Purushaha Teaser: టాలీవుడ్ పోస్టర్స్‌తోనే హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా ఏదైనా ఉందీ అంటే.. అది కచ్చితంగా ‘పురుష:’ (Purushaha) అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఎటువంటి టీజర్ విడుదల కాకుండా, కేవలం పోస్టర్స్‌తోనే సినిమాను వార్తలలో ఉండేలా చేశారు మేకర్స్. ఎందుకంటే, ఆ పోస్టర్స్ అలా ఉన్నాయి మరి. భార్యాభర్తల కథలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. అందుకే ఈ సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ దాదాపు భార్యభర్తల కథలనే నమ్ముకుని వస్తున్నాయి. భార్యభర్తల కాంబోకు కాస్త కామెడీ జోడించి, రియాలిటీకి దగ్గరగా చూపిస్తే ఆ సినిమా పక్కా సూపర్ హిట్ అవుతుందని కొన్ని సంక్రాంతులుగా టాలీవుడ్ నిరూపిస్తూ వస్తుంది. అలాంటి ఫ్యామిలీ కథతో వినూత్నంగా ఎంటర్టైన్ చేయడానికి, ప్రస్తుత తరానికి తగ్గట్టుగా ట్రెండీ మేకింగ్‌తో రూపుదిద్దుకుంటోన్న చిత్రమే ‘పురుష:’. పెళ్లి తర్వాత పురుషులు పడే అవస్థలను చూపిస్తూనే.. భార్యల ఇంపార్టెన్స్ ఏంటనేది ఈ సినిమాలో మేకర్స్ చూపించబోతున్నామని మేకర్స్ చెబుతూ వస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్‌ని ‘పెద్ది’ దర్శకుడు (Peddi Director) బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్‌ను చూసిన బుచ్చిబాబు సానా.. చాలా ఆసక్తికరంగా ఉందని, కచ్చితంగా మంచి సక్సెస్ అవుతుందని తెలుపుతూ.. చిత్ర యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక ఈ టీజర్ (Purushaha Teaser)ని గమనిస్తే..
Also Read- Silent Screams: వరంగల్, ఆసిఫాబాద్, నల్గొండ జిల్లాలతో శృతి హాసన్‌కున్న లింకేంటి?
మగజాతి గర్వించదగ్గ ఆణిముత్యాలు
టీజర్‌లో ఉన్న ప్రతి సీన్‌లో కామెడీ ఉండేలా దర్శకుడు తన ప్రతిభను కనబరిచారు. ‘ప్రపంచాన్ని జయించడం కోసం ముగ్గురు యోధులు అలు పెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు. వీరి యుద్ధ రీతి మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎన్ని యుద్ధాలు చేసినా, ఎక్కడో శత్రు శేషం మిగిలిపోయిందన్న వెలితి’ అంటూ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో ఈ టీజర్ మొదలైంది. ఈ డైలాగ్ వస్తున్నప్పుడు తెరపై కనిపించే ఆ ముగ్గురు యోధులను పరిచయం చేసిన తీరు చాలా ఆసక్తికరంగా ఉంది. పెళ్లిళ్లై సంవత్సరమన్నా కాలేదు.. అప్పుడే విడాకులు ఏంటాయ్యా? అని జడ్జి.. ‘ఏ దినము చూసినా షాపింగ్.. షాపింగ్.. షాపింగ్.. అది మా దినముకి వచ్చుచున్నదిరా కౌన్సిలర్ బిడ్డా’ అంటూ సప్తగిరి చెప్పిన డైలాగ్ నేటితరం భార్యాభర్తల తీరును తెలియజేస్తుంది. ‘మగజాతి గర్వించదగ్గ ఆణిముత్యాలండీ మీరు..’ అని చెబుతూ.. ముగ్గురితో పెళ్లాలు ఆడుకున్న తీరు చూస్తే పొట్టచెక్కలయ్యేలా నవ్వకుండా ఉండలేరు. మొత్తంగా చూస్తే ఇది పక్కా కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ అనేది ఈ టీజర్ తెలియజేస్తుంది. పెళ్లి, ఆ తర్వాత లైఫ్ ఎలా ఉంటుందనే కోణంలో కామెడీని జోడించి.. ఈ సినిమాను తెరకెక్కించారనేది తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read- Telangana High Court: ‘రాజా సాబ్’ నిర్మాతకు షాక్.. టికెట్ ధరల హైక్ మెమోని కొట్టేసిన హైకోర్టు!
కామెడీ కుమ్ముడే..
సినిమా వివరాలకు వస్తే.. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు ఈ ‘పురుష:’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ బత్తుల (Pavan Kalyan Battula) హీరోగా పరిచయం అవుతుండగా.. వీరు వులవల (Veeru Vulavala) దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌తో పాటు సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్స్ ఎలా అయితే ఈ సినిమాపై హైప్‌ని క్రియేట్ చేశాయో.. ఈ టీజర్ కూడా ఆ హైప్‌ని డబుల్ చేస్తోంది. వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ వంటి కమెడియన్స్ ఇందులో కామెడీ కుమ్మేస్తున్నారు. ఈ సినిమాకు శ్రవన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తుండగా, ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటున్నట్లుగా మేకర్స్ తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

