Seetha Payanam: ‘సీతా పయనం’ నుంచి బసవన్న వచ్చేశాడు..
Seetha Payanam Dhruva Sarja (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Seetha Payanam: సంక్రాంతి స్పెషల్‌గా ‘సీతా పయనం’ నుంచి బసవన్న వచ్చేశాడు..

Seetha Payanam: మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ (Action King Arjun) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న నూతన చిత్రం ‘సీతా పయనం’ (Seetha Payanam). శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ (Aishwarya Arjun) హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం కాబోతోన్నారు. ఈ మూవీలో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మరో సర్‌ప్రైజ్ కూడా ఆయన ప్లాన్ చేశారు. అదేంటంటే.. అర్జున్ మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా కూడా ఇందులో మరో స్పెషల్ కామియో రోల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, పొంగల్‌ని పురస్కరించుకుని ఇందులో ధ్రువ సర్జా (Dhruva Sarja) పాత్రను పరిచయం చేశారు.

Also Read- Vijay Deverakonda: అమ్మకు ప్రామిస్ చేశా.. నెక్ట్స్ సంక్రాంతికి పక్కాగా..!

‘బసవన్న’ వచ్చేశాడు

ఇందులో ధ్రువ సర్జా ‘బసవన్న’ పాత్రలో కనిపించనున్నారనే విషయం తెలియజేస్తూ.. ‘బసవన్న’ పాటను (Basavanna Lyrical Song) విడుదల చేశారు. బసవన్నగా ధ్రువ సర్జా అద్భుతమైన పాత్రలో కనిపించబోతోన్నట్టుగా ఈ పాటను చూస్తే అర్థమవుతోంది. ఈ పాటకు అనూప్ రూబెన్స్ ఇచ్చిన బాణీ ఎంతో పవర్ ఫుల్‌గా ఉంది. ఈ సినిమాలో ‘బసవన్న’ పాత్ర ఎంత ఇంపార్టెంట్ అన్నది ఈ పాటతో తెలిసేలా.. కాసర్ల శ్యామ్ ఇచ్చిన లిరిక్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. నకాస్ అజిజ్, ఎల్. కీర్తన ఈ పాటను ఎంతో వినసొంపుగా పాడారు. ఈ పాటకు లలితా శోభి, శ్రష్టి వర్మ కొరియోగ్రఫీ అందించారు. ఈ మూవీకి ధ్రువ సర్జా మెయిన్ అస్సెట్‌గా నిలవబోతున్నాడనేది ఈ పాట రూపుదిద్దుకున్న తీరు స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Also Read- The Raja Saab: ముగ్గురు భామలతో రాజా సాబ్.. పోస్టర్ అదిరిపోలా..!

యాక్షన్ కింగ్‌కు ఈ సినిమా ఎంతో కీలకం

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ‘సీతా పయనం’ హిట్టవడం యాక్షన్ కింగ్ అర్జున్‌కు ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే, ముందు ఒక హీరోతో అనుకుని, కొంతమేర షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఆ హీరో తప్పుకోవడంతో, ఈ ప్రాజెక్ట్‌పై, అర్జున్‌పై రకరకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. అయినా సరే, అర్జున్ తన సత్తా చాటేందుకు వెంటనే మరో హీరోతో ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణుల బృందం పని చేశారు. జి బాలమురుగన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. చిత్రంలోని స్టంట్ సన్నివేశాలకు కిక్ యాస్ కాళీ కొరియోగ్రఫీ అందించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ashika Ranganath: రష్మిక, శ్రీలీల అవుట్.. ఆషికాకు టాలీవుడ్ ఫిదా!

Rahul Sipligunj: ట్రెండింగ్‌లో ‘అమీర్ లోగ్’.. ‘అవ్వల్ దావత్’ సాంగ్..

Sai Durgha Tej SYG: ఎద్దును పట్టుకుని.. ఊరమాస్ అవతార్‌లో తేజ్.. పోస్టర్ వైరల్!

Municipal Elections: మున్సీపాలిటీ వార్డుల రిజర్వేషన్‌పై ఉత్కంఠ.. నేడో రేపో రిజర్వేషన్ల ఖరారు

kite Accident: పండుగరోజు విషాదం.. గాలిపటం ఎగిరేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి గాయాలు