Republic Day 2026: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న, రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న, గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న.. ముఖ్యమైన ఈ మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా నాన్-వెజ్‌పై నిషేధం అమలులో ఉంటుందనే విషయం విధితమే. అయితే, మరో రెండు వారాల్లో ఢిల్లీ కేంద్రంగా రిపబ్లిక్ డే వేడుకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా మాంసాహారాన్ని వాడాల్సిన అవసరం ఏర్పడింది. అందుకోసం, ఢిల్లీ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఏకంగా 1,275 కేజీల బోన్‌లెస్ చికెన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. అసలు చికెట్‌తో ఏం పని? అనేగా సందేహం!. అయితే, పూర్తి వివరాల్లోకి వెళ్లిపోవాల్సిందే.
రిపబ్లిక్ డే సందర్భంగా భారత వైమానిక దళ బృందాలు ఎప్పటిమాదిరిగానే, ఈ ఏడాది కూడా అబ్బురపరిచే విన్యాసాలు ప్రదర్శించనున్నాయి. అయితే, ఎయిర్ షో జరిగే ఆ రూట్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ముఖ్యంగా, గగనతలంలో నల్లటి గద్దలు (Black Kites ) లేకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు. ఈ సమస్యకు పరిష్కారంగా 1,275 కేజీల బోన్‌లెస్ చికెన్ ఉపయోగించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. చికెన్ ఆశ చూపి గద్దలను ఇతర ప్రదేశాలకు మళ్లించేలా ఏర్పాట్లు చేయడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
కాగా, ఎర్రకోట, జమా మజీద్ వంటి ప్రాంతాల్లో నల్లటి గద్దల సంచారం చాలా ఎక్కువగా ఉంటుంది. పెద్ద సంఖ్యలో ఆకాశంలో కనబడుతుంటాయని, వాటిపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. విమానాలకు పక్షులు పెనుప్రమాదాలు కలిగించే ఆస్కారం ఉందని, కాబట్టి, చికెన్‌తో వాటిని మళ్లించాల్సి ఉంటుందని తెలిపారు.
సాధారణంగా అయితే, గద్దలను ఈ విధంగా మళ్లించరు. కానీ, ఈసారి పరిస్థితి విభిన్నంగా ఉంది. గద్దల సంచారం ఎక్కువ ఉండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. యుద్ధ విమానాలు చాలా తక్కువ ఎత్తులో విన్యాసాలు ప్రదర్శిస్తుంటాయి. కాబట్టి, ప్రమాదాలకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పెద్ద సంఖ్యలో ఉండే గద్దలను దారి మళ్లించాలంటే ఏకంగా 1,275 కేజీల బోన్‌లెస్ చికెన్ అవసరమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కాగా, రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి ఏడాది పక్షుల సమస్యపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, అటవీశాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తుంటారు. ఫ్లట్ కారిడార్స్ నుంచి పక్షులను దూరంగా పారదోలేందుకు చర్యలు తీసుకుంటుంటారు. ఎయిర్‌షో సమయాల్లో విమానాలకు పక్షుల నుంచి తీవ్రమైన ముప్పు పొంచి ఉంటుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also- RajaSaab Controversy: ‘ది రాజాసాబ్’లో తన మ్యూజిక్ కాపీ కొట్టారంటూ.. చెప్పు చూపించిన స్వీడన్ డీజే..
20 ప్రాంతాల గుర్తింపు
జనవరి 15 నుంచి 26 తేదీల మధ్య మొత్తం 15 ప్రాంతాల్లో చికెన్ వేయాల్సి ఉంటుందని గుర్తించినట్టు ఢిల్లీ ఫారెస్ట్ అధికారి ఒకరు తెలిపారు. సగటున ఒక్కో లోకేషన్‌లో 200 నుంచి 400 కేజీల వరకు చికెన్ వేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హైరిస్క్ జోన్లలో ఎర్రకోట, జమా మసీద్, ఢిల్లీ గేట్, మండీ హౌస్ ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు. ఈ ఏరియాల్లో నల్ల గద్దల యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. పక్షుల సంచారాన్ని బట్టి ప్రతిఏడాది ఈ ప్రాంతాలను గుర్తిస్తూనే ఉంటామని వివరించారు. నిర్దేశిత ప్రాంతాల్లో వాటికి తగిన ఆహారం ఏర్పాటు చేయడం ద్వారా, అవి ఎయిర్‌షో జరిగే ప్రాంతం వైపు రాకుండా జాగ్రత్త పడతామని వివరించారు.

