Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.1.02 కోట్ల
Bhatti Vikramarka ( image credit: twitter)
Political News

Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.1.02 కోట్ల ప్రమాద బీమాకు గ్రీన్ సిగ్నల్ : మల్లు భట్టి విక్రమార్క!

Bhatti Vikramarka: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1.02 కోట్ల రూపాయల ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి చేర్చే ప్రభుత్వ ఉద్యోగులు మా కుటుంబ సభ్యులుగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం భావిస్తున్నదని వివరించారు. రూ.1.02 కోట్ల ప్రమాద బీమాకు సంబంధించిన ప్రక్రియను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్రంలోని ప్రముఖ బ్యాంకర్లతో సంప్రదింపులు ముగిసినట్టు వివరించారు.

Also Read: Bhatti Vikramarka: సింగరేణి కార్మికుల సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తాం.. రూ. కోటి ప్రమాద బీమా కల్పిస్తాం : భట్టి విక్రమార్క!

ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయం

ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలను సైతం ప్రతి నెలా క్రమం తప్పకుండా దశలవారీగా విడుదల చేస్తూ వస్తున్నామని ఆ ప్రకటనలో వివరించారు. ఉద్యోగులకు ప్రమాద బీమాకు సంబంధించి ఇప్పటికే సింగరేణి, ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, జెన్‌కో పరిధిలోని ఉద్యోగులందరికీ కోటికి పైగా ప్రమాద బీమాను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రభుత్వ చొరవతో చేపట్టిన కోటి రూపాయలకు పైగా ప్రమాద బీమా కార్యక్రమంతో ఇప్పటికే సింగరేణిలో 38,000 మంది రెగ్యులర్ ఉద్యోగులు వీరితోపాటు విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న 71,387 మంది ఉద్యోగులకు ప్రమాద బీమా అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే తరహాలో ప్రభుత్వ ఉద్యోగులకు సైతం రూ.1.02 కోట్ల ప్రమాద బీమాను అమలులోకి తీసుకు వస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 5.14 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని భట్టి విక్రమార్క తెలిపారు

Also Read: Bhatti Vikramarka: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈఎంఐల కష్టాలు తీర్చేందుకు ఒకటో తేదీ కొత్త విధానం!

Just In

01

BJP Telangana: పని పంచుకోరు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోరు.. పేరుకు మాత్రం బీజేపీ రాష్ట్ర కమిటీలో సభ్యులు..?

ND vs NZ 1st ODI: న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎవరిదంటే?

Mass Maharaja: ‘మాస్ మహారాజ్’ బిరుదు పేటెంట్ తనదే అంటున్న హరీష్ శంకర్.. రవితేజ ఏం చేశారంటే?

Telangana Budget: తెలంగాణ స్టేట్ బడ్జెట్ రూపకల్పనపై అధికారుల ఫోకస్.. అన్ని శాఖల్లో బిజీ బిజీ!

US Airstrikes: సిరియాలో ఐసిస్ ఉగ్రసంస్థపై అమెరికా మెరుపుదాడులు