Mahabubabad News: మహబూబాబాద్ జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. గతంలో నాలుగు మున్సిపాలిటీలు ఉండగా నూతనంగా కేసముద్రం మండల కేంద్రాన్ని మరో గ్రామాలు విలీనం చేసి మున్సిపాలిటీగా జనవరి 17 2025లో అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఐదు మున్సిపాలిటీల్లో 98 వార్డులు ఉండగా వాటన్నింటికీ రిజర్వేషన్లను ఎన్నికల కమిషన్ ఖరారు చేసింది. అయితే మరిపెడ డోర్నకల్ మున్సిపాలిటీలో బీసీలకు సరైన స్థానాలను కేటాయించలేదని ఆ సంఘం నేతలు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు.
మహబూబాబాద్ మున్సిపాలిటీ..
మహబూబాబాద్ మున్సిపాలిటీ మొత్తం 36 వార్డులు ఉండగా అందులో ఎస్టీ జనరల్ 4, ఎస్టి మహిళ 3, ఎస్సీ జనరల్ 3, ఎస్సీ మహిళ 2, బీసీ జనరల్3, బీసీ మహిళ 3, జనరల్ మహిళ 8, జనరల్ రిజర్వుడ్ 8 స్థానాలను కేటాయించారు. ఇందుకు సంబంధించిన వివరాలను నోటీఫికేషన్లో పొందుపరిచారు.
తొర్రూరు మున్సిపాలిటీ
తొర్రూరు మున్సిపాలిటీ(Thorruur Municipality)లో మొత్తం 16 వార్డులు ఉండగా అందులో ఎస్టీ జనరల్ 1, ఎస్టి మహిళ 1, ఎస్సీ జనరల్ 2, ఎస్సీ మహిళ 1, బీసీ జనరల్ 2, బీసీ మహిళ 1, జనరల్ మహిళ 5, జనరల్ 3 మూడు స్థానాలను కేటాయించారు.
డోర్నకల్ మున్సిపాలిటీ
మహబూబాబాద్, తొర్రూరు మున్సిపాలిటీల తర్వాత పెద్ద మున్సిపాలిటీకి డోర్నకల్ అత్యంత రాజకీయ పరిణామాలు ఉంటాయి. ఇక్కడ మొత్తం 15 వార్డులు జనాభా ప్రాతిపదికన విభజించారు. అందులో ఎస్టీ మహిళ 2, ఎస్టి జనరల్ 2, ఎస్సీ జనరల్ 2, ఎస్సీ మహిళ 1, జనరల్ మహిళా 4, జనరల్ 4 స్థానాలు కేటాయించడంతో అక్కడ రసవత్తరంగా మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇక్కడ బీసీలకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంతో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.
మరిపెడ మున్సిపాలిటీ
డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గం అయినప్పటికీ రాజకీయాల మొత్తం మర్రిపేడ మండల కేంద్రంగానే నడుస్తూ ఉంటాయి. ఇక్కడ మొత్తం 15 వార్డులు విభజించగా, అందులో ఎస్టి మహిళా 3, ఎస్టి జనరల్ 3, ఎస్సీ జనరల్ 1, జనరల్ మహిళ 4, జనరల్ కేటగిరీ లో 4 నాలుగు స్థానాలు కేటాయించారు. ఇక్కడ కూడా బీసీలకు ఒక్క వార్డ్ కేటాయించకపోవడంతో బీసీలు అసహనానికి గురవుతున్నారు.
కేసముద్రం మునిసిపాలిటీ
మహబూబాబాద్, తొర్రూరు, డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీల తర్వాత మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పడిన కేసముద్రం మున్సిపాలిటీలోనూ మొత్తం 16 వార్డులుగా విభజించారు. ఇక్కడ ఎస్సీ మహిళా 1, ఎస్సీ జనరల్ 1, ఎస్టి మహిళ 1, ఎస్టీ జనరల్ 2, బీసీ జనరల్ 2, బీసీ మహిళ 1, జనరల్ మహిళ 5, జనరల్ 3 స్థానాలు కేటాయించి రానున్న మునిసిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సంసిద్ధులవుతున్నారు. ముఖ్యంగా డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీలో బీసీలకు ఒక్క వార్డు కూడా కేటాయించకపోవడంతో ఆయా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. రిజర్వేషన్లను మార్చి మళ్లీ బీసీలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Mega Blockbuster: సంక్రాంతికి కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’..

