Dance Politics: పవన్ డ్యాన్స్‌పై అంబటి రాంబాబు హాట్ కామెంట్స్
Ambati-Rambabu (Image source X)
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Dance Politics: డిప్యూటీ సీఎం పవన్ డ్యాన్స్‌పై అంబటి రాంబాబు హాట్ కామెంట్స్

Dance Politics: సంక్రాంతి పండుగ ముందస్తు సంబరాలతో ఆంధ్రప్రదేశ్ కళకళ్లాడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సాంప్రదాయ సాంస్కృతి కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో జనాలతో పాటు ముఖ్యఅతిథులుగా రాజకీయ నాయకులు కూడా పాల్గొంటున్నారు. దీంతో, పండుగ వేడుకలు కూడా రాజకీయ రంగస్థలాలుగా మారుతున్నాయి. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) చుట్టూ గతంలో ‘డ్యాన్స్ పాలిటిక్స్’ (Dance Politics) జరిగిన విషయం తెలిసిందే. తాజాగా, మరోసారి డ్యాన్స్ పాలిటిక్స్ ఏపీలో మొదలయ్యాయి. అయితే, ఈసారి స్టెప్పులు వేసింది అంబటి రాంబాబు కాదు. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) శుక్రవారం నాడు తన నియోజకవర్గం పిఠాపురంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో కాలు కదపడాన్ని అంబటి రాంబాబు తప్పుబట్టారు.

‘‘నేను డ్యాన్స్ వేస్తే సంబరాల రాంబాబునా?. మరి పవన్ డ్యాన్స్ వేస్తే ?’’ అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన శుక్రవారం వ్యంగ్యాస్త్రం సంధించారు. కాగా, అంబటి రాంబాబు గతంలో మంత్రిగా ఉన్న సమయంలో సంక్రాంతి వేడుకల్లో స్టెప్పులు వేసినప్పుడు, నాడు ప్రతిపక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేన ఆయనను సంబరాల రాంబాబు అంటూ ఎగతాళి చేశాయి. ఆ పార్టీలకు చెందిన సోషల్ మీడియా పేజీలు బాగా ట్రోల్ చేశాయి. ప్రజా సమస్యలు వదిలేసి డ్యాన్సులేంటి? అని ప్రశ్నించాయి. ఇప్పుడు అదే అస్త్రాన్ని పవన్ కళ్యాణ్ మీద ప్రయోగించేందుకు అంబటి రాంబాబు ప్రయోగించారు. ‘రివెంజ్ పాలిటిక్స్’కు ప్రయత్నించారు. తాను వేస్తే తప్పు, పవన్ వేస్తే ముప్పా? అన్నది అంబటి లాజిక్‌గా కనిపిస్తోంది.

Read Also- Chinna Mupparam: అక్రమంగా ప్రభుత్వ భూమి కబ్జా.. భూమిని కాపాడాలంటూ గ్రామస్తులు డిమాండ్..!

పవన్ భిన్నం అంటున్న ఫ్యాన్స్

నాడు అంబటిని ఎగతాళి చేసిన వారు, నేడు పవన్‌ను పొగడటం ఏంటంటూ వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. అయితే, అంబటి రాంబాబుకు పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా గట్టిగా సమాధానం ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి పాలిటిక్స్‌లోకి వచ్చిన అని, ఆయన డ్యాన్స్ చేయడం అందంగా, అబ్బినట్టుగా ఉందని కౌంటర్లు ఇస్తున్నారు. కానీ అంబటి రాజకీయాల కంటే డ్యాన్సులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

కాగా, సంక్రాంతి పండుగ అంటేనే ఏపీలో చాలా కోలాహలంగా ఉంటుంది. ఏది ఏమైనా, రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎవరిని వేలెత్తి చూపుతారో చెప్పలేం. చిన్న అవకాశం దక్కినా విమర్శలకు పదును పెడుతుంటారు. పండుగ వినోదానికి ‘డ్యాన్స్ పాలిటిక్స్’ తోడవ్వడంతో ఈసారి సెలబ్రేషన్స్ మరింత జోష్‌తో జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Read Also- BMW Pre Release Event: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడంటే?

Just In

01

Jana Sena: జనసేన ఊహించని నిర్ణయం.. తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో పోటీకి సై

Ponguleti Srinivas Reddy: జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. గతం కంటే ఎక్కువ అక్రిడిటేషన్ కార్డులు

Cyber Fraud: రిటైర్డ్ ఐపీఎస్​ భార్యకు సైబర్ మోసగాళ్ల టోకరా.. ఎంత పని చేశార్రా!

Heavy Traffic: హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై వాహనాల రద్దీ.. డ్రోన్ కెమెరాలతో పోలీసులు పర్యవేక్షణ

Romeo Juliet Rule: రోమియో జూలియెట్ రూల్.. ‘పోక్సో’ దుర్వినియోగంపై కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన