CM Revanth Reddy: ప్రభుత్వానికి, ఆర్మీకి మధ్య సమస్యలు..!
CM Revanth Reddy (imagecredit:swetcha)
Telangana News

CM Revanth Reddy: ప్రభుత్వానికి, ఆర్మీకి మధ్య సమస్యలు చర్చలతోనే పరిష్కారమవుతాయి: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వానికి, భారత ఆర్మీకి మధ్యన వివిధ సమస్యలు నిరంతర చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అభిప్రాయపడ్డారు. వివిధ అంశాలకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఆర్మీ తరఫున ప్రత్యేకంగా అధికారులను నియమించాలని కోరారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన “సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్” జరిగింది. భారత సైన్యం, తెలంగాణ ప్రభుత్వం మధ్య పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు, ఇతర పరిపాలనా సమస్యల సత్వర పరిష్కారంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారు, తెలంగాణ – ఆంధ్రా సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (TASA) మేజర్ జనరల్ అజయ్ మిశ్రా గారు, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి(DGP Shivadhar Reddy), రాష్ట్ర ప్రభుత్వం, ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read: Naveen Polishetty: ‘అనగనగా ఒక రాజు’ మొదటి రోజు ఎంత వసూలు చేశాడంటే?.. రికార్డ్ బ్రేక్..

గడిచిన పదేళ్లలో..

తెలంగాణ ప్రభుత్వం తరఫున పలు విజ్ఞప్తులను ముఖ్యమంత్రి సమావేశంలో ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. సదరన్ కమాండ్ సెంటర్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌కు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రంలో 2 నుంచి 4 సైనిక్ స్కూళ్లను మంజూరు చేశారన్న విషయం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గుర్తుచేస్తూ గడిచిన పదేళ్లలో తెలంగాణలో ఒక్క సైనిక్ స్కూల్ కూడా మంజూరు చేయలేదని చెప్పారు. తెలంగాణలో తక్షణం సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరారు. దేశ భద్రతకు సంబంధించిన అన్ని అంశాల్లో కేంద్రానికి, భారత సైన్యానికి సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే వికారాబాద్‌ దామగుండం వద్ద లో-ఫ్రీక్వెన్సీ వీఎల్ఎఫ్ (VLF) నేవీ రాడార్ స్టేషన్‌కు 3 వేల ఎకరాలు కేటాయించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

Also Read: Mega Interview: మెగా సంక్రాంతి బ్లాక్ బాస్టర్ స్పెషల్ ఇంటర్వ్యూ ఫుల్ వీడియో వచ్చేసింది..

Just In

01

MSG Boxoffice: ‘మన శంకరవరప్రసాద్ గారు’ నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ దాటేశారు..

Labour Card: లేబర్ కార్డు అంటే ఏమిటి..? ఈ కార్డుతో కలిగే లాభాలేంటో తెలిస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం..?

Slumdog Movie: పూరీ, సేతుపతి సినిమా టైటిల్ వచ్చేసింది.. ఏం ఉంది మామా..

CM Revanth Reddy: ప్రభుత్వానికి, ఆర్మీకి మధ్య సమస్యలు చర్చలతోనే పరిష్కారమవుతాయి: సీఎం రేవంత్ రెడ్డి

Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. ఓ ఉపాధ్యాయుడి ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు