Anaganaga Oka Raju: హిట్టు కొట్టేశామంటోన్న టీమ్.. సంబరాల్లో!
Anaganaga Oka Raju (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Anaganaga Oka Raju: హిట్టు కొట్టేశామంటోన్న టీమ్.. సంబరాల్లో రాజు!

Anaganaga Oka Raju: ఈ సంక్రాంతికి నవ్వుల బొనాంజా అన్నట్లుగా విడుదలవుతున్న చిత్రాలన్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లోడై వచ్చాయి. సంక్రాంతికి రావాల్సిన సినిమాలన్నీ థియేటర్లలోకి వచ్చేశాయి. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) హీరోగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju) థియేటర్లలో అడుగుపెట్టడంతో పాటు పాజిటివ్ టాక్‌ని కూడా రాబట్టుకుంది. మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవీన్‌ పొలిశెట్టి.. ఇప్పుడు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రీమియర్స్‌తో పాటు, విడుదలైన అన్ని థియేటర్లలో మంచి టాక్‌ని సొంతం చేసుకోవడంతో.. మేకర్స్ తమ ఆనందాన్ని తెలియజేసేందుకు సక్సెస్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

Also Read- Mega Family: మెగా ఇంట మొదలైన సంక్రాంతి సందడి.. ‘భోగి’ స్పెషల్ వీడియో వచ్చేసింది

నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్

నవీన్‌ పొలిశెట్టి మాట్లాడుతూ.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా సినిమాకు ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోల నుంచే అద్భుతమైన స్పందన వస్తోంది. థియేటర్‌లో ప్రతి ఒక్కరూ సినిమాని ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంటూ ప్రేక్షకుల నుంచి ఈ స్థాయి స్పందన రావడం నిజంగా సంతోషంగా ఉంది. ఇంకా సినిమా చూడనివారు వెంటనే టికెట్ బుక్ చేసుకొని వెళ్ళండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూశాము. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అనే తేడా లేకుండా.. సినిమా అంతా ప్రేక్షకులు నవ్వుతూనే ఉన్నారు. అదే సమయంలో క్లైమాక్స్‌లో ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అంటుంటే.. ఇంకేం కావాలి. చాలా హ్యాపీగా ఉంది. హాయిగా నవ్వుకుందామని వస్తే, నవ్వుతో పాటు చివరిలో కంటతడి పెట్టించారని ప్రశంసిస్తున్న అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మాకు మద్దతుగా నిలిచిన మీడియాకు ధన్యవాదాలని అన్నారు.

Also Read- Nidhhi Agerwal: మంచి వాళ్లకు తప్పకుండా మంచే జరుగుతుంది.. ‘రాజా సాబ్’పై నిధి!

అన్ని చోట్లా పాజిటివ్ టాక్

హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందన చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ ఫలితం ఇప్పటి వరకు ఉన్న మా అందరి కష్టాన్ని మర్చిపోయేలా చేసింది. నేను పోషించిన చారులత పాత్ర.. చాలా బాగుందని అందరూ ప్రశంసించడం ఆనందంగా ఉంది. నటిగా ఇది నాకు ఛాలెంజింగ్ పాత్ర. మొదటిసారి ఇలాంటి క్యూట్ మాస్ కామెడీ చేశాను. సంక్రాంతి పండుగకు నేను నటించిన సినిమా విడుదలై విజయం సాధించడం నాకు మరింత ఆనందాన్నిచ్చింది. అందరూ ఈ సినిమాను థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Naga Vamsi) మాట్లాడుతూ.. ‘అనగనగా ఒక రాజు’ సినిమాపై ముందు నుంచి నమ్మకంగా ఉన్నాము. ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. కొన్నాళ్లుగా వినబడుతున్న అన్నింటికి సమాధానం ఇచ్చినట్లయింది. అన్ని చోట్లా సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. ప్రేక్షకులు సినిమాలో కామెడీని ఎంత ఎంజాయ్ చేస్తున్నారో.. అంతకన్నా ఎక్కువ చివరిలో ఎమోషన్‌కి కనెక్ట్ అవుతున్నారు. రానున్న రోజుల్లో థియేటర్ల సంఖ్య పెంచుతాము. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వసూళ్లు వస్తాయని ఆశిస్తున్నామని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Nidhhi Agerwal: పవర్ స్టార్, రెబల్ స్టార్ దగ్గర ఏం నేర్చుకున్నానంటే..

Chiranjeevi MSG Party: వెంకీమామ ఎక్కడున్నా అదే సందడి.. చిరు పార్టీ వీడియో వైరల్!

Hyderabad Crime: అల్వాల్‌లో విషాదం.. డిగ్రీ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య!

BMW: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అద్భుతంగా రావడానికి కారణం ఎవరంటే?

Khammam Police: ఖమ్మం జిల్లాలో కోడి పందేల స్థావరాల స్థావరాలపై.. డ్రోన్‌ కెమెరాల సహాయంతో పోలీసుల నిఘా!