ఛత్తీస్ గఢ్ (Chhattisgarh) లో ఆదివారం ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందగా, మరికొంత మంది గాయపడినట్లు తెలుస్తోంది. అలాగే ఇద్దరు జవాన్లు సైతం మరణించారు. డీఆర్జీ, ఎస్టీఎఫ్ బృందాలు కూంబింగ్ ను కొనసాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్ కౌంటర్ సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
