Supreme Court: అవినీతి సెక్షన్​ 17 ఏ పై.. ఎటూ తేలని వ్యవహారం
Supreme Court (imagecredit:twitter)
Telangana News, హైదరాబాద్

Supreme Court: అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్​ 17 ఏ పై.. ఎటూ తేలని వ్యవహారం

Supreme Court: అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్​ 17ఏ రాజ్యాంగ బద్దతపై సుప్రీం కోర్టులో ఎటూ తేలలేదు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనంలోని జడ్జిలు వేర్వేరుగా అభిప్రాయాలు వెల్లడించారు. జస్టిస్​ విశ్వనాథన్​(Justice Viswanathan) ఈ సెక్షన్​ ను సమర్థించగా జస్టిస్ నాగరాత్న(Justice Nagarathna) ఈ సెక్షన్​ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. దాంతో ఈ అంశాన్ని స్పెషల్ బెంచ్ కు బదిలీ చేసేందుకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి నివేదించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్​ 17ఏ ప్రభుత్వ అధికారులు విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలపై పోలీసులు విచారణ జరపాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి అని చెబుతోంది. కాగా, ఈ సెక్షన్​ చెల్లుబాటును సవాల్ చేస్తూ సెంటర్​ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుప్రీం కోర్టులో పిటిషన్ ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీం కోర్టు జడ్జిలు జస్టిస్ విశ్వనాథన్, జస్టిస్ నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.

ఇది రాజ్యాంగ బద్ధమే

ఈ క్రమంలో జస్టిస్ విశ్వనాథన్ తన తీర్పును వెలువరిస్తూ ఆత్మాభిమానం ఉన్న వ్యక్తికి అపఖ్యాతి కంటే మరణమే మేలు అని వ్యాఖ్యానించారు. నేటి సాంకేతిక, సోషల్ మీడియా యుగంలో ఒకసారి పరువు పోతే ఆ తరువాత నిర్దోషిగా తేలిగా ప్రయోజనం ఉండదన్నారు. అధికారులను వేధింపులకు గురి చేయకుండా సెక్షన్​ 17ఏ అవసరమని వ్యాఖ్యానించారు. ఇది రాజ్యాంగ బద్ధమే అని పేర్కొన్నారు. కాగా, జస్టిస్​ నాగరత్న తీర్పును వెలువరిస్తూ సెక్షన్​ 17ఏ అవినీతికి పాల్పడుతున్న అధికారులకు రక్షణ కల్పిస్తోందని వ్యాఖ్యానించారు. అవినీతికి పాల్పడే వారిపై ఎలాంటి దయాదాక్షిణ్యాలు చూపించాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి అధికారులను విచారించటానికి ముందస్తు అనుమతి అవసరం లేదని అభిప్రాయ పడ్డారు.

Also Read: Kuchukulla Rajesh Reddy: ఆ జిల్లాలో పారిశుధ్య సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటాం : ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి!

2018లో..

2018లో అవినీతి నిరోధక చట్టాన్ని సవరణ చేసిన కేంద్ర ప్రభుత్వం అందులో సెక్షన్​ 17ఏను చేర్చింది. కక్షసాధింపు చర్యల నుంచి నిజాయితీగల అధికారులను రక్షించేందుకే ఈ సవరణ చేసినట్టు పార్లమెంట్​‌లో ప్రకటించింది. 2018 తరువాత నమోదైన కేసులకే ఈ సెక్షన్​ వర్తిస్తుందని పేర్కొంది. ఈ సెక్షన్​ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి నమోదైన నేరాల్లో వారిని విచారించటానికి ముందస్తు అనుమతి తప్పనిసరి ప్రకటించింది. తప్పు చేసో.. అవినీతికి పాల్పడో ఎవరైన​ అధికారి దొరికితే సదరు ఉద్యోగిని పోస్టు నుంచి తొలగించే అధికారం ఉన్నవారి అనుమతి తీసుకుని విచారణ జరపాల్సి ఉంటుంది. ఇక, సదరు ఉన్నతాధికారి మూడు నెలల్లో తన నిర్ణయాన్ని వెల్లడించాలి. మరో నెల రోజులపాటు గడువును పొడిగించే అవకాశం ఉంటుంది. ఆ తరువాత అవినీతికి పాల్పడిన, తప్పు చేసిన అధికారులను విచారించాలా? లేదా? అన్నదానిపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలి.

Also Read: Damodar Raja Narasimha: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ శాఖలో 996 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్!

Just In

01

Yash Toxic: నెటిజన్ల దెబ్బకు ఇన్స్టా అకౌంట్ డిలేట్ చేసిన టాక్సిక్ నటి.. ఎందుకంటే?

AEO Workload Issues: పని భారంతో ఏఈవోలు సతమతం.. విజ్ఞప్తులు చేసిన ఉన్నతాధికారులు నో రెస్పాన్స్!

Mahesh Kumar Goud: మీకు భవిష్యత్తు లేదు.. అందుకే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు: మహేష్ కుమార్ గౌడ్

KTR: మరో కొత్త దందాకు ప్రభుత్వం తెరలేపిందని.. ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్..!

Megastar Chiranjeevi: ‘మన శంకరవరప్రసాద్ గారు’ రెండు రోజుల గ్రాస్ ఎంతంటే?.. బాస్ కొల్లగొట్టాడుగా..