Vegetable Farming: కూరగాయలు, ఆకు కూరలు, మునగ, పుచ్చ, దోస, కీర మొదలైన పంటలలో నూతన, ఆధునిక పద్దతులు పాటించడంతో మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు సాగుచేయాలని చేస్తున్న అవగాహన కార్యక్రమాలతో జిల్లాలో రోజు రోజుకు కూరగాయల సాగు విస్తీర్ణం జిల్లాలో విపరీతంగా పెరుగుతుందని హార్టికల్చరల్ అధికారి మరియన్న(Mariyanna) వెల్లడించారు. పెరుగుతున్న టమాటా సాగు-షేడ్ నెట్ లలో, ట్రెల్లిస్, ఎగబాకించే పద్ధతి, పందిరి సాగు మొదలైన నూతన ఆధునిక పద్ధతులు. రైతులు నిత్యం ఆదాయం ఇచ్చే కూరగాయల పంటల సాగు వైపు మరలాలి. జిల్లాలో 5 వేల ఎకరాల పై చిలుకులో కూరగాయల సాగు చేస్తున్నారు. రైతులు మార్కెట్ డిమాండ్ ఉన్న మునగ, దోస, కీర, కాలిఫ్లవర్, క్యాబేజ్, బీట్రూట్, క్యారెట్, కంద, చేమ గడ్డ, చిలకడదుంప, పుచ్చ మొదలైన పంటలు సాగు చేయాలి. కూరగాయల సాగుకు పలు రాయితీలు ఎకరానికి రూ.2100/- అంతర పంటల సాగుకు, ఎకరానికి రూ.10,000/- కూరగాయల నారు మొక్కలను సరఫరా రాయితీ సౌకర్యాలు సద్వినియోగం చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.
నాలుగు ఐదురోజులు తాజాగా నిల్వ
టమాట(Tomato) పంటను యాసంగి కాలంలో రైతులు సాగుచేస్తున్నారు. రవాణాకు అనుగుణంగా నాలుగు ఐదురోజులు తాజాగా నిల్వ వుంటుంది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటం వలన దిగుబడి ఆశాజనకంగా ఉంది. దిగుబడి అధికంగా రావడం వలన రైతులు ఆనందంగా ఉన్నారు. మార్కెట్ కూడా అందుబాటులో ఉండటం వలన రైతుకు మంచి ధర లభిస్తుంది. అధిక ఆదాయం కొరకు రైతులు టమాట ఉపఉత్పత్తులు అయిన టమాట పచ్చళ్ళు మరియు సాస్‌ల తయారీలో ఉపయోగించి అదనపు ఆదాయం పొందవచ్చు.
Also Read: CM Revanth Reddy: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే.. పది శాతం జీతం కట్: సీఎం రేవంత్ రెడ్డి
టమాటతో లాభాలు పోషకాలు
సీజన్ లో దొరికే టమాట – అందానికి ఆరోగ్యానికి బాట
విటమిన్లు ఏ, బీ, సీ, కే, కాల్షియం, పొటాషియం కలిగి ఉంటుంది
ఇందులో దొరికే లైకోఫిన్ యాంటి యాక్సిడెంట్ గా పనిచేస్తుంది
దీనిలో ఉండే లెప్టిన్ అనే ప్రోటీన్ వల్ల శరీరం బరువు తగ్గుతుంది
కంటి సమస్యలు రాకుండా చేస్తుంది – దంతాలు పటిష్టంగా ఉంచుతుంది
మొటిమలు తగ్గిస్తుంది – చక్కర శాతం క్రమబద్ధీకరిస్తుంది
చర్మాన్ని శుభ్రపరుస్తుంది – మెరిపునిస్తుంది, యవ్వనంగా కనిపించేటట్లు చేస్తుంది
చర్మ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తుంది – బి.పి నియంత్రిస్తుంది, కొవ్వు తగ్గిస్తుంది
ఎకరానికి లక్ష రూపాయలు
మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలని, నిత్యం రోగనిరోధక శక్తికి, ఆరోగ్యంగా ఉండటానికి పోషకాలు అందించే పండ్ల తోటలు అయిన జామ, నిమ్మ, అరటి, బొప్పాయి, సీతాఫలం, పనస, నేరేడు, అవకాడో, ఫ్యాషన్ ఫ్రూట్, కూరగాయలు, ఆకు కూరలు, మునగ, వెదురు మొదలైనవి సాగు చేయాలని తద్వారా ఎకరానికి లక్ష రూపాయలు నికర ఆదాయం పొందాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రతి రైతు పొలం గట్ల మీద, పొలం చుట్టూ, పెరట్లో, ఆయిల్ పామ్, పండ్ల తోటలలో అంతర పంటలుగా, డాబాల మీద, ఇంటి ముంగిట రోజువారి కూరగాయల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, నూతన రకాల సాగు, ప్రోట్రేలో నారు పెంపకం, ఎత్తు మడులు, మల్చింగ్, బిందు సేద్యం, ఫర్టిగేషన్, వేప పిండి, ఆముదం పిండి వాడకం, వేప నూనె పిచికారి చేయటం, పసుపు రంగు అట్టల వాడకం, సిఫారసు చేసిన ఎరువులు వాడటం, పందిరిపై కూరగాయల సాగు, ట్రెల్లిస్ మెథడ్ లో టమాటా సాగు మొదలైన పద్ధతులు పాటించాలని తెలిపారు.
Also Read: Kite Festival: నేడు పరేడ్ గ్రౌండ్స్‌లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్.. నోరూరించే మిఠాయిలతో పాటు..!

