Rahul Sipligunj: ట్రెండింగ్‌లో ‘అమీర్ లోగ్’.. ‘అవ్వల్ దావత్’ సాంగ్..
Awwal Dawath Song (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Rahul Sipligunj: ట్రెండింగ్‌లో ‘అమీర్ లోగ్’.. ‘అవ్వల్ దావత్’ సాంగ్..

Rahul Sipligunj: ప్రస్తుతం టాలీవుడ్‌లో చిన్న సినిమాలు పెద్ద సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలియంది కాదు. సరిగ్గా అదే బాటలో, ఫుల్ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్‌గా వస్తోంది ‘అమీర్ లోగ్’ (Ameerlog). అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా తెరకెక్కుతున్న ఈ చిత్రం, అనౌన్స్‌మెంట్ నుండే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఇటీవల రిలీజ్ అయిన మాస్ మసాలా సాంగ్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమాలోని ‘అవ్వల్ దావత్’ (Awwal Dawath Lyrical Video) అనే సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. హైదరాబాద్ లోకల్ రాక్‌స్టార్, ఆస్కార్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) తనదైన నాటు స్టైల్‌లో ఈ పాటను పాడటంతో, ఆడియన్స్‌కి పూనకాలు వస్తున్నాయి. ఇక ఈ పాటలో ఆనీ మాస్టర్ కంపోజ్ చేసిన అదిరిపోయే స్టెప్పులు సాంగ్‌ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయి. విడుదలైన అతి తక్కువ సమయంలోనే ఈ సాంగ్ యూట్యూబ్‌లో వన్ మిలియన్ వ్యూస్ మార్కును దాటేసి, ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

Also Read- Champion Movie: ‘ఛాంపియన్’ సూపర్ హిట్ సాంగ్ ‘గిర గిర గింగిరాగిరే’ ఫుల్ వీడియో వచ్చేసింది..

హీరో శ్రీ విష్ణు సపోర్ట్

సక్సెస్ ఫుల్ హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా రిలీజ్ అయిన ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లకు ఇప్పటికే మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పోస్టర్లు చూస్తుంటేనే ఇదొక ఫ్రెష్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ అని అర్థమవుతోంది. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీలో వేదా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మాధవి రెడ్డి సోమ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్మరణ్ సాయి అందించిన సంగీతం సినిమాకు మెయిన్ పిల్లర్‌గా నిలవనుందని, అలాగే ఎస్‌వికె సినిమాటోగ్రఫీ, రోహిత్ పెనుమత్స ఎడిటింగ్ అన్నీ కూడా సూపర్బ్‌గా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు.

Also Read- Naari Naari Naduma Murari Review: శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారీ’.. ఫుల్ రివ్యూ

ప్రతి దావత్‌లోనూ, ఫంక్షన్‌లోనూ..

ఈ పాట ఇంతటి రెస్పాన్స్‌ను రాబట్టుకున్నందుకు మేకర్స్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సాంగ్ ఇలానే ఇంకా ఆదరణ పొంది, రాబోయే రోజుల్లో ప్రతి దావత్‌లోనూ, ఫంక్షన్‌లోనూ మారుమోగిపోవడం ఖాయమని వారు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ‘అమీర్ లోగ్’ టీమ్ తమ మొదటి సాంగ్‌తోనే బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ మొదలుపెట్టేశారు. ‘అవ్వల్ దావత్’ సాంగ్ ఇస్తున్న జోష్ చూస్తుంటే, సినిమా కంటెంట్ కూడా అదే స్థాయిలో పేలుతుందని ఆడియన్స్ నమ్ముతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్‌ను అతి త్వరలోనే తెలియజేస్తామని ఈ సందర్భంగా మేకర్స్ వెల్లడించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Peddi: ‘పెద్ది’ ఈ ఫొటో ఎక్కడిది? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్!

PuriSethupathi: పూరిసేతుపతి మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌కి.. ఎట్టకేలకు మోక్షం!

Anil Ravipudi: శంకర్ వరప్రసాద్ గారి కోసం నయన్‌కు ‘దృశ్యం’ కథ చెప్పిన అనిల్ రావిపూడి!

Ashika Ranganath: రష్మిక, శ్రీలీల అవుట్.. ఆషికాకు టాలీవుడ్ ఫిదా!

Rahul Sipligunj: ట్రెండింగ్‌లో ‘అమీర్ లోగ్’.. ‘అవ్వల్ దావత్’ సాంగ్..