Municipal Elections: మున్సిఫోల్ పై పార్టీలు గురి
–సమీక్ష, సమావేశాలతో మొదలైన ఎన్నికల వేడి
–రిజర్వేషన్లపై ఎదురుచూస్తున్న ఆశావాహులు
–ఎత్తులకు పై ఎత్తులతో పార్టీలు కార్యాచరణ
–త్వరలో ఎన్నికల నోటిఫికేషన్
–ఎన్నికల సందడీలోనే సంక్రాంత్రి పండుగ
రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: స్థానిక ఎన్నికలు క్రమ క్రమంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా అడుగులు వేస్తోంది. గత నెలలో పంచాయతీ ఎన్నికలతో ప్రభుత్వాన్నికి సానుకూల ఫలితాలు వచ్చాయి. దీంతో మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తోంది. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం ఆశించిన స్ధాయిలో ఫలితాలు రాలేదని అధిష్టానం స్పష్టం చేసింది. రాష్ట్రంలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమీక్ష సమావేశాలు నిర్వహించి రాబోయే ఎన్నికలపై దిశ నిర్ధేశం చేశారు.అందులో భాగంగానే ప్రభుత్వ అధికారులు మున్సిపాలిటీ ఎన్నికలకు రంగం సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే ఓటరు ముసాయిదా, అభ్యంతరాల స్వీకరణ తీసుకున్న తర్వాత తుది ఓటర్ల జాబితా విడుదల చేశారు. ఓటర్ జాబితాలో గజీబీజీపై ప్రక్షాళన చేసినట్లు తెలుస్తోంది. ఒక పక్క అధికారులు పట్టణ పార్టీల నాయకులు చేసిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నారు. మరోపక్క పార్టీల నాయకులు మున్సిపాలిటీలో సమీక్షా, సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.
రిజర్వేషన్ల పై ఆసక్తి..
మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమైతున్న ఆశావాహులు రిజర్వేషన్లపై ప్రత్యేక దృష్టి సాదించారు. వార్డు కౌన్సిలర్ల, చైర్మన్ రిజర్వేషన్లు ఏవిధంగా వస్తాయోనని ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగా వర్గాల వారీగా వార్డులకు ఏ రిజర్వేషన్ వచ్చిన అభ్యర్ధుల పోటీకి సిద్దంగా ఉండేందుకు పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆశావాహులు సైతం నాయకుల చూట్టు చక్కర్లు కొడుతూ టికెట్ దక్కించుకునేందుకు కసరత్తు ప్రారంభించారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం ఏలా ఉండబోతుందనే విషయం పై కూడా పార్టీలు సమలోచనలు చేస్తుంది. 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఏలా ఇస్తారనే అంశాలు కూడా పార్టీలు పరగణలోకి తీసుకుంటున్నారు. పాత రిజర్వేషన్ల అనుకూలంగానే పార్టీల నేతలు అభ్యర్ధులకు సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటికే ఆశావాహులకు ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.
Also Read: The Raja Saab: అభిమానుల అత్యుత్సాహం.. ‘రాజా సాబ్’ థియేటర్లో మంటలు
సమీక్ష, సమావేశాలతో హడావుడి..
రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఆయా నియోజకవర్గ స్ధాయి పార్టీల నేతలు సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచేందుకు పట్టణంలోని ప్రముఖ నాయకులతో సమలోచనలు చేస్తున్నారు. ఏలాగైన మున్సిపాలిటీలో తమ సత్తా చాటాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఎత్తుకు పై ఎత్తులు పార్టీలు వ్యూహాలు చేస్తున్నారు. ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాంపై ఎప్పటికప్పుడు నాయకులు క్షేత్రస్థాయిలోని కార్యకర్తలతో అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఆశావాహుల జాబితాను ఆయా పార్టీల నేతలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ప్రతి వార్డులో జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన మహిళాల అభ్యర్ధులను సైతం ఇప్పటికే ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంత్రి పండుగ సంబురాలను మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆశావాహుల సందడీ కనిపించనుంది.
ఈ మున్సిపాలిటీలకే ఎన్నికలు..
రంగారెడ్డి జిల్లాలో అమన్గల్, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, షాద్నగర్, కొత్తూరు కలిపి 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో కొత్తూరు మున్సిపాలిటీకి మినహా మిగిలిన వాటికి ఎన్నికలు జరగనున్నాయి. వికారాబాద్ జిల్లాలో తాండూర్, కొడంగల్, పరిగి, వికారాబాద్… మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో మూడు చింతలపల్లి, ఎల్లంపేట్,ఆలియాబాద్ మున్సిపాలిటీలకు ఎన్నికలకు అధికారులు సిద్దం చేశారు.

