Odisha Plane Crash: ఒడిశాలో కుప్పకూలిన చిన్న విమానం
Plane-Crash (Image source X)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Odisha Plane Crash: ఒడిశాలో కూలిన విమానం.. పైలెట్ సహా 9 మందికి తీవ్ర గాయాలు

Odisha Plane Crash: ఒడిశాలో శనివారం విమాన ప్రమాదం (Odisha Plane Crash) జరిగింది. కేవలం 9 సీట్ల సామర్థ్యం ఉన్న చార్టెడ్ విమానం రూర్కెలా నుంచి రాజధాని నగరం భువనేశ్వర్ వెళ్తుండగా క్రాష్ ల్యాండింగ్ జరిగింది. ప్రమాద సమయంలో ఒక పైలెట్‌, ఆరుగురు ప్యాసింజర్లు కలిపి మొతం ఏడుగురు ఉన్నారు. వీరందరికీ తీవ్రమైన గాయాలయ్యాయి. అయితే, అదృష్టం ఎవరికీ ప్రాణపాయం జరగలేదు. అయితే, క్రాష్ ల్యాండింగ్‌కు కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదు. రూర్కెలాలో టేకాఫ్ తీసుకొని, 10-15 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత, ఒక్కసారిగా  విమానం క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. ఈ ప్రమాదంపై సమాచారం అందించిన వెంటనే సంబంధింత బృందాలు రంగంలోకి దిగాయి. రెస్క్యూ బృందాలు హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి వెళ్లారు. గాయపడ్డ ప్యాసింజర్లను చికిత్స కోసం ఓ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కూలిన విమానం ఇండియావన్ ఎయి‌ర్‌ (IndiaOne Air flight) సంస్థకు చెందినదని గుర్తించారు.

Read Also- Jaya Krishna: ‘శ్రీనివాస మంగాపురం’ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. అదరగొడుతున్న ఘట్టమనేని వారసుడు..

టూరిజం డిపార్ట్‌మెంట్‌కు చెందిన అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతేకాదు, ఈ ప్రమాదంపై దర్యాప్తు కూడా జరగనుంది. ఈ మేరకు అధికారులు దర్యాప్తు ప్రక్రియను కూడా మొదలుపెట్టారు. ఏ కారణాలతో, ఏ పరిస్థితుల్లో విమానం కూలిందో తెలుసుకుంటామని చెప్పారు. పూర్తి స్థాయి దర్యాప్తు జరిగిన తర్వాతే ప్రమాదానికి కారణం ఏంటనేది తెలుస్తుందని అధికారులు పేర్కొన్నారు.

ఈ ప్రమాదంపై ఒడిశా వాణిజ్య, రవాణా శాఖ మంత్రి బీబీ జెనా ఒక ప్రకటన విడుదల చేశారు. రూర్కెలాకు 10 కిలోమీరట్ల దూరంలో ఉన్న జల్దా గ్రామానికి సమీపంలో ప్రమాదం జరిగిందని వివరించారు. సమీపంలో విమాన ప్రమాదం జరిగిందని వివరించారు. వన్ ఏ-1కు చెందిన 9 సీటర్ విమానం ఆరుగురు ప్యాసింజర్లతో రూర్కెలా నుంచి భువనేశ్వర్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని, అందరి పరిస్థితి నిలకడగా ఉందని మంత్రి బీబీ జెనా చెప్పారు. దేవుడి దయవల్ల ఇది పెద్ద ప్రమాదం కాదని ఆయన వివరించారు.

Just In

01

Medaram Jatara: మేడారం జాతరలో పారిశుద్ధ్య లోపం.. పట్టించుకోని అధికారులు

Sathupally News: సత్తుపల్లిలో భారీ సైబర్ నేరాలు.. సామాన్యుల ఖాతాల్లో వందలకోట్ల లావాదేవీలు.. షాక్‌లో పోలీసులు..!

Prabhas RajaSaab: ప్రభాస్ ‘ది రాజాసాబ్’లో ఫైట్ సీక్వెన్స్‌ యాడ్ చేశారు.. ఈ ప్రోమో చూశారా?

Movie Ticket Price: మీకు నచ్చినోళ్ల సినిమాల టికెట్ రేటు రూ.600.. పర్మిషన్ ఎలా ఇస్తారా?: హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

Palwancha Municipality: పాల్వంచ మున్సిపాలిటీలో ఈసారైనా పోరు జరిగేనా..? అందరి చూపు అటువైపే..!