Anvesh Controversy: ప్రముఖ ట్రావెల్ వ్లాగర్ అన్వేష్ (Naa Anveshana) చుట్టూ ముసురుకున్న వివాదాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలో యూట్యూబ్ క్రియేటర్ ‘యే జూడ్’ (Aye Jude) అన్వేష్ వ్యవహారశైలిని తప్పుబడుతూ సాక్ష్యాలతో కూడిన ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో అన్వేష్ చేసిన వ్యాఖ్యలు, అతని గత ప్రవర్తనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
సనాతన ధర్మంపై దాడి
అన్వేష్ సనాతన ధర్మాన్ని కించపరిచేలా వ్యవహరించారని జూడ్ ఆరోపించారు. ముఖ్యంగా చెప్పులు ధరించి శివలింగాన్ని తాకడం, దానిని వ్యూస్ కోసం వాడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతమ్మ తల్లి హిందూ దేవుళ్లపై అన్వేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఈ వీడియోలో తీవ్రంగా ఖండించారు.
Read also-RajaSaab Controversy: ‘ది రాజాసాబ్’లో తన మ్యూజిక్ కాపీ కొట్టారంటూ.. చెప్పు చూపించిన స్వీడన్ డీజే..
ఆడియో లీక్స్
ఈ వీడియోలో అత్యంత దిగ్భ్రాంతికరమైన అంశం అన్వేష్‌కు సంబంధించిన ఆడియో లీక్స్. ఒక 14 ఏళ్ల మైనర్ బాలికను రూమ్‌లోకి తీసుకెళ్లడం గురించి అన్వేష్ మాట్లాడినట్లు ఉన్న క్లిప్పింగ్స్‌ను ఇందులో ప్రస్తావించారు. ఇది చట్టరీత్యా చాలా తీవ్రమైన నేరమని, దీనిపై పోక్సో (POCSO) చట్టం కింద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జూడ్ అభిప్రాయపడ్డారు.
క్రియేటర్లపై వ్యక్తిగత దూషణలు
తోటి యూట్యూబ్ క్రియేటర్లను వారి కుటుంబ సభ్యులను, ముఖ్యంగా తల్లులను ఉద్దేశించి అన్వేష్ చేసిన బూతులు అసభ్య పదజాలాన్ని జూడ్ బయటపెట్టారు. లాజికల్‌గా సమాధానం చెప్పలేక వ్యక్తిగత దాడులకు దిగడం అన్వేష్ నైజమని విమర్శించారు.
Read also-Chiranjeevi Movie: మెగాస్టార్ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ప్రీమియర్ ఎంతంటే?
బెట్టింగ్
ఇతర క్రియేటర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని విమర్శించే అన్వేష్, తాను కూడా గతంలో అవే పనులు చేశానని స్వయంగా ఒప్పుకున్న ఆడియోలను జూడ్ వినిపించారు. తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి సనాతన ధర్మం పేరుతో లేదా ఇతర వివాదాల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు.
చట్టపరమైన చర్యల డిమాండ్
అన్వేష్ ప్రస్తుతం విదేశాల్లో ఉంటూ తప్పించుకుంటున్నారని, అతనిపై ఇప్పటికే అనేక పోలీస్ స్టేషన్లలో (పంజాగుట్ట, తిరుపతి, ఖమ్మం వంటి ప్రాంతాల్లో) ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయని ఈ వీడియో ద్వారా తెలియజేశారు. భారతీయ గడ్డపైకి వచ్చినప్పుడు అతను కచ్చితంగా లీగల్ కాన్సీక్వెన్సెస్ ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. వ్యూస్ కోసం ఏ స్థాయికైనా దిగజారడం సరికాదని, ప్రతి ఒక్కరూ అన్వేష్ చేస్తున్న ఇలాంటి పనులను ప్రశ్నించాలని జూడ్ పిలుపునిచ్చారు. ధర్మం వైపు నిలబడి, ఇలాంటి వికృత మనస్తత్వాలను అడ్డుకోవాలని కోరారు.

