Hyderabad Crime: చెంగిచెర్లలోని కనకదుర్గ కాలనీ, అణుశక్తి కాలనీలో దొంగతనాలు జరిగినట్టు సమాచారం వచ్చిదని ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్(DCP Suresh Kumar) తెలిపారు. దీంతో సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇంటి యజమానులు సంక్రాంతి పండక్కి వెళ్లినందున ఇదే అసలైన సమయం అని దుండగులు దొంగతనంగా చోరీ చేశారని డీసీపీ తెలిపారు. మొత్తం అక్కడ ఎనిమిది ఇళ్లలో చోరీ జరిగిందని అన్నారు. ఇంటి తాళాలు పగలగొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారని తెలిపారు. దొంగతనం జరిగిన వారి ఇంటిలో ప్రాథమికంగా 30 తులాల బంగారం 8 కేజీల సిల్వర్ రెండు లక్షల రూపాయల నగదు చోరీకి గురైనట్టు పోలీసులు నిర్ధారణ చేశారు. ఇది కేవలం అంచనా మాత్రమే అని చోరీకి గురైన సొత్తు ఇంకా పెరగొచ్చు అని డీసీపీ తెలిపారు. ఇప్పటికే దొంగతనంపై క్లూ సేకరించామని అన్నారు. తరువాత టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సేకరించామని, వితౌట్ వెపన్స్‌తో దొంగలు చోరీకి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. చోరీలో ఎంత మంది పాల్గొన్నారు అన్న అంశంపై ఇంకా దర్యాప్తు చేస్తున్నాంమని డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు.
Also Read: Minister Ponguleti Srinivas: 18న పాలేరుకు సీఎం రేవంత్ రెడ్డి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన..!
12 ఇళ్లలో దొంగతనాలు
మేడిపల్లి పరిసర ప్రాంతాల్లో దొంగలు హడలెత్తిస్తున్నారు. ఇంట్లో ఎవరులేని సమయం చూసుకోని చోరీలకు పాల్పడుతున్నారు. నిన్న రాత్రికాల సమయంలో దొంగలు చేతిలో కత్తులతో చెంగిచెర్ల(Chengicherla) కాలనీలో కొంతమందికి కనిపించారని తెలిపారు. మేడిపల్లిలోని చెంగిచెర్ల పరిసర ప్రాంతంలో అక్కడ ముందే రెక్కి చేసి కారు(Car)లో వచ్చి భారీగా చోరీలకు పాల్పడ్డుతున్నట్టు అక్కడి స్ధానికులు తెలిపారు. దీంతో స్ధానికుల పోలీసులకు సమాచారం అందించారు. చెంగిచెర్ల పరిసరప్రాంతాల్లో దొంగలు ఓ ముఠాగా ఎర్పడి 12 ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డారు. అనంతరం పలు ఇళ్లలో చోరీకి ప్రయత్నించగా సాద్యపడకపోవడంతో అక్కడి నుండి ఎస్కేప్ అయ్యారని స్ధానికులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన బాధితులు మేడిపల్లి పోలీసులు ఫిర్యాదు చేసారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకిని క్లూస్ టీమ్ సహయంతో దొంగలను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
సంక్రాంతి పండుగ వేళ దొంగల హల్చల్
మేడిపల్లిలోని చెంగిచెర్లలో వరుస చోరీలు
12 ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డ దొంగల ముఠా
చేతిలో కత్తులతో చెంగిచెర్ల కాలనీలో దొంగల సంచారం
మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు, క్లూస్ టీమ్ pic.twitter.com/QtpWlKnNKz
— BIG TV Breaking News (@bigtvtelugu) January 16, 2026
Also Read: Sai Durgha Tej SYG: ఎద్దును పట్టుకుని.. ఊరమాస్ అవతార్‌లో తేజ్.. పోస్టర్ వైరల్!

