AEO Workload Issues: రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓ)లు పని భారంతో సతమతమవుతున్నారు. 50 రకాల విధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో విధులు నిర్వర్తించ లేక సతమతమవుతున్నారు. కొంతమంది మనోవేదన గురవుతున్నారు. మరోవైపు ప్రభుత్వం నుంచి రావలసిన మెయింటెన్స్ ఖర్చులు సైతం రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని గ్రామపంచాయతీలను 2604 క్లస్టర్ గా వ్యవసాయ శాఖ విభజించి.. ప్రతి క్లస్టర్ కు ఒక ఏఈఓ ను నియమించింది. ప్రతి ఏ ఈ ఓ కు 5000 ఎకరాలపైగా ( మూడు నుంచి ఐదు గ్రామాలు ) అప్పగించింది. ఈ భూములపై సర్వే చేయాల్సి ఉంది. పంటల వివరాలను రబీ, ఖరీఫ్ సమయంలో పోర్టల్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. సర్వేల వారీగా రైతు వివరాలను ఎన్ని ఎకరాల్లో ఏ ఏ పంటలు వేశారు అనేది యాప్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. దాని ప్రకారమే ప్రభుత్వం రైతు భరోసా అందజేస్తుంది.
ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన
అయితే ఒక్కొక్కఏఈఓ కు 5000 ఎకరాలు సర్వే చేయాల్సి ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 25 మీటర్ల పరిధి నుంచి యాప్ లో ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని జిల్లాల్లో ఎత్తైన ప్రదేశాలు, కొండలు, గుట్టల ప్రదేశాలు, వాగులు, వంకలు అవతల, సరైన రోడ్లు లేని భూములకు వెళ్లి సర్వే చేయాల్సి వస్తున్నాడంట తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు బై నెంబర్లు ఉన్న భూములు సర్వే విషయంలోనూ రెవెన్యూ శాఖ సహకారం తీసుకోవడంలో కొంత గడువు పడుతుందని.. నిర్ణీత సమయంలో భూ వివరాల నమోదు చేయకపోతే ఉన్నత అధికారుల నుంచి ఒత్తిడిలు వస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వ్యవసాయ విస్తరణ అధికారులకు 50 రకాల పనులలో ప్రధానంగా క్లస్టర్ రీ ఆర్గనైజేషన్, రైతు వేదికల మైంటెన్స్ ఖర్చులు, ట్యాబ్లు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రైతు భరోసా, రైతు బీమా, క్రాప్ బుకింగ్, యూరియా యాప్, క్రాప్ కటింగ్ ఎక్స్పరిమెంట్, పాడి ప్రొక్యూర్ మెంట్, మీ సర్వే మైక్రో ఇరిగేషన్ సర్వే, ఫార్మర్ రిజిస్ట్రీ యాప్, ఇతర డిపార్ట్మెంట్ శాఖల విధులు అప్పగిస్తున్నారు. దీంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
పత్తి కొనుగోలు సంబంధించిన బాధ్యతలు
ఉన్న విధులతో సతమతమవుతున్న ఏ ఈ ఓ లకు.. మళ్లీ ప్రభుత్వం పత్తి కొనుగోలు సంబంధించిన అంశాన్ని అప్పగించింది. కాటన్ మిల్లుల వద్ద పత్తి వివరాలను.. రైతుల వివరాలను అప్లోడ్ చేసి.. సీరియల్ ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ శాఖ తోటి ఏఈఓ లకు సంబంధం లేకుండా ఆ బాధ్యతలను అప్పగించడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొంతమంది పరిపాలనలతో లీవులు పెడుతున్నట్లు సమాచారం.
మెయింటెన్స్ ఖర్చులు రాక..
వ్యవసాయ విస్తరణ అధికారులకు మెయింటెన్స్ ఖర్చులు ఇస్తామని.. ప్రతి నెల 9000 ఇస్తామని చెప్పి రెండు.. మూడేళ్ల క్రితం మూడు నెలల వరకు ఇచ్చింది. ఆ తర్వాత ఇవ్వకపోవడంతో వేతనం నుంచి ఖర్చ చేయాల్సిన పరిస్థితి దాపురించిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఐదువేల ఎకరాలు సర్వే.. 50 రకాల విధులు.. మరోవైపు మెయింటెన్స్ ఖర్చులు సైతం రాకపోవడంతో పడుతున్న ఇబ్బందులు కావు. ఒక పని పూర్తికాకముందే మరో పని అప్పగిస్తుండడంతో ఏ పని చేయాలో తెలియక ఏ ఈ ఓ లు అయోమయానికి గురవుతున్నారు. అంతేకాకుండా నిర్ణీత సమయంలో పనిచేయాలని ఆదేశాలిస్తుండడంతో సతమతమవుతున్నారు. క్షేత్రస్థాయిలో ఏఈవోలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. అంతేకాకుండా రైతు భరోసా రాకున్నా.. రుణమాఫీ కాకుండా రైతులు ఏ ఈ ఓ లను నిలదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని భారం తగ్గించి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
Also Read: Hydra: హైడ్రా ప్రజావాణికి ఒక్కరోజే 76 ఫిర్యాదులు.. నేరుగా స్వీకరించిన కమిషనర్ రంగనాథ్!

