Kesamudram Municipality: నూతనంగా ఏర్పడిన కేసముద్రం మునిసిపాలిటీ(Kesamudram Municipality)కి తొలి ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం 2025 జనవరి 17న జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో మహబూబాబాద్(Mahabubabad)జిల్లాలోని కేసముద్రం మండల కేంద్రంగా ఉన్న దానిని మునిసిపాలిటీగా అప్గ్రేడ్ చేశారు. ఈ మున్సిపాలిటీలో కేసముద్రం టౌన్ (స్టేషన్), విలేజ్ కేసముద్రం, అమీనాపురం, ధనసరి, సబ్ స్టేషన్ తండాలను కలిపి నూతన మున్సిపాలిటీగా చేశారు. ప్రస్తుతం ఇక్కడ 16 వార్డులుగా విభజించారు. అన్ని రకాలుగా ప్రతిపాదనలు సిద్ధం చేసి ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
అభివృద్ధికి అడుగులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక జీవో విడుదల చేసిన తర్వాత మున్సిపాలిటీగా కేసముద్రం ఏర్పడింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పట్టణ అభివృద్ధికి అదనపు నిధులు కేటాయిస్తారు. మౌలిక సదుపాయాలు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్య పనులు మెరుగుపడేందుకు అభివృద్ధికి అడుగులు పడనున్నాయి.
Also Read: ND vs NZ 1st ODI: న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎవరిదంటే?
ప్రస్తుత ఉన్న ఓటర్ల ప్రకారం ఎన్నికలు
నూతనంగా ఏర్పడిన కేసముద్రం మున్సిపాలిటీలో అధికారులు 16 వార్డులుగా ప్రస్తుత 2025 ప్రకారం ఉన్న ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. భౌగోళిక సరిహద్దులను పరిగణలోకి తీసుకొని వార్డులను పూర్తిస్థాయిలో విభజించారు. జూన్ 2025 లో వార్డుల ముసాయిదాపై అభ్యంతరాలను స్వీకరించి జూన్ 21న తుది నోటిఫికేషన్ జారీ చేశారు. మున్సిపాలిటీగా ఏర్పడిన నాటి నుంచి స్పెషల్ ఆఫీసర్ ను కేటాయించారు. ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ పూర్తిస్థాయిలో పనిచేసే విధంగా నియమించారు. ఎన్నికల నిర్వహణ కోసం రిజర్వేషన్ల ప్రక్రియను వార్డుల వారీగా అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. 2026 లో జరగనున్న మునిసిపాలిటీ ఎన్నికలు కేసముద్రం మున్సిపాలిటీకి తొలి ఎన్నికలు అవుతాయి.
నూతన మున్సిపాలిటీకి ఆశావాహుల సంఖ్య ఎక్కువే..
మహబూబాబాద్ జిల్లాలో ఇప్పటికే నాలుగు మునిసిపాలిటీలు మహబూబాబాద్, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు లతోపాటు నూతనంగా 5 మున్సిపాలిటీగా కేసముద్రం ఏర్పడింది. ఇక్కడ వ్యాపారస్తుల సంఖ్య అధికంగా ఉండడంతో అందరూ ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. కేసముద్రం మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి కోసం చాలామంది ఆశావహులు తమ తమ పైరవీలను సాగించుకుంటున్నారు. రిజర్వేషన్లు అనుకూలిస్తే పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.
Also Read: Suspicious Death: కుళ్లిన స్థితిలో మృతదేహం.. అటవీ ప్రాంతంలో షాకింగ్ ఘటన

