Yellamma: టాలీవుడ్‌లో కొన్నాళ్లుగా వినిపిస్తున్న పేరు ‘ఎల్లమ్మ’ (Yellamma). ‘బలగం’ (Balagam) సినిమాతో ఓ సామాన్యమైన కథను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసిన దర్శకుడు వేణు యెల్దండి (Venu Yeldandi), తన రెండో ప్రయత్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చాలా కాలంగా ఈ సినిమా గురించి రకరకాల చర్చలు నడుస్తున్నప్పటికీ, ఎట్టకేలకు ఈ సంక్రాంతి పండుగ వేళ మేకర్స్ ఒక బిగ్ అప్‌డేట్‌తో ముందుకు వచ్చారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి హీరో ఎవరనే విషయంపై ఇండస్ట్రీలో పెద్ద యుద్ధమే నడిచింది. నేచురల్ స్టార్ నాని, యంగ్ హీరో నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్ ఇలా చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు వినిపిస్తున్న లేటెస్ట్ అండ్ క్రేజీ టాక్ ఏంటంటే.. ఈ సినిమాతో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) హీరోగా వెండితెర అరంగేట్రం చేయబోతున్నారు. చాన్నాళ్లుగా దేవి శ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు, అది వేణు యెల్దండి వంటి కంటెంట్ మీద పట్టున్న దర్శకుడి చేతుల్లో పడటం ఇప్పుడు అందరినీ ఎగ్జైట్ చేస్తోంది.
Also Read- Chiranjeevi MSG Party: వెంకీమామ ఎక్కడున్నా అదే సందడి.. చిరు పార్టీ వీడియో వైరల్!
గ్లింప్స్ విడుదల సమయం ఖరారు
చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించి కేవలం టైటిల్ పోస్టర్‌ను మాత్రమే ఇప్పటివరకు వదిలి.. సస్పెన్స్‌ను మెయింటైన్ చేస్తూ వచ్చింది. అయితే ఆ సస్పెన్స్‌కు తెరదించుతూ, జనవరి 15న సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకు ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ గ్లింప్స్‌లోనే హీరో ఎవరనేది అధికారికంగా రివీల్ చేయనున్నారనేది ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ గ్లింప్స్ చాలా రా అండ్ రస్టిక్‌గా వచ్చిందని, దేవి శ్రీ ప్రసాద్ నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ఇరగ్గొట్టేశాడని టాక్ నడుస్తోంది. స్టార్ ప్రొడ్యూసర్లు దిల్ రాజు, శిరీష్ తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్‌పై ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘బలగం’ సినిమాను ఎంత లో-బడ్జెట్‌లో తీసి ఎంతటి సక్సెస్‌ను సాధించారనేది తెలియంది కాదు. ఇప్పుడు ‘ఎల్లమ్మ’ కోసం దిల్ రాజు భారీ బడ్జెట్‌ను కేటాయించినట్లు తెలుస్తోంది. గ్లింప్స్‌లోనే సినిమా గ్రాండియర్ ఏంటనేది క్లారిటీ ఇవ్వనున్నారనేలా కూడా టాక్ వినిపిస్తోంది.
Also Read- Rithu Chowdary: వాళ్లిద్దరి కంటే ముందు.. నేను చనిపోవాలని కోరుకుంటా!
పాన్ ఇండియా సినిమాగా ‘ఎల్లమ్మ’
వేణు యెల్దండి శైలి అంటేనే తెలంగాణ మట్టి వాసన, బలమైన ఎమోషన్స్. ఈ సినిమాలో కూడా ఎల్లమ్మ అనే టైటిల్‌తోనే ఒక ఆధ్యాత్మిక, మాస్ ఎలిమెంట్ ఏదో ఉందని ఫ్యాన్స్ ఊహిస్తున్నారు. ఒకవేళ డీఎస్పీ నిజంగానే హీరోగా నటిస్తే, దానికి ఆయనే సంగీతం కూడా అందిస్తారు కాబట్టి మ్యూజికల్‌గా సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. దేవి శ్రీ ప్రసాద్ అరాచకం ఇక మ్యూజిక్ డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా హీరోగా కూడా మొదలవ్వబోతోందని ఫిక్సయిపోవచ్చు. అన్నట్టు.. ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సో.. మరికొన్ని గంటల్లో రాబోయే ఈ గ్లింప్స్ టాలీవుడ్‌లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.
With the divine blessings of Goddess…
Welcoming you all to the world of #Yellamma ❤️🔥#YellammaGlimpse tomorrow at 4:05 PM. #SVC61@VenuYeldandi9 #DilRaju #Shirish @svc_official @Tseries @tseriessouth pic.twitter.com/TJ7ThIlKC2— Sri Venkateswara Creations (@SVC_official) January 14, 2026
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

