PuriSethupathi: పూరిసేతుపతి మూవీ టైటిల్‌కు ఎట్టకేలకు మోక్షం!
PuriSethupathi (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

PuriSethupathi: పూరిసేతుపతి మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌కి.. ఎట్టకేలకు మోక్షం!

PuriSethupathi: టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh), మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi).. ఈ ఇద్దరి పేర్లు వింటేనే ఏదో తెలియని వైబ్రేషన్ వస్తుంది. పూరి మార్క్ హీరో క్యారెక్టరైజేషన్, సేతుపతి మార్క్ నేచురల్ యాక్టింగ్ కలిస్తే ఎలా ఉంటుందో అని ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడబోతోంది. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పూరిసేతుపతి’ (PuriSethupathi) ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్‌మెంట్‌కు ముహూర్తం ఖరారైంది. నిజానికి ఈ సినిమా ఫస్ట్ లుక్ గతేడాది సెప్టెంబర్ 28నే చెన్నైలో గ్రాండ్‌గా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. అప్పటి నుండి ఫ్యాన్స్ ఈ సినిమా అప్డేట్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తై, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నా కూడా ఈ మూవీ టైటిల్ రివీల్ చేయకపోవడం విశేషం. ఇక ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ.. ఎట్టకేలకు ఫస్ట్ లుక్, టైటిల్‌ను కనుమ పండుగను పురస్కరించుకుని, జనవరి 16న ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌తో అటు విజయ్ సేతుపతి ఫ్యాన్స్, ఇటు పూరి అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.

Also Read- Ashika Ranganath: రష్మిక, శ్రీలీల అవుట్.. ఆషికాకు టాలీవుడ్ ఫిదా!

పోస్టర్‌ వైరల్

తాజాగా విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూస్తుంటే పూరి జగన్నాథ్ మళ్ళీ తన పాత గ్యాంగ్‌స్టర్ లేదా మాస్ డ్రామా జోనర్‌లోకి వెళ్లినట్లు అనిపిస్తోంది. ఒక పాత గోదాము వంటి సెటప్, అక్కడ ఒక ఐరన్ డ్రమ్.. దానిపై సుత్తి, ఐరన్ స్టిక్, సన్ గ్లాసెస్ ఉండటం గమనిస్తే, సినిమాలో విజయ్ సేతుపతి క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో అర్థమవుతోంది. డ్రమ్ మీద ఉన్న ‘PURI SETHUPATHI’ అనే పేరు ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్‌గా ఉన్నా, అసలైన టైటిల్ శుక్రవారం రివీల్ కాబోతోంది. ఈ పోస్టర్ డిజైన్ చాలా రా అండ్ రస్టిక్ వైబ్‌ను ఇస్తోంది.

Also Read- Anil Ravipudi: శంకర్ వరప్రసాద్ గారి కోసం నయన్‌కు ‘దృశ్యం’ కథ చెప్పిన అనిల్ రావిపూడి!

రిలీజ్ డేట్ కూడా ఉంటుందా..

పూరి కనెక్ట్స్ మరియు జెబి మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జెబి నారాయణ్ రావు కొండ్రోల్లా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. విజయ్ సేతుపతి లాంటి నటుడిని పూరి జగన్నాథ్ తనదైన స్టైల్‌లో ఎలా ప్రెజెంట్ చేస్తారో చూడాలనే క్యూరియాసిటీ ఇప్పుడందరిలోనూ నెలకొంది. అందులోనూ పూరికి అర్జెంట్‌గా మాస్ హిట్ ఒకటి పడాలి. రేసులో ఆయన పడుతూ, లేస్తూ ఉన్నారు. విజయ్ సేతుపతితో మాత్రం సాలిడ్ హిట్ కొడితే మాత్రం మళ్లీ పూరి రేసులోకి వచ్చినట్టే. చూద్దాం.. పూరి మళ్లీ కమ్‌బ్యాక్ అవుతాడేమో. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌పై రిలీజ్ డేట్ కూడా మెన్షన్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏ విషయం తెలియాలంటే మాత్రం ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే…

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Peddi: ‘పెద్ది’ ఈ ఫొటో ఎక్కడిది? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్!

PuriSethupathi: పూరిసేతుపతి మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌కి.. ఎట్టకేలకు మోక్షం!

Anil Ravipudi: శంకర్ వరప్రసాద్ గారి కోసం నయన్‌కు ‘దృశ్యం’ కథ చెప్పిన అనిల్ రావిపూడి!

Ashika Ranganath: రష్మిక, శ్రీలీల అవుట్.. ఆషికాకు టాలీవుడ్ ఫిదా!

Rahul Sipligunj: ట్రెండింగ్‌లో ‘అమీర్ లోగ్’.. ‘అవ్వల్ దావత్’ సాంగ్..