Kuchukulla Rajesh Reddy: నాగర్‌కర్నూల్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి (Kuchukulla Rajesh Reddy)తెలిపారు. మున్సిపాలిటీలోని 8వ వార్డులో పర్యటించారు. అలాగే ఎండబెట్లలో 1కోటి 50లక్షలతో నిర్మంచనున్న బాలసదన్, దేశిఇటిక్యాల-మంతటి మధ్య 3కోట్ల 50లక్షలతో నిర్మించే హైలెవల్ వంతెన పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం తాడూరు మండల కేంద్రంలో బండలాగుడు పోటీలను ప్రారంభించారు.
చర్యలు తీసుకుంటాం
ఇందులో భాగంగా పలు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల పూర్తయిన నూతన రహదారులు మరియు డ్రైనేజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలసదన్ భవనం నిర్మాణం ద్వారా అనాధ మరియు ఆశ్రయం లేని పిల్లలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. పట్టణంలో సీసీరోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి చేయడం జరుగుతుంది అన్నారు. ఇటీవల 40 కోట్ల రూపాయలు మంజూరు అయ్యావన్నారు. నాగర్‌కర్నూల్ పట్టణాన్ని పారిశుధ్య సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమీషనర్ నాగిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు ఉన్నారు.
Also Read: MLA Rajesh Reddy: కాంగ్రెస్ పార్టీనే దేశానికి రక్ష: ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి

