BMW Pre Release Event: మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja), కిషోర్ తిరుమల (Kishore Tirumala) దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi). రవితేజ సరసన డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ వంటివన్నీ సినిమాపై హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. సంక్రాంతి స్పెషల్‌గా ఈ సినిమా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబైంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్‌ను మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చాలా ఈవెంట్స్ ఈ సినిమా కోసం నిర్వహించారు. రవితేజతో పాటు హీరోయిన్లు ఇద్దరూ ఈ ప్రోమోషన్స్‌లా చాలా యాక్టివ్‌గా పాల్గొంటూ.. అందరి దృష్టి సినిమాపై పడేలా చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ సన్నద్ధమయ్యారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ డిటైల్స్ ఇవే..
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ప్రీ రిలీజ్ వేడుక (BMW Pre Release Event)కు సంబంధించి అధికారిక ప్రకటనను తెలుపుతూ మేకర్స్ ఓ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ ప్రకారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జనవరి 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు గ్రాండ్‌గా నిర్వహించబోతున్నట్లుగా తెలిపారు. ఈ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ లక్సరీ హోటల్‌లో నిర్వహించబోతున్నారు. ఈ విషయం తెలుపుతూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో రవితేజ మ్యూజిక్ గిటార్ పట్టుకుని ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు. ఆయన పక్కన ఏరోప్లేన్ ఉండటం గమనించవచ్చు. ఈ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరుగుతాయని మేకర్స్ చెబుతున్నారు. రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్‌తోనే అంచనాలు ఆకాశానికి చేరాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఏదైనా కొత్తగా వదిలితే మాత్రం.. ఫ్యాన్స్‌లో ఇంకాస్త ఊపొస్తుందనడటంలో సందేహం లేదు.
Also Read- MSG Ticket Price: చిరు సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. టికెట్ ధరల హైక్, ప్రీమియర్ వివరాలివే!
ట్రైలర్ ఎలా ఉందంటే..
‘ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ గన్‌లు, కత్తులు, భోజనాల ఫైట్, జాతర ఫైట్.. ఓ తెగ చేసేశాను. అందుకే మా ఫ్యామిలీ డాక్టర్ చిన్న గ్యాప్ ఇవ్వమని చెప్పాడు’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ను ప్రారంభించారు. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే కథలోకి తీసుకెళ్లారు. ‘రామ్ లైఫ్‌లో ప్రేమ, పెళ్లి ఏదైనా సరే.. అది నాతోనే మొదలవుతుంది, నాతోనే ఎండ్ అవుతుంది’ అని డింపుల్‌తో చెప్పించి భార్యభర్తల మధ్య అనుబంధాన్ని తెలియజేశారు. ఇక ఇక్కడే అసలు చిక్కు మొదలైంది. ఆమె చెప్పిన డైలాగ్‌కు రివర్స్‌లో మాస్ రాజా ప్రేమయాణం మొదలైంది. అదిరిపోయే రేంజ్‌లో ఆషికా (Ashika Ranganath)ను దింపి, ‘ఏ రిలేషన్ షిప్ అయినా మనం కలిసే పర్సన్‌ని బట్టి డిపెండై ఉంటుంది. రైటా? రాంగా? అని. ఐ థింక్ హి ఈజ్ ద రైట్ పర్సన్’ అని ఆషికా చెప్పే డైలాగ్‌లో రవితేజకు అసలు చిక్కులు మొదలయ్యాయి. ‘మగాళ్ల ముందు మాసే కావచ్చు.. కానీ ఇక్కడుంది ఇద్దరు ఆడాళ్లు.. టాస్ ఏసి బొమ్మా, బొరుసా? అని నిలబెట్టెళ్లు’’ అనే డైలాగ్‌తో రవితేజ ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ డైలాగ్ తర్వాత వచ్చే సీన్లన్ని అద్భుతంగా పండటమే కాదు, సీట్లో ఆడియెన్‌ని కూర్చోనివ్వవంటే నమ్మాలి. వెంటనే సెంటిమెంట్.. ‘నలుగురిలో నన్ను తలెత్తుకునేలా చేసే నువ్వు.. ఇవాళ నా వల్ల తలదించుకోవాల్సి వచ్చింది’ అని డింపుల్ చెప్పే డైలాగ్‌తో ఎమోషనల్ టచ్ ఇచ్చారు.
Also Read- Telangana High Court: ‘రాజా సాబ్’ నిర్మాతకు షాక్.. టికెట్ ధరల హైక్ మెమోని కొట్టేసిన హైకోర్టు!
ఎప్పటికీ తెగని సంసారం
‘ఇక లాభం లేదు లీల.. ఇద్దరికీ నిజం చెప్పేస్తాను’ అంటూ రవితేజ చెప్పే డైలాగ్ సినిమాకు ఎంతో కీలకమైనదనే విషయం తెలిసిపోతుంది. అసలు విషయం చెప్పడానికి సిద్ధమైన రవితేజకు.. ‘నీకు పెళ్లైనా సరే.. నాతో అలా ఉన్నావంటే.. బాలామణికి డిస్‌కనెక్ట్ అయ్యి, హార్ట్‌ఫుల్‌గా ఇష్టంతోనే నాతో కనెక్ట్ అయ్యావా?’ అని ఆషిక.. ‘అన్ని రకాలుగా బానే చూసుకుంటున్నాను కదా.. నేనుండగా ఇంకో అమ్మాయి నీ లైఫ్‌లోకి ఎందుకొచ్చింది?’ అని డింపుల్.. మళ్లీ మాస్ రాజాను అడ్డంగా బుక్ చేయడం చూస్తుంటే.. ఇది ఎప్పటికీ తెగని సంసారం అనే విషయం ఇట్టే తెలిసిపోతుంది. దీనికి సింక్ అయ్యేలా చివరిలో ‘ఏడు కొండలవాడా వెంకటేశా.. ఓరయ్యో ఎంత పని చేశావు’ అనే పాటను ప్లే చేయడం చూస్తుంటే దర్శకుడు ఈ సినిమా హ్యాండిల్ చేసిన తీరు.. కచ్చితంగా బ్లాక్‌బస్టరే అనే ఫీల్ ఇస్తోంది.
#BharthaMahasayulakuWignyapthi Grand Pre-release Event on 10th January from 6 PM onwards 🔥🥳
📍ITC Kohenur, Hyderabad ❤🔥
Book your free passes here ⬇️
🔗https://t.co/keFNAx6l08#BMWTrailer TRENDING TOP on YouTube 🔥🔥🔥
▶️ https://t.co/9bV1T94HqA#BMW GRAND RELEASE… pic.twitter.com/2B6xyumEIt— SLV Cinemas (@SLVCinemasOffl) January 9, 2026
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

