Dileep Vishwakarma: మున్సిపల్ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయమని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీప్ విశ్వకర్మ (Dileep Vishwakarma) అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు వేముల నరేందర్ రావు అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బూతు నిర్మాణ అభియాన్ కార్యాశాల మున్సిపల్ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా దిలీప్ విశ్వకర్మ మాట్లాడుతూ నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో గత ఎన్నికలలో 24 వార్డులకు అభ్యర్థులను ఖరారు చేయగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీజేపీ అభ్యర్థులకు ఎన్ని ప్రలోభాలు పెట్టినా పార్టీ మారలేదని అన్నారు.
Also Read: Anaganaga Oka Raju: గ్రామీణ నేపథ్యంలో పొలిటికల్ సెటైర్ ఎపిసోడ్.. హిలేరియస్‌గా ఉంటుందట!
ప్రతి కార్యకర్త వంద మందితో సమానం
పార్టీకి కార్యకర్తలే బలమని, ప్రతి కార్యకర్త వంద మందితో సమానమని అన్నారు. పార్టీ తరఫున వార్డుల్లో నిలబడ్డ అభ్యర్థులు అందరూ ఉన్నత చదువులు చదివిన వారే అన్నారు.ఈ ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. జిల్లా అధ్యక్షులు వేముల నరేందర్ రావు మాట్లాడుతూ పార్టీ నిర్మాణం, అవలంబించవలసిన విధివిధానాలు, వేయవలసిన ఎత్తుగడల గురించి కార్యకర్తలకు వివరించారు.

