సుమయ ఆరోపించారు. వారికి ఫ్యామిలీస్ ఉన్నాయని గుర్తుచేశారు. తనను, తన భర్తను ఏదో ఒకటి చేయడానికే వారు వచ్చారని డాక్టర్ సుమయ ఆరోపించారు.
మైనారిటీలపై జరుగుతున్న దాడిగా దీనిని డా. సుమయ అభివర్ణించారు. సీఎం చంద్రబాబు (CM Chandra babu), మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) తమకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డా. సుమయ డిమాండ్ చేశారు. తమకు రక్షణ కల్పించాలని ప్రాధేయ పడ్డారు. కాగా ఇటీవలే ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గన్ మెన్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నగరంలోని ఎగ్జిబిషన్ నిర్వాహకులను గన్ మెన్ బెదిరించినట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్యలకు ఉపక్రమించింది.
మరో వివాదంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
ఓ డాక్టర్ భర్తను ఎమ్మెల్యే దగ్గుపాటి బెదిరిస్తున్నట్లు ఆడియో వైరల్
గతంలో ఆప్తమాలజిస్ట్ సుమయ భర్తను బూతులు తిడుతూ బెదిరించిన ఎమ్మెల్యే
రూ.3 కోట్ల విలువైన ప్రాపర్టీ డబుల్ రిజిస్ట్రేషన్ వివాదంలో ఎమ్మెల్యే దగ్గుపాటి పేరు… pic.twitter.com/O6cNxtv4vF
— BIG TV Breaking News (@bigtvtelugu) January 17, 2026
Also Read: BRS Party: వరంగల్‌లో ఒకలా? సికింద్రాబాద్‌లో మరోలా? బీఆర్ఎస్ రెండు నాలుకల ధోరణి!
గతంలో జూనియర్ ఎన్టీఆర్ పైనా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ‘వార్ 2’ సినిమా రిలీజ్ సందర్భంగా తెలుగు యువత నాయకుడు గుత్త ధనుంజయ నాయుడుతో ఎమ్మెల్యే ఫోన్ లో మాట్లాడిన మాటలు వివాదస్పదంగా మారాయి. లోకేష్ గురించి మాట్లాడితే ఎవరినీ వదిలిపెట్టబోయని, వార్-2 సినిమా ప్రదర్శించడానికి వీల్లేదంటూ దారుణమైన భాషలో ఆయన మాట్లాడారు. ఈ ఆడియో కాల్ సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ఎన్టీఆర్ అభిమానులు చుట్టుముట్టారు. దీంతో దిగొచ్చిన ఎమ్మెల్యే.. బహిరంగ క్షమాపణలు చెప్పారు.

