Bhatti Vikramarka: కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ఇంకో పార్టీ పుట్టేదే కాదు, మరో పార్టీకి భవిష్యత్తు ఉండేది కాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు(Bhatti Vikramarka Mallu) అన్నారు. శుక్రవారం ఆయన మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి లో కాంగ్రెస్ కీలక నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఇతర పార్టీలు రెండు మూడు దశాబ్దాల క్రితం చేసిన ఐదు లక్షల పనిని మైకు దొరికిన ప్రతిసారి చెప్పుకుంటూ పోతారు, కానీ కాంగ్రెస్ శ్రేణులు ప్రచారంలో వెనుకంజలో ఉండటం మూలంగా ఇబ్బంది ఏర్పడుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. మధిర మున్సిపాలిటీ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మధిర నగరానికి వచ్చిన రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం వంటి పథకాలను ప్రతి నాయకుడు రోజు పదిమందికి వివరిస్తే చాలని సూచించారు.
చెరువులను టూరిజం పార్కులుగా..
మధిర పట్టణం అభివృద్ధి చెందాలి క్లీన్ అండ్ గ్రీన్(Clean And Green) గా ఉంటేనే భవిష్యత్తు తరాలు బాగుపడతాయని ఆలోచించే వ్యక్తులను గెలిపించుకోవాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. మధిర పట్టణానికి కాంగ్రెస్(Congress) చేయని పని అంటూ లేదు అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్తు, చెరువులను టూరిజం పార్కులుగా తీర్చిదిద్దడం, డిగ్రీ, ఇంటర్, హై స్కూల్ విద్యాసంస్థలకు సొంత భవనాలు, అగ్రికల్చర్ పాలిటెక్నిక్, జనరల్ పాలిటెక్నిక్, ఐటిఐ ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ గా మార్చడం, బస్టాండ్, ట్రెజరీ, బ్యాంకులను తీసుకురావడం వంటి గొప్ప పనులు చేసాం ఇవి మున్సిపాలిటీలోని ఓటర్లకు వివరించాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు.
Also Read: Constable Family: కానిస్టేబుల్ కుటుంబానికి 1.31 కోటి రూపాయల చెక్కు అందించిన డీజీపీ
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు
ఒక మంచి ఇల్లు కట్టాలి అనుకున్నప్పుడు మొదట సిమెంటు, కంకర, ఇటుకలు ఎక్కడపడితే అక్కడ ఉంటాయి చిందరవందరగా కనిపిస్తుంది కానీ ఇల్లు పూర్తయిన తర్వాత అందంగా కనిపిస్తుంది అదే తరహాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి అది పూర్తయితే నగరం సుందరంగా మారుతుందని తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయిన చోట మట్టిని పూడ్చాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయిన తర్వాత మధిర నగరం మొత్తంగా కొత్త సిసి రోడ్ల నిర్మాణం జరుగుతుందని వివరించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ద్వారా టాయిలెట్లలోని మురుగునీరు బయటకు వెళ్తుంది, సీనరేజి ట్రీట్మెంట్ ప్లాంట్లలో ఆ మురుగునీటిని శుద్ధి చేసి బయటకు విడుదల చేస్తారు, వర్షం నీటిని ఏట్లోకి మళ్లించేందుకు ప్రత్యేకంగా డ్రైనేజీ వ్యవస్థ ఉంటుందని వివరించారు. మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకొని అభివృద్ధి పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. అభివృద్ధి పనులు జరిగితేనే మధిర పట్టణం అభివృద్ధి చెందుతుంది తద్వారా భవిష్యత్తు తరాలకు మంచి జరుగుతుందని వివరించారు.
Also Read: Maa Inti Bangaram: మంచి కోడలు ఎలా ఉండాలో సమంతను చూసి నేర్చుకోండి!.. యాక్షన్ మోడ్ ఆన్..

