Study Tour Controversy: బల్ధియా మనీతో కార్పొరేటర్ల భర్తల జల్సాలు
Study Tour Controversy (imagecredit:swetcha)
Telangana News, హైదరాబాద్

Study Tour Controversy: జీహెచ్ఎంసీ ఖర్చుతో కార్పొరేటర్ల భర్తల జల్సాలు.. ఫోటోలు వైరల్..?

Study Tour Controversy: దేశంలోనే అతి పెద్ద స్థానిక సంస్థగా అవతరించిన జీహెచ్ఎంసీ(GHMC) నుంచి ప్రజలకు ఉత్తమమైన సేవలందించేందుకు బాధ్యతాయుతమైన పాత్ర పోషించాల్సిన కార్పొరేటర్లు స్టడీ టూర్ల పేరిట గుజరాత్ అహ్మదాబాద్ లో జల్సాలు చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీకి ఆర్థికంగా ఊరట కల్గించే విషయం దేవుడెరుగు గానీ, ఆర్థిక భారం పెంచేలా కార్పొరేటర్లు వ్యవహారిస్తూ దుబారా ఖర్చులు చేస్తున్నారన్న వాదనలు సైతం లేకపోలేవు. వచ్చే నెల 10వ తేదీతో పాలక మండలి అధికార గడువు ముగిస్తున్నందున, చివరి రోజుల్లో కార్పొరేషన్ పై ఆర్థిక భారం మోపుతున్నారన్న అపవాదును ప్రస్తుత పాలక మండలి మూటకట్టుకుంది.

కార్పొరేటర్ల మొదటి బృందం

జీహెచ్ఎంసీ పాలక మండలిలో ప్రస్తుతం మేయర్, డిప్యూటీ మేయర్ లతో కలుపుకుని మొత్తం 145 మంది బీఆర్ఎస్(BRS), ఎంఐఎం(MIM), కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) పార్టీలకు చెందిన కార్పొరేటర్లు టూర్ కు వెళ్లాలని నిర్ణయించినా, ఆ తర్వాత కార్పొరేటర్ల ఇష్టారాజ్యమే కొనసాగింది. వీరిలో 121 మంది కార్పొరేటర్లు స్టడీ టూర్ ను ప్లాన్ చేసుకుని ఓ ట్రావెల్స్ ఏజెన్సీకి ఒక్కోక్కరికి రూ. లక్ష చొప్పున బేరం కుదుర్చుకుని ఎంఐఎం పార్టీ మినహా మిగిలిన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 35 మంది కార్పొరేటర్ల మొదటి బృందం అహ్మదాబాద్ స్టడీ టూర్ కోసం ఈ నెల 6న బయల్దేరి వెళ్లింది. కార్పొరేటర్ అయినా, మహిళా కార్పొరేటర్ అయినా కేవలం సభ్యులను మాత్రమే టూర్ కు తీసుకెళ్తున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వ్యాఖ్యానించినా, సభ్యులు కానీ వారికి సైతం ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని తీసుకెళ్తున్నా, మేయర్, డిప్యూటీ మేయర్లు కనీసం అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవటం గమనార్హం. ఈ పాలక మండలి టెర్మ్ లో ఇది మూడో స్టడీ టూర్. గతంలో చేసిన స్టడీ టూర్ కు సంబంధించి టూర్ ముగిసిన తర్వాత ఏం స్టడీ చేశారోనన్న విషయాన్ని కార్పొరేటర్లు ఏ సందర్భంలోనూ వెల్లడించలేదు.

