Sharwanand: చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand) హీరోగా నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ (Nari Nari Naduma Murari) చిత్రం ఈ సంక్రాంతికి విడుదల కాబోతోన్న విషయం తెలిసిందే. జనవరి 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైందీ చిత్రం. ‘సామజవరగమన’ ఫేమ్ కామెడీ మాస్ట్రో రామ్ అబ్బరాజు (Ram Abbaraju) దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్, మొదటి రెండు పాటల ద్వారా భారీ అంచనాలను పెంచింది. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకను ఆత్రేయపురంలో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శర్వానంద్ తన ‘శతమానం భవతి’ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు.
Also Read- Nayanthara: ఒక సామ్రాజ్యమే.. నయనతార ఆస్తుల విలువల తెలిస్తే షాకవ్వాల్సిందే..
నాకు చాలా ఇష్టమైన ఊరు
ఈ కార్యక్రమంలో శర్వానంద్ మాట్లాడుతూ.. ‘‘ఆత్రేయపురం. ఇక్కడున్న అందరినీ చూసిన తర్వాత ఈ సినిమాకు ‘నారీ నారీ నడుమ మురారి’.. మంచి ఆత్రేయపురం పూతరేకులు లాంటి సినిమా అనే ట్యాగ్‌లైన్ పెట్టాలనిపించింది. ఇది నాకు చాలా ఇష్టమైన ఊరు. ఎందుకంటే, ‘శతమానం భవతి’ ఎక్కడే చేశాను. దాదాపు మూడు నెలలు పాటు ఇక్కడే ఉన్నాను. అప్పుడు మీరు చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. నేను మంచి సినిమాలు చేస్తానని నమ్మకం ప్రేక్షకులలో వుండటం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అందుకే అందరినీ హ్యాపీగా నవ్వించాలని తీసిన సినిమా ఇది. అన్నిట్లోకి అద్భుతమైనది నవ్వు. ప్రతి ఇంట్లో నవ్వు ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం. అందరూ కూడా సినిమాకు వచ్చి ఆనందంగా నవ్వితే అదే మాకు పండగ. అది మీరంతా మాకు ఇచ్చే కానుక. ఇది క్లీన్ ఫిలిం. మంచి కథని చాలా హ్యూమరస్‌గా చెప్పడం జరిగింది. ఈ సినిమా నాకు చాలా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని కచ్చితంగా నమ్ముతున్నాను. ఈ సినిమా టికెట్ ధరలని మేము పెంచడం లేదు. అందరికీ అందుబాటులో వున్న ధరలే వుంటాయి. అందరూ హ్యాపీగా వెళ్లి చూడండి. హ్యాపీ సంక్రాంతి’’ అని చెప్పుకొచ్చారు.
Also Read- Manchu Manoj: రాకింగ్ స్టార్ ప్రారంభించిన సంక్రాంతి పండుగ సంబరాల క్యాంపెయిన్ వివరాలివే..
సంక్రాంతి ఫీస్ట్
హీరోయిన్లలో ఒకరైన సాక్షి వైద్య మాట్లాడుతూ.. మా మూవీ టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నిజంగా ఇది నాకు మెమొరబుల్ జర్నీ. డైరెక్టర్ అబ్బరాజు అద్భుతమైన క్యారెక్టర్ రాశారు. నిత్య క్యారెక్టర్ చాలా స్పెషల్. షూటింగ్‌లో చాలా ఎంజాయ్ చేశాం. శర్వాతో నటించడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని ఎంటర్టైన్ చేసి, ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నానని చెప్పారు. మరో హీరోయిన్ సంయుక్త మాట్లాడుతూ.. ట్రైలర్ అందరికీ నచ్చినందుకు హ్యాపీ. థియేటర్లో ఫ్యామిలీతో పాటు అందరూ ఎంజాయ్ చేసేలాగా ఈ సినిమా ఉంటుంది. డైరెక్టర్ ఈ సినిమాను కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా ప్యాక్ చేశారు. నాకు దియా అనే క్యారెక్టర్ ఇచ్చినందుకు థాంక్యూ. ఇందులో ప్రతి సీన్ హిలేరియస్‌గా వుంటుంది. సినిమా సంక్రాంతి ఫీస్ట్‌లాగా ఉండబోతుందని తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

