Lady Don Sunitha | లేడీ డాన్ సునీతాదాస్ అరెస్ట్
Lady don sunitha
క్రైమ్

Lady Don Sunitha | లేడీ డాన్ సునీతాదాస్ అరెస్ట్

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : గంజాయి దందాలో లేడీ డాన్ పేరుగాంచిన సునీతా దాస్ (Lady Don Sunitha) కొద్దిరోజులుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నది. కొత్త కొత్త జిమ్మిక్కులతో పోలీసుల కళ్లు గప్పి గంజాయి తరలిస్తున్న సునీతా దాస్.. ఈసారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్నట్లు ప్లాన్ చేసి, కారులో 14 కిలోల గంజాయి తీసుకొని హైదరాబాద్ వచ్చింది. ఈ సమాచారం తెలుసుకున్న ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీం అధికారులు సునీతాదాస్‌తో పాటు ఆమె సహచరులను అరెస్ట్ చేశారు.

ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీ.బీ. కమలాసన్‌రెడ్డి కథనం ప్రకారం.. ఒడిశా రాష్ర్టం మల్కాన్‌గిరి జగ్దల్ దేవపూర్‌కు చెందిన సునీతా‌దాస్ ఈజీ మనీ కోసం కొద్ది రోజులుగా గంజాయి దందా చేస్తున్నది. ఎప్పటిలానే జగ్దల్‌ దేవపూర్‌లో 14 కిలోల గంజాయి కొనుగోలు చేసి, తన కారు వెనుక సీటు కింద ప్రత్యేకంగా తయారు చేయించిన బాక్సుల్లో పెట్టి హైదరాబాద్ ధూల్‌పేటలో డెలివరీ ఇచ్చేందుకు బయలుదేరింది. పోలీసులు పట్టుకోకుండా ఉండేందుకు తన వెంట సహచరులను కుటుంబ సభ్యుల్లా పెట్టుకున్నది.

Also Read : ఢిల్లీలో బీజేపీ గెలుపుపై చంద్రబాబు రియాక్షన్.. BRSపై సెటైర్

అయితే, పక్కా సమాచారంతో ఎక్సైజ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు, జ్యోతి, సిబ్బందితో కలిసి సునీతా దాస్ (Lady Don Sunitha) తోపాటు ఆమె సహచరులు ఖురేషి, కంకన్ సేన్‌లను హయత్‌నగర్ వద్ద అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.8.5 లక్షల విలువ గల గంజాయి, కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Just In

01

Chiranjeevi Movie: ‘మనశంకరవరప్రసాద్ గారు’ స్పీడు చూస్తే ఈ సంక్రాంతికి హిట్ కొట్టేలా ఉన్నారు.. బాసూ ఏంటా గ్రేసూ..

Mynampally Rohit Rao Protest: ఉపాధి హామీపై కేంద్రం కుట్ర.. పేదల కడుపు కొట్టొద్దు.. బీజేపీపై మెదక్ ఎమ్మెల్యే ఫైర్

CM Revanth Reddy: పంచాయతీ ఫలితాలపై సీఎం రేవంత్ తొలిసారి స్పందన.. కేసీఆర్‌కు ఒక సవాలు

Harish Rao: మా సర్పంచ్‌లను బెదిరిస్తే.. వడ్డీతో సహా తిరిగిస్తా.. హరీశ్ రావు స్ట్రాంగ్ వార్నింగ్

Bigg Boss9 Telugu: డీమాన్ పవన్‌కు బిగ్ బాస్ ఇచ్చిన హైప్ మామూలుగా లేదుగా.. కానీ సామాన్యుడిగా వచ్చి..