Peddi: ‘పెద్ది’ ఈ ఫొటో ఎక్కడిది? సోషల్ మీడియాలో పిక్ వైరల్!
Peddi Update (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Peddi: ‘పెద్ది’ ఈ ఫొటో ఎక్కడిది? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్!

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi). ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్ చార్ట్ బస్టర్ అయ్యి, మ్యూజిక్ లవర్స్‌ను ఊపేస్తోన్న విషయం తెలియంది కాదు. ఇక సంక్రాంతిని పురస్కరించుకుని సినిమా అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు డైరెక్టర్ బుచ్చిబాబు ఒక అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. తన ‘పెద్ది’తో కలిసి దిగిన ఒక పవర్‌ఫుల్ ఫోటోను షేర్ చేసి, క్షణాల్లో సోషల్ మీడియాను షేక్ చేశారు. ఈ ఫోటోలో రామ్ చరణ్ లుక్ చూస్తుంటే గూస్ బంప్స్ రావడం ఖాయం. పక్కా డైనమిక్ లుక్‌లో, పెంచిన గడ్డంతో చరణ్ చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తున్నారు. చుట్టూ దేవుడి చిత్ర పటాల మధ్యలో రామ్ చరణ్, బుచ్చిబాబు నిలబడి ఉన్న తీరు ఒక అద్భుతమైన ఫోటో మూమెంట్‌గా నిలిచింది. ఈ ఫోటో చూస్తుంటే సినిమాలో చరణ్ క్యారెక్టరైజేషన్ ఎంత స్ట్రాంగ్‌గా ఉండబోతుందో అర్థమవుతోంది.

Also Read- Anil Ravipudi: శంకర్ వరప్రసాద్ గారి కోసం నయన్‌కు ‘దృశ్యం’ కథ చెప్పిన అనిల్ రావిపూడి!

ఈ లొకేషన్ ఎక్కడంటే?

ఈ ఫోటో ఎక్కడిది? అనే దానిపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సమాచారం ప్రకారం, ఈ ఫోటో చెన్నైలోని అపోలో ఆసుపత్రుల వ్యవస్థాపకులు, ఉపాసన కొణిదెల తాతగారి ఇంట్లో తీసినట్లుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. పండుగ సందర్భంగా అక్కడికి వెళ్ళిన ఈ ఇద్దరు స్టార్స్, ఇలా దేవుడి గదిలో దిగిన ఫొటో.. ఇప్పుడు మెగా అభిమానులకు కంటికి విందులా మారింది. ఈ ఫొటోని షేర్ చేస్తూ.. తలా ఎప్పుడూ మరో అప్డేట్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ‘పెద్ది’ రెండో పాట రెడీ‌గా వుందని తెలుస్తోంది. లిరికల్ వీడియో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, దీని కోసం కొత్తగా ఏదైనా ట్రై చేయాలని మేకర్స్ ఆలోచనలు చేస్తున్నట్లుగా టాక్ నడుస్తుంది. ఈ లిరికల్ వీడియో కోసం చిన్న షూట్ కూడా చేసే ప్లాన్‌లో టీమ్ ఉందట.

Also Read- Ashika Ranganath: రష్మిక, శ్రీలీల అవుట్.. ఆషికాకు టాలీవుడ్ ఫిదా!

మార్చి 27న ‘పెద్ది’ జాతర

ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం సినిమాపై అంచనాలను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మార్చి 27న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి. మొత్తానికి ఈ పండుగకు ఎలాంటి ట్రీట్ లేదా, రాదా? అని అనుకున్న అభిమానులకు.. బుచ్చిబాబు షేర్ చేసిన ఈ ఒక్క పిక్‌తో ‘పెద్ది’ మేనియా మళ్ళీ పీక్స్‌కు చేరుకుంది. పండుగ పూట మెగా ఫ్యాన్స్‌కు ఇంతకంటే మంచి ట్రీట్ ఏముంటుంది..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Peddi: ‘పెద్ది’ ఈ ఫొటో ఎక్కడిది? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్!

PuriSethupathi: పూరిసేతుపతి మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌కి.. ఎట్టకేలకు మోక్షం!

Anil Ravipudi: శంకర్ వరప్రసాద్ గారి కోసం నయన్‌కు ‘దృశ్యం’ కథ చెప్పిన అనిల్ రావిపూడి!

Ashika Ranganath: రష్మిక, శ్రీలీల అవుట్.. ఆషికాకు టాలీవుడ్ ఫిదా!

Rahul Sipligunj: ట్రెండింగ్‌లో ‘అమీర్ లోగ్’.. ‘అవ్వల్ దావత్’ సాంగ్..