Municipal Elections: ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసిపోతాయా?
Municipal Elections (imagecredit:twitter)
Political News, Telangana News

Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసిపోతాయా?.. ఉత్కంఠగా మారుతున్న బల్దియా ఎన్నికలు

Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు కలిసిపోతాయా?.. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా.. సీట్ల సర్దుబాటు చేసుకుంటారా? ఎవరికి వారుగా పోటీ చేసి చేస్తారా?.. పట్టు నిలుపుకుంటారా?.. అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే కలిసిపోయేందుకు సీపీఐ నేతలు సిద్ధంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ నుంచి ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదని సమాచారం. మున్సిపల్ ఎన్నికలకు ఎన్నికల సంఘం ఇప్పటికే సన్నాహాలు చేస్తుంది. అయినప్పటికీ ఇరు పార్టీల మధ్య పొత్తుతో ముందుకు వెళ్తారా లేదా అనేది చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం అవుతున్నది. పార్టీలు సైతం ఎన్నికలకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. అయితే సిపిఐ కాంగ్రెస్ పార్టీలు ఎవరికి వారుగా సమాజం చేసుకుంటున్నాయి. అయితే రెండు పార్టీలు కలిసి పోతాయా.. వేర్వేరుగా పోటీ చేస్తారా అనేది ఇప్పుడు చర్చనీయార్థమైంది. సీపీఐ పార్టీ చెందిన నేతలు పొత్తుతో ముందుకు వెళ్తేనే రాష్ట్రంలో పట్టు నిలుపుకోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ తెలంగాణలోనే సీపీఐ పార్టీకి క్యాడర్ ఉంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఏ ఎన్నికలు వచ్చినా ప్రభావం చూపుతుంటారు. అసెంబ్లీలకు ఉప ఎన్నికలు వచ్చినా గెలుపు ఓటములను నిర్దేశిస్తుంటారు. సిపిఐ పొత్తు కోసం పార్టీలు సైతం ముందుకు వస్తుంటాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్ పొత్తుతో ముందుకెళ్లాయి. కొత్తగూడెం అసెంబ్లీ టికెట్లు సిపిఐ కి కేటాయించడంతో విజయం సాధించింది. ఆ తర్వాత ఎమ్మెల్యే కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా ఇచ్చింది.

కలిసి పనిచేస్తే ఎక్కువ గెలిచే వాళ్లం..

కానీ ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. కలిసి పని చేస్తాయని భావించినప్పటికీ పొత్తు కుదరలేదని.. అందుకే ఎవరికివారుగా పోటీ చేశారు. దీంతో సీపీఐ పార్టీ 42 గ్రామ పంచాయతీల్లో విజయం సాధించింది. కలిసి పని చేస్తే 500కు పైగా పంచాయతీల్లో విజయం సాధించేవారిమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

మున్సిపల్ ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ..

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం.. గ్రామ స్థాయిలో బలమైన క్యాడర్ ఉండడంతో పంచాయతీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసింది. మద్దతు దారులను 8 వేలకు పైగా గ్రామ పంచాయతీలో విజయం సాధించి సత్తా చాటింది. క్షేత్రస్థాయిలో తమకు ఎదురులేదని చాటి చెప్పింది. మళ్లీ ఒంటరిగానే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసింది. మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తం కావాలని మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలని సూచించింది.

Also Read: Sarpanch Rights: సర్పంచులపై బెదిరింపులకు దిగిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్..!

కలిసిపోతారా.. వేర్వేరుగా పోటీ చేస్తారా?