దర్శనాలు.. బీచ్‌లో ఫొటోలు

అహ్మదాబాద్‌లో ల్యాండ్ అయిన కార్పొరేటర్ల బృందం మొదటి రోజు ద్వారక నగరాన్ని దర్శించుకుని, ఆ తర్వాత బీచ్‌లో ఫొటోలకు ఫోజులిచ్చారే తప్పా, అహ్మదాబాద్ నగరంలోని ఏ ఒక్క అంశంపై ఎలాంటి స్టడీ చేయేలేదని తెలిసింది. సాధారణంగా ఇలాంటి స్టడీ టూర్లకు వెళ్లే కార్పొరేటర్లు తాము ఎంచుకున్న నగర స్థానిక మున్సిపల్ అధికారులను, పాలక మండలి పెద్దలను కలిసి అక్కడ ప్రజలకు అందిస్తున్న సేవల గురించి, అధ్యయనం చేసి, వారి నగరానికి అవసరమైన అంశాలను తెల్సుకుని, టూర్ ముగిసిన తర్వాత తమ నగరంలో ఆ అంశాలను అమలు చేసేందుకు ప్రయత్నం చేయాలన్నది స్టడీ టూర్ తాత్పర్యం. కానీ మన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు స్టటీ టూర్ పేరిట కార్పొరేటర్లు, కార్పొరేటర్లు కానీ వారి బంధువులను గుంపులుగా తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ నెల 6న టూర్ లోని మొదటి రోజు అహ్మదాబాద్ స్థానిక మున్సిపల్ అధికారులనెవ్వర్నీ కలవలేదు. ఏ అంశంపై స్టడీ చేసిన దాఖలాల్లేవు. సబర్మతి నదీ సుందరీకరణను తిలకించినట్లు సమాచారం.

Also Read: Power Scam: విద్యుత్​ శాఖలో జిగేల్ జిమ్మిక్కులు.. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై జోరుగా అధికారుల దందా..!

స్టడీ టూర్ పేరిట ఫ్యామిలీ టూర్

స్టాండింగ్ కమిటీలో పెట్టిన ప్రతిపాదన ప్రకారం పాలక మండలిలో సభ్యులుగా పరిగణించే కార్పొరేటర్ల మాత్రమే స్టడీ టూర్ కు వెళ్లాలని నిబంధన పెట్టుకున్నారు. కానీ ఆ తర్వాత సీన్ మారిపోయింది. మహిళా కార్పొరేటర్ల భర్తలు, కార్పొరేటర్ల భార్యలు, పిల్లలు, బంధువులను కూడా తీసుకుని స్టడీ టూర్ పేరిట ఫ్యామిలీ టూర్ కు వెళ్లినట్లు సీన్ మారిపోయింది. స్టడీ టూర్ల పేరిట జీహెచ్ఎంసీ నిధులను ఇలా ఖర్చు చేయటం పట్ల నగరవాసులు తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం పాలక మండలి సభ్యులైన కార్పొరేటర్ల స్టడీ టూర్ కోసం సుమారు రూ. కోటిన్నర వరకు ఖర్చవుతుందని వేసిన అంచనాలన్నీ ఇపుడు తారుమారయ్యాయి. ఈ టూర్ ఫ్యామిలీ టూర్ గా మారినందున అంచనా వేసిన ఖర్చు రెండింతలయ్యే అవకాశాలున్నాయి. కొందరు కార్పొరేటర్లు మందు పార్టీలకు పరిమితం కాగా, మరి కొందరు బీచ్ లో ఫొటోలకు ఫోజులివ్వటానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినట్లు సమాచారం.

16న బయల్దేరనున్న రెండో బృందం

స్టడీ టూర్ ను కార్పొరేటర్లంతా కలిసి కట్టుగా కాకుండా ఎవరికి తీరక ఉన్నపుడు వారు వెళ్లేలా ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. ఈ నెల 6వ తేదీన అహ్మదాబాద్ స్టడీ టూర్ కు మొదటి బృందం వెళ్లగా, ఈ నెల 16వ తేదీన రెండో బృందం బయల్దేరనున్నట్లు సమాచారం. ఈ బృందంలో కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన సభ్యలుండగా, ఎంఐఎం పార్టీకి చెందిన కార్పొరేటర్లు అజ్మీర్ దర్గాకు వెళ్లేందుకు స్పెషల్ గా ప్లాన్ చేసినట్లు సమాచారం.

Also Read: Anil Sunkara: ఆ రెండు సినిమాలు ప్లాప్ తర్వాత నిర్మాత ఏం చేశాడంటే?.. రూ.80 కోట్లు నష్టం..

Just In

01

Ponguleti Srinivas Reddy: జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. గతం కంటే ఎక్కువ అక్రిడిటేషన్ కార్డులు

Cