Ilaiyaraaja: ‘మన శంకర వరప్రసాద్ గారు’.. మ్యాస్ట్రో అనుమతి ఉందా!
Ilaiyaraaja and MSG (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Ilaiyaraaja: ‘మన శంకర వరప్రసాద్ గారు’.. మ్యాస్ట్రో అనుమతి తీసుకున్నారా?

Ilaiyaraaja: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. ‘మ్యాస్ట్రో’ ఇళయరాజా (Ilaiyaraaja) కోపం ఈసారి ఎవరి మీద పడబోతోంది? తన అనుమతి లేకుండా పాటలు వాడితే కోర్టు మెట్లు ఎక్కించడానికైనా వెనుకాడని ఇళయరాజా, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? గత కొంతకాలంగా ఇళయరాజా తన మ్యూజికల్ కాపీరైట్స్ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారు. రీసెంట్‌గా బ్లాక్ బస్టర్ హిట్ ‘మంజుమ్మెల్ బాయ్స్’ మూవీలో సాంగ్ వాడినందుకు నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అలాగే అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ చిత్రాల విషయంలోనూ ఇదే జరిగింది. చివరకు మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సంస్థ దాదాపు రూ. 50 లక్షలు చెల్లించి సెటిల్మెంట్ చేసుకున్నట్లుగా ఇటీవల టాక్ నడిచింది. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) సినిమా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Also Read- Director Maruthi: ‘ది రాజా సాబ్’ అర్థం కావడానికి టైమ్ పడుతుందని నాకు ముందే తెలుసు!

సినిమా నిండా మ్యాస్ట్రో పాటలే!

దర్శకుడు అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్‌తో రూపొందిన ఈ సినిమాలో మెగాస్టార్ వింటేజ్ లుక్స్‌తో పాటు ఆయన పాత సూపర్ హిట్ సాంగ్స్‌ను కూడా చాలా చోట్ల వాడారు. ముఖ్యంగా ఇళయరాజా కంపోజ్ చేసిన క్లాసిక్ సాంగ్స్ బిట్స్ ఈ సినిమాలో హైలైట్‌గా నిలిచాయి. మెగాస్టార్ తన బాడీ లాంగ్వేజ్‌తో ఆ పాటలకు వేసిన స్టెప్పులు థియేటర్లలో ఈలలు వేయించాయి. అయితే, థియేటర్లో సందడి బానే ఉంది కానీ, ఈ పాటల కోసం మ్యాస్ట్రో దగ్గర ‘అనుమతి’ తీసుకున్నారా? అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ చిత్ర యూనిట్ ముందే ఇళయరాజా నుంచి పర్మిషన్ తీసుకోకపోతే మాత్రం పరిస్థితి తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద బ్యానర్‌నే ‘రాయల్టీ’ పేరుతో కోర్టుకు లాగిన ఇళయరాజా, ఈ సినిమా విషయంలో ఊరుకుంటారా? అన్న చర్చ మొదలైంది. అనుమతి తీసుకోకుండా వాడితే మాత్రం భారీ మొత్తాన్ని రాయల్టీగా సమర్పించుకోవాల్సి వస్తుందని టాలీవుడ్ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.

Also Read- Allu Arjun: జపాన్‌లో అడుగుపెట్టిన పుష్పరాజ్.. ‘పుష్ప కున్రిన్’ కుమ్మేస్తుందా?

చిరంజీవి రంగంలోకి దిగారా?

మరోవైపు వినిపిస్తున్న టాక్ ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవికి ఇళయరాజాతో చాలా కాలంగా మంచి స్నేహం ఉంది. ఆ చొరవతోనే చిరంజీవి స్వయంగా ఇళయరాజాతో మాట్లాడి అనుమతి తీసుకున్నారని, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే ఆ పాటలను సినిమాలో వాడుకున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ‘మన శంకర వరప్రసాద్ గారు’ టీమ్ సేఫ్ జోన్‌లో ఉన్నట్లే. చట్టపరంగా చూస్తే పాటల హక్కులు సంగీత దర్శకుడికే ఉంటాయి కాబట్టి, ఈ విషయంలో ఇళయరాజా స్టెప్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఆయన స్నేహానికి విలువిచ్చి సైలెంట్‌గా ఉంటారా? లేక ప్రొఫెషనల్‌గా నోటీసులు పంపిస్తారా? అనేది చూడాలి. ఏది ఏమైనా, ‘మ్యాస్ట్రో’ అనుమతి లేకుండా ఆయన పాటను టచ్ చేయడం అంటే ఇప్పుడు తేనెతుట్టెను కదపడమేనని టాలీవుడ్ నిర్మాతలు చర్చించుకుంటున్నారు. మరి ఆయన నుంచి అనుమతి తీసుకున్నారా? లేదా? అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Nari Nari Naduma Murari: పండుగ ఆఫర్.. ఎంఆర్‌పీ ధరలకే మా సినిమా టికెట్లు!

Director Maruthi: మెగాస్టార్‌తో ఛాన్స్ వస్తే.. నా లైఫ్ సర్కిల్ ఫిల్ అయినట్లే!

Ram Charan: చిరు, పవన్ ఫామ్‌లోకి వచ్చేశారు.. చరణ్ పిక్చర్ అభి బాకీ హై!

Damodar Raja Narasimha: ఉగాది నాటికి టిమ్స్ హాస్పిటల్‌ను ప్రారంభిస్తాం.. మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం!

Bandi Sanjay: కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయాభివ్రుద్ధికి కృషి చేస్తా.. బండి సంజయ్ కుమార్ హామీ!