అయితే, ఎవరికి వారుగా పార్టీ క్యాడర్‌ను మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఇంతకు కలిసిపోతారా వేర్వేరుగా పోటీ చేస్తారా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌ గౌడ్‌తో భేటీ అయ్యేందుకు సీపీఐ పార్టీ సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఎప్పుడు భేటీ అవుతారనే దానిమీద మాత్రం ఇంకా క్లారిటీ రాలేదని విశ్వసనీయ సమాచారం. పంచాయతీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడంతో ఆశించిన మేర ఫలితాలు రాకపోవడంతో కొంత క్యాడర్ నైరాశ్యానికి గురైంది. కాంగ్రెస్‌తో కలిసిపోతే మెజార్టీ స్థానాలు వచ్చేవని, ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు చేయలేదని పార్టీ సమావేశాల్లోనూ నేతల పేర్కొన్నట్లు సమాచారం. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని క్యాడర్ ఒత్తిడి మేరకు ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం.

ఈసారి ప్రభావం చూపాలని..

ఇప్పటికే సీపీఐ పార్టీకి మున్సిపాలిటీలో కౌన్సిలర్లను లేదా కార్పొరేటర్లను గెలిపించుకోలేదు. కేవలం ఒకటి రెండు మున్సిపాలిటీలోనే ఒకరిద్దరు కార్పొరేటర్లు ఉన్నారు. అయితే త్వరలో జరగబోయే 117 మున్సిపాలిటీలు, ఆరు కార్పొరేషన్‌లో ఈసారి ప్రభావం చూపాలని నేతలు భావిస్తున్నారు. అయితే పొత్తులతో ముందుకు పోతారా?. ఒంటరిగానే పోటీ చేస్తారా..? తమ సత్తా ఇతర పార్టీ వాళ్లకి తెలియజేస్తారా?.. లేకుంటే నామమాత్రంగా మున్సిపాలిటీ ఎన్నికలను తీసుకుంటారా అనేది ఇప్పుడు ఆ పార్టీలోని క్యాడర్‌లో చర్చ జరుగుతుంది. ఈ మున్సిపల్ ఎన్నికలతో సీపీఐ అర్బన్ ప్రాంతాల్లో ఏ మేరకు ఉన్నది అనేది కూడా స్పష్టం కానుంది. రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ ఉండడంతో పార్టీకి కొంత బూస్ట్ ఇచ్చినప్పటికీ.. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపిస్తారనేది సర్వత్ర ఆసక్తి నెలకొంది.

పొత్తు లేకుంటే ప్రభుత్వాన్ని నిలదీస్తారా?

కాంగ్రెస్‌తో పొత్తు లేకపోతే రెండేళ్ల ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తారా..? ఆరు గ్యారంటీలు, నిరుద్యోగ భృతి, జాబ్ కార్డ్, ఉద్యోగ ప్రజా సమస్యలపై గొంతు ఎంతెత్తుతారా? అనేది రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే సాంబశివరావు మాది ప్రజల పక్షమని, తప్పును తప్పు అంటాం.. మంచిని మంచి అంటాం.. మాకు రాజకీయాలు కాదు.. ప్రజల పక్షం మాది అని తేల్చి చెప్పారు. అయితే, ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఏ అంశాలను ప్రధాన ఎజెండాగా తీసుకొని ముందుకు వెళ్తారు.. ప్రభుత్వంపై ఎలా గలవెత్తుతారనేది చూడాలి.

Also Read: HYDRAA: హైడ్రా ఆపరేషన్‌ సక్సెస్.. మియాపూర్‌లో సర్వే నెంబర్ 44లో కబ్జా బాగోతం..!

Just In

01

The Raja Saab: ‘జననాయకుడు’ కూడా అదే రోజు వచ్చి ఉంటే.. ‘రాజా సాబ్’ పరిస్థితి ఏంటి?

Sreeleela: ఇక శ్రీలీలకు మిగిలింది బాలీవుడ్డే.. కోలీవుడ్ కూడా శక్తి ఇవ్వలే!

Samantha: సమంత షాకింగ్ డెసిషన్.. ఇకపై అలాంటి సినిమాలు చేయదట!

Meenakshi Chaudhary: నాకు హీరో ఎవరనేది ముఖ్యం కాదు.. అదే ముఖ్యం!

Traffic Advisory: యూసఫ్‌గూడలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకంటే?