Telangana Police: కలకలం సృష్టించిన కేసులపై సిట్ ఏర్పాటు
Telangana Police (imagecredit:twitter)
Telangana News, హైదరాబాద్

Telangana Police: రాష్ట్రంలో కలకలం సృష్టించిన ఆ రెండు కేసులపై సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.?

Telangana Police: ఇటీవలి కాలంలో ఇటు రాజకీయ.. అటు అధకారవర్గాల్లో తీవ్ర కలకలం సృష్టంచిన రెండు కేసుల విచారణ కోసం డీజీపీ శివధర్ రెడ్డి(DGP Shivadhar Reddy) సిట్​‌ను ఏర్పాటు చేశారు. దీనికి హైదరాబాద్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్(VC Sajanar)​ నేతృత్వం వహించనున్నారు. ఇక, సిట్​ బృందంలో ఎనిమిది మంది అధికారులను సభ్యులుగా నియమించారు.

సీఎం ఫోటోలను..

ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి(CM Revanth Reddy) ఫోటోలను అసభ్యకరంగా మార్ఫ్​ చేసి తెలంగాణ పబ్లిక్​ టీవీ వాట్సాప్​ గ్రూప్​(Telangana Public TV WhatsApp Group) నకు చెందిన కావలి వెంకటేశ్(Venkatesh)​ వేర్వేరు గ్రూపుల్లో షేర్​ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్​ నాయకుడు గూళ్ల నర్సింహ మద్దూర్​(Gulla Narasimha Maddur) పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం ఫోటోలను అభ్కంతరకరంగా తయారు చేసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన కావలి వెంకటేశ్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు నారాయణ పేట జిల్లా మద్దూరు పోలీసులు ఈనెల 11న పోలీసులు కేసులు నమోదు చేశారు.

Also Read: Ilaiyaraaja: ‘మన శంకర వరప్రసాద్ గారు’.. మ్యాస్ట్రో అనుమతి తీసుకున్నారా?

ఐఏఎస్​ అధికారిణిపై..

కాగా, ఇటీవల ఓ మహిళా ఐఏఎస్​ అధికారిణిని కించ పరిచే విధంగా కొన్ని ఛానళ్లలో వార్తలు ప్రసారం అయిన విషయం తెలిసిందే. దీనిపై ఐఏఎస్​ అధికారుల సంఘం కార్యదర్శి జయేశ్​ రంజన్(Jayesh Ranjan)​ హైదరాబాద్ సీసీఎస్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీసీఎస్ పోలీసులు రెండు న్యూ ఛానళ్లతోపాటు ఏడు యూ ట్యూబ్​ ఛానళ్లపై కేసులు నమోదు చేశారు.

సెక్షన్లు ఇవే..

రెండు కేసుల్లో నిందితులుగా ఉన్నవారిపై అటు మద్దూరు.. ఇటు సీసీఎస్​ పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్​ 75, 78. 79. 351(1), 352(2) సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ రెండు కేసులు రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించటంతోపాటు చర్చనీయమయ్యాయి. ఈ నేపథ్యంలోనే రెండు కేసుల్లో సమగ్ర విచారణ కోసం డీజీపీ శివధర్ రెడ్డి సిట్​ ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంట్లో నార్త్ రేంజ్ జాయింట్​ సీపీ శ్వేత, చేవెళ్ల జోన్​ డీసీపీ యోగేశ్​ గౌతమ్, హైదరాబాద్ అడ్మిన్​ డీసీపీ వెంకటలక్ష్మి, సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు, విజిలెన్స్ అదనపు ఎస్పీ ప్రతాప్​ కుమార్, సీసీఎస్ ఏసీపీ గురు రాఘవేంద్ర, సీఐ సెల్ ఇన్స్ పెక్టర్ శంకర్ రెడ్డి, సైబర్​ సెల్​ ఎస్ఐ హరీశ్​ ను సభ్యులుగా నియమించారు.

Also Read: Nitin Nabin Sinha: బీజేపీ జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం.. బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియామకం.?

Just In

01

Yash Toxic: నెటిజన్ల దెబ్బకు ఇన్స్టా అకౌంట్ డిలేట్ చేసిన టాక్సిక్ నటి.. ఎందుకంటే?

AEO Workload Issues: పని భారంతో ఏఈవోలు సతమతం.. విజ్ఞప్తులు చేసిన ఉన్నతాధికారులు నో రెస్పాన్స్!

Mahesh Kumar Goud: మీకు భవిష్యత్తు లేదు.. అందుకే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు: మహేష్ కుమార్ గౌడ్

KTR: మరో కొత్త దందాకు ప్రభుత్వం తెరలేపిందని.. ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్..!

Megastar Chiranjeevi: ‘మన శంకరవరప్రసాద్ గారు’ రెండు రోజుల గ్రాస్ ఎంతంటే?.. బాస్ కొల్లగొట్టాడుగా..