Kishore Tirumala: మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) హీరోగా కిషోర్ తిరుమల (Kishore Tirumala) దర్శకత్వంలో.. సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi). డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం.. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో హ్యుజ్ బజ్‌ను సృష్టించింది. సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 13న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైన ఈ మూవీ విశేషాలను దర్శకుడు కిషోర్ తిరుమల మీడియాకు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ..
Also Read- Nayanthara: ఒక సామ్రాజ్యమే.. నయనతార ఆస్తుల విలువల తెలిస్తే షాకవ్వాల్సిందే..
అంతకు మించి..
‘‘ఒక భర్త తన అనుభవం వల్ల మిగతా భర్తలకి ఏం చెప్తున్నాడు.. తను ఎలాంటి స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాడు అనేది ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ కథలోని ప్రధాన అంశం. ఇందులో ఇద్దరు అమ్మాయిలు అడిగిన ప్రశ్న పెళ్లయిన వాళ్ళందరూ.. ఏదో ఒక సమయంలో ఎదుర్కొన్నదే. అలాంటి ప్రశ్న అడిగినప్పుడు వెంటనే ఏం సమాధానం చెప్పాలనేది తెలీదు. ఆ ప్రశ్న నిజంగానే చాలా కఠినమైనది. దానికి సమాధానం సినిమాలో దొరుకుతుంది. ఈ కథని ఇల్లాలు ప్రియురాలు కోణంలో కాకుండా చాలా డిఫరెంట్‌గా ట్రీట్ చేయడం జరిగింది. ఇది పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం. ఇందులో ఇద్దరు అమ్మాయిలు అడిగే ప్రశ్న.. చాలా సెన్సిబుల్‌గా ఉంటుంది. నిజానికి ఇలాంటి సమస్య వచ్చినప్పుడు గొడవలు పెట్టుకుంటారు, లేదంటే మనస్పర్ధలు పెంచుకుంటారు. విడాకుల వరకు కూడా వెళతారు. ‘ఐ’ సినిమాలో విక్రమ్ అంతకుమించి అంటాడు కదా.. ఇందులో ఉండే కాన్ఫ్లిక్ట్ కూడా అంతకు మించి అన్నట్టుగా ఉంటుంది. కచ్చితంగా వారు అడిగే ప్రశ్న విని ఆడియన్స్ కూడా షాక్ అవుతారు. ప్రశ్నలోనే అన్నిటికంటే పెద్ద పనిష్మెంట్ ఉంటుంది. అది ఏంటనేది ఆడియన్స్ స్క్రీన్ మీద ఎక్స్‌పీరియెన్స్ చేస్తేనే బాగుంటుంది.
Also Read- Manchu Manoj: రాకింగ్ స్టార్ ప్రారంభించిన సంక్రాంతి పండుగ సంబరాల క్యాంపెయిన్ వివరాలివే..
రవితేజతో అనుకున్న తర్వాతే..
ప్రస్తుతం సినిమా తీయడం ఒక ఎత్తు అయితే.. దానిని ప్రచారం చేయడం మరో ముఖ్య అంశంగా మారింది. ప్రమోషన్స్ అని కాదు కానీ, నాకెందుకో ఆ జోష్ అనిపించి ప్రమోషన్స్‌లో డాన్స్ చేశాను. నేను చాలా హ్యాపీగా చేసిన, నాకు నచ్చిన డాన్స్ అది. ఈ సినిమాలో సత్య నటించిన ఒక పాటకి కొరియోగ్రఫీ కూడా చేశాను. అదొక చిన్న బిట్ సాంగ్. ఆ పాట చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. టైటిల్ విషయానికి వస్తే.. ‘రంగబలి’ డైరెక్టర్ పవన్ ఈ సినిమా స్క్రిప్ట్‌కి పని చేశారు. ఈ టైటిల్ ఆలోచన కూడా ఆయనదే. రవితేజతో సినిమా చేద్దామని అనుకున్న తర్వాతే ఈ కథని డెవలప్ చేయడం జరిగింది. ఆయన దగ్గర చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కానీ, ఈ సినిమా స్క్రిప్టు చక్కగా రావడంతో ముందు ఈ సినిమానే చేద్దామని అన్నారు. సినిమాకు పనిచేస్తున్నన్నీ రోజులు ఆయన చాలా ఎంజాయ్ చేశారు. రామ్ సత్యనారాయణ క్యారెక్టర్ నేనేదైతే రాశానో దాన్ని ఫాలో అయ్యారు. నాకోసం అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నేను అదే చేస్తానని చెప్పారు. మీరు స్క్రీన్ మీద చూస్తే రవితేజ చాలా ఫ్రెష్‌గా ఉంటారు. ఈ సినిమా విషయంలో ఆయన ఇచ్చిన కొన్ని ఇన్‌పుట్స్ కూడా తీసుకున్నాను. ఆయన ఈ సినిమా చాలాసార్లు చూశారు. మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఆడియన్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

