BRS Party: సికింద్రాబాద్‌ అంశంలో బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి!
BRS on Secunderabad Issue (Image Source: twitter)
Telangana News

BRS Party: వరంగల్‌లో ఒకలా? సికింద్రాబాద్‌లో మరోలా? బీఆర్ఎస్ రెండు నాలుకల ధోరణి!

BRS Party: సికింద్రాబాద్ అంశం.. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. జంట నగరాలైన హైదరాబాద్ – సికింద్రాబాద్ లను కాంగ్రెస్ ప్రభుత్వం విడగొడుతోందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, గులాబీ శ్రేణులు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు జరుగుతున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని సామాన్య ప్రజల ఏరియాలను జీహెచ్ఎంసీలో విలీనం చేయకుండా.. ప్రత్యేక కార్పొరేషన్ గా ప్రకటించాలంటూ పట్టుబడుతున్నారు. సికింద్రాబాద్ అంశంపై ప్రజా భవన్ వద్ద మాట్లాడిన కేటీఆర్.. వచ్చేది తమ ప్రభుత్వమేని.. సికింద్రాబాద్ ను ఏకంగా జిల్లాను చేసే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

గతంలో బీఆర్ఎస్ ఏం చేసిందేంటి?

రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో 10 జిల్లాలు మాత్రమే ఉండేవి. తెలంగాణకు కేసీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పునర్విభజన చేసి 33 జిల్లాలుగా మార్చారు. ప్రస్తుతం ఇదే అంశాన్ని కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తున్నారు. సికింద్రాబాద్ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లకు సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు. అప్పట్లో అల్లుడు కోసం ఒక జిల్లా, కొడుకు కోసం ఒక జిల్లా, కాంగ్రెస్ కు బలమున్న ప్రాంతాలను అడ్డగోలుగా విభజించింది మీరు కాదా? అని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ – సికింద్రాబాద్ తర్వాత జంట నగరాలుగా పేరున్న వరంగల్ – హన్మకొండలను మీరు విడగొట్టలేదా? అంటూ నిలదీస్తున్నారు. అప్పుడు జంట నగరాల అంశం గుర్తుకు రాలేదా అంటూ మండిపడుతున్నారు. వరంగల్ ను నిలువుగా చీల్చిన తన తండ్రిని కేటీఆర్ ఎందుకు ప్రశ్నించలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

మీ హయాంలో ఎందుకు పట్టించుకోలేదు?

కంటోన్మెంట్ లోని సామాన్య ప్రజల ప్రాంతాలను స్థానిక కార్పొరేషన్లలో కలపాలన్న ఆలోచన వాస్తవానికి 2023లోనే వచ్చింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అప్పట్లోనే 62 కంటోన్మెంట్ బోర్డుల్లో ఉన్న సామాన్య ప్రజలను స్థానిక మున్సిపల్ కార్పొరేషన్లలో కలపాలని ఆదేశించారు. ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రస్తుతం సికింద్రాబాద్ విషయంలో నీతి సూక్తులు చెబుతున్న గులాబీ నేతలు.. తాము అధికారంలో ఉన్న సమయంలోనే సికింద్రాబాద్ ను ప్రత్యేక జిల్లాతో పాటు కార్పొరేషన్ గా ఎందుకు ప్రకటించలేదని కాంగ్రెస్ శ్రేణులు నిలదీస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ గురించి తెగ బాధపడిపోతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా ఉండి కూడా ఎందుకు ఈ ఆలోచన చేయలేకపోయారని ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొకలా ద్వంద్వ నాలుకల ధోరణి అనుసరిస్తారా? అంటూ బీఆర్ఎస్ పై కాంగ్రెస్ శ్రేణులు ఫైర్ అవుతున్నారు.

Also Read: Vande Bharat Sleeper Train: పట్టాలెక్కిన వందే భారత్ స్లీపర్.. టికెట్ కొన్న ప్రతీ ఒక్కరూ వీఐపీనే!

విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి

హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. హైదరాబాద్ – సికింద్రాబాద్ అంటూ నగర ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించి విభజన రాజకీయాలు చేయవద్దని బీఆర్ఎస్ కు సూచిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి హైదరాబాద్ అభివృద్ధి మరో లెవల్ కు చేరిందని గుర్తు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్, ఎక్స్ ప్రెస్ హైవేలు, ఫోర్త్ సిటీ నిర్మాణం, డ్రై పోర్ట్, మూసీ పునః జీవం, మెట్రో విస్తరణ, హైడ్రా ఏర్పాటు చేసి కబ్జా గురైన చెరువులను కాపాడటం వంటి చర్యలతో హైదరాబాద్ ను అభివృద్ధి చేసే సంకల్పంతో కాంగ్రెస్ ముందుకు సాగుతున్నట్లు కాంగ్రెస్ నేతలు గుర్తుచేస్తున్నారు.

Also Read: Teachers Tragedy: ఉపాధ్యాయుల కారుకు ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు మృతి..!

Just In

01

Medak News: ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపాలిటీ రిజర్వేషన్లు ఖరారు.. మహిళలకే పెద్దపీట

Ravi Teja BMW: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. ఇలాంటి సినిమాలు మళ్లీ చేయాలని ఉంది..

Gadwal Municipality: గద్వాల జిల్లా మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. చైర్ పర్సన్..?

Sanjay Dutt: ముంబై రోడ్లపై సంజయ్ దత్ ‘టెస్లా సైబర్‌ట్రక్’ హవా.. కిర్రాక్ ఎంట్రీ!

New District Demand: ప్రత్యేక జిల్లా సాధనకై గర్జించిన జేఏసీ.. భారీ ఎత్తున నినాదాలతో నిరహార దీక్ష..!