Ntr District | ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో ఘోరమైన ఘటన జరిగింది. ప్రియురాలిని నమ్మించి తన ఫ్రెండ్స్ తో అత్యాచారం చేయించాడు ఓ ప్రియుడు. హృదయాలను కదిలించే ఈ ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ఎన్టీఆర్ జిల్లాలోని కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్(25) అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి అతని మాయలో పడిపోయింది. ఈ క్రమంలోనే యువతిని లోబరుచుకున్న హుస్సేన్ ఆమె న్యూడ్ ఫొటోలను తన స్నేహితులైన ప్రభుదాస్(25), గాలిసైదా(26)లకు చూపించాడు.
ఓ ఫంక్షన్ ఉందని ఇంటికి రావాలని కోరగా.. ఆ యువతి హుస్సేన్ ఇంటికి వెళ్లింది. అక్కడకు వెళ్లగా ఎవరూ లేకపోవడంతో యువతికి అనుమానం వచ్చి హుస్సేన్ ను నిలదీసింది. అప్పటికే ఇంట్లో ప్రభుదాస్, గాలిసైదా ఉన్నారు. నీతో ఏకాంతంగా మాట్లాడాలని పిలిచానంటూ హుస్సేన్ యువతిని నమ్మించాడు. ఇప్పుడే బయటకు వెళ్లి వస్తానంటూ హుస్సేన్, ప్రభుదాస్ ఇంటి బయట కాపలా కాయగా.. గాలిసైదా లోపలకు వెళ్లాడు. నీ న్యూడ్ ఫొటోలు మా వద్ద ఉన్నాయని బెదిరించి యువతిపై అత్యాచారం చేశాడు.
ఈ ముగ్గురూ కలిసి న్యూడ్ ఫొటోలు చూపించి ఆ యువతిని తరచూ వేధిస్తుండటంతో ఆమె తల్లితండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.