Damodar Raja Narasimha: ఉగాది నాటికి టిమ్స్ హాస్పిటల్‌ను ప్రారంభిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) స్పష్టం చేశారు. హాస్పిటల్ బిల్డింగ్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయని, ఎలక్ట్రికల్ వర్క్స్ కొన్ని ఇంకా చేయాల్సి ఉన్నదన్నారు. ఆపరేషన్ థియేటర్లు, డయాగ్నస్టిక్స్, ఇతర ఎక్విప్‌మెంట్ ఏర్పాటు కూడా చివరి దశలో ఉన్నదని వివరించారు. ఇప్పటికే అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎంఆర్‌ఐ వంటి భారీ యంత్రాల ఫిట్టింగ్ పూర్తయిందన్నారు.
అన్నిరకాల వైద్య సేవలు
తమ ప్రభుత్వం కు ప్రచార ఆర్భాటం ఉండదనీ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నదే తమ ఆరాటం అన్నారు అన్నిరకాలుగా పూర్తి స్థాయి సౌకర్యాలతో ఉగాది నాటికి పేషెంట్లకు ఇక్కడ వైద్య సేవలు అందిస్తామన్నారు.వెయ్యి బెడ్ల ఈ హాస్పిటల్‌లో అన్నిరకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నామ న్నారు గుండె సంబంధిత వ్యాధుల చికిత్సలకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా సనత్‌నగర్ టిమ్స్ ఉంటుందనీ ,ఇక్కడే అవసరమైన రీసెర్చ్ జరుగుతుందన్నారు.
అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు
ఇక్కడే అత్యాధునిక ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్నిరకాల అవయవమార్పిడి సర్జరీలు చేసేలా అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో తెస్తున్నామన్నారు. ఆరోగ్యశాఖలో గత రెండేళ్లలోనే సుమారు 10 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని ,ఇంకో 7 వేలకుపైగా ఉద్యోగాల భర్తీ అవుతున్నట్టు చెప్పారు.మరిన్ని నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నామన్నారు. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందికి ఎలాంటి కొరత ఉండదనీ ఆయన క్లారిటీ ఇచ్చారు.
Also Read: Damodar Raja Narasimha: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ శాఖలో 996 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్!

