Varunavi: సరిగమప లిటిల్ చాంప్స్ వరుణవికి చిరు ఆశీస్సులు
Chiranjeevi Varunavi (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Varunavi: మెగాస్టార్ మాటిచ్చారు.. సరిగమప లిటిల్ చాంప్స్ వరుణవికి చిరు ఆశీస్సులు

Varunavi: జీ తెలుగు (Zee Telugu) ఛానల్‌లో ప్రసారమయ్యే ‘సరిగమప లిటిల్ ఛాంప్స్’ సింగింగ్ షోలో వరుణవి (Varunavi అనే చిన్న పాపకి ఫ్యాన్ కాని వారంటూ ఎవరూ లేరు. పుట్టినప్పటి నుంచి కళ్లు లేకపోయినా, గ్రహించి ఎంతో చక్కగా పాటలు పాడుతుంది. ఆ చిన్నపాప పాటకు అంతా ఫిదా అవ్వాల్సిందే. ముద్దు ముద్దు మాటలతో ‘అనిల్ మామ’, ‘సుధీర్ మామ’, ‘అనంత్ మామ’ అంటూ ఆమె పిలుస్తుంటే.. పిలిపించుకున్న వారికే కాదు, చూస్తున్న వారికి కూడా ఎంతో ఆనందం వస్తుంది. ఆ పాప కోసమే ఈ షోకు వచ్చే సెలబ్రిటీలు ఉన్నారంటే అస్సలు అతిశయోక్తి కానే కాదు. అవును, ఆర్పీ పట్నాయక్ ఈ షో‌కి వచ్చి, కేవలం వరుణవి కోసమే వచ్చానని ప్రకటించారు. తమ సినిమాల ప్రమోషన్స్ కోసం వచ్చిన సెలబ్రిటీలు ఎందరో ఆ పాపకు ఫ్యాన్ అయ్యారు. హోస్ట్ సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) అయితే ఆ పాప కోసం ఓ పాట పాడి అందరినీ ఎమోషనల్‌కు గురి చేశారు. ఆ పాప గురించి, సుధీర్ చెబుతుంటే ప్రతి ఒక్కటి కంట్లో నుంచి నీళ్లు వచ్చాయి. అలాంటి వరుణవికి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఆశీస్సులు కూడా అందాయి.

Also Read- The Raja Saab: ‘ది రాజా సాబ్’కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. బెనిఫిట్ షో టికెట్ ధర వింటే షాకే!

నెమలిలా ఉన్నావ్

ఈ షో ఫినాలే సందర్భంగా తాజాగా జీ తెలుగు టీమ్ ఓ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో వరుణవి మాట్లాడుతూ.. ‘అనిల్ (Anil Ravipudi) మామా.. నన్నొకసారి చిరు మామ దగ్గరకు తీసుకెళ్లవా?’ అని అడిగింది. వెంటనే అనిల్ రావిపూడి మెగాస్టార్‌కు కాల్ చేసి.. మెగా అపాయింట్‌మెంట్ ఫిక్స్ అని ప్రకటించారు. అంతే, మెగాస్టార్ ఇంట్లో పాప ప్రత్యక్షమైంది. ఇంక మెగాస్టార్‌తో వరుణవి ముచ్చట్ల గురించి చెబితే అస్సలు బాగోదు చూడాల్సిందే. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. పాపను చూడగానే.. ‘అసలు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా.. నెమలిలా ఉన్నావ్’ అని తన ఒడిలోకి తీసుకున్నారు చిరంజీవి. ‘రికార్డులో మీ సినిమా ఉండటం కాదు.. మీ సినిమాపైనే రికార్డు ఉంటుంది’ అని వరుణవి డైలాగ్ చెప్పగానే చిరు పగలబడి నవ్వారు. ఆ తర్వాత చిరుకి ఆ పాప ‘మీసాల పిల్ల’ పాటను పాడి వినిపించింది.

Also Read- BMW Trailer: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ ఎలా ఉందంటే..

మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి చాలు

‘ఈ పాప విషయంలో ఏ విధమైన సహాయ సహకారాలైనా సరే నేను బాధ్యత తీసుకుంటాను’ అని మెగాస్టార్ చిరంజీవి మాట ఇచ్చారు. ‘నేను నీకు చాక్లెట్ ఇస్తాను తింటావా.. పళ్లు పుచ్చిపోతాయంటావా? నేను ఎక్కడో చూశాను నువ్వు అలా అనడం’ అని చిరు చాక్లెట్ తినిపించగానే.. ‘మీరు అసలు ఏమీ ఇవ్వకండి. మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి చాలు’ అనగానే చిరు ఉప్పొంగిపోయారు. ‘బెండకాయ్ బెండకాయ్.. చిరు మామ నా గుండెకాయ్’ అని పాప అనగానే చిరు ఆశ్చర్యపోయారు. ఇక చిరు కూడా పాపను సర్‌ప్రైజ్ చేసేలా.. ‘థ్యాంక్యూ సోమచ్.. గాడ్ బ్లెస్ యు’ అని ఆ పాప డైలాగ్‌ని ఆ పాపకే చెప్పారు. వావ్ అంటూ వరుణవి క్లాప్స్ కొట్టింది. ఇది, ఈ వీడియోలో ఉన్న మ్యాటర్. చూస్తుంటే ఎంతో హాయిగా ఉంది. డోంట్ మిస్.. మీరు కూడా చూసేయండి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Minister Komatireddy: నన్ను ఏమైనా అనండి.. మహిళా అధికారిపై రాతలు బాధాకరం.. నోరువిప్పిన మంత్రి కోమటి

Gadwal Police: మొసల్ దొడ్డి అటవీ ప్రాంతంలో జరిగిన హత్య కేసులో వీడిన మిస్టరీ.. అందుకే చంపేశాడు..?

Chiranjeevi Movie: మెగాస్టార్ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ప్రీమియర్ ఎంతంటే?

Republic Day 2026: రిపబ్లిక్ డే వేడుకలకు ఆటంకం కలగకుండా 1,275 బోన్‌లెస్ చికెన్.. దీని వెనుక పెద్ద కారణమే ఉంది

Dandora OTT Release: ‘దండోరా’ వేస్తూ ఓటీటీలోకి వచ్చేస్తోన్న శివాజీ సినిమా.. ఎప్పుడంటే?