Bhatti Vikramarka: కాంగ్రెస్ ది మనసున్న ప్రభుత్వమని, అందుకే సమాజంలోని అన్ని రకాల సమస్యలకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ పరిష్కారం చూపిస్తూ ముందుకు వెళుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ప్రజాభవన్ లో ఆయన ప్రసంగించారు. సంక్షేమం అంటే గతంలో కొన్ని శాఖలకే నిధులు మంజూరు చేసేవారు కానీ మా ప్రభుత్వం దివ్యాంగులతో పాటు అన్ని శాఖల సంక్షేమానికి నిధులు కేటాయిస్తుందని తెలిపారు.
Also Read: Bhatti Vikramarka: మధిర మున్సిపల్ నాయకుల సమావేశంలో.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు..?
సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగుల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పాం చెప్పినట్టుగానే దివ్యాంగుల జంట వివాహం చేసుకుంటే ప్రస్తుతం ఉన్న ప్రోత్సాహం లక్ష నుంచి రెండు లక్షలకు పెంచుతూ విధానపరమైన నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం వివరించారు. గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో దివ్యాంగులకు 60 కోట్లు కేటాయిస్తే మా ప్రభుత్వం కేవలం రెండు సంవత్సరాల్లో 100 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు.
దివ్యాంగులకు ప్రభుత్వమే ఖర్చు
బాగా డబ్బులు ఉన్నవారు కొనుగోలు చేసే రెట్రో ఫిట్టెడ్ మోటరాజ్డ్ వాహనాలు, బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లు, బ్యాటరీ వీల్ చైర్లు దివ్యాంగులకు ప్రభుత్వమే ఖర్చు భరించి అందజేస్తుందని తెలిపారు. ఈ పరికరాలను ఉపయోగించుకొని దివ్యాంగులు పైకి ఎదగాలని డిప్యూటీ సీఎం సూచించారు. దివ్యాంగులు పదోన్నతి పొందితే ప్రస్తుతం పని చేస్తున్న ప్రాంతంలోనే పోస్టింగ్ ఇవ్వాలని జీవో 34 ను మా ప్రభుత్వం ఇచ్చిందని తెలిపారు. దివ్యాంగుల అవసరాలను గుర్తించి ప్రభుత్వం ముందుకు పోతుందని డిప్యూటీ సీఎం తెలిపారు.
Also Read: Bhatti Vikramarka: గత ప్రభుత్వ పాలకులు కవులను వాడుకుని వదిలేశారు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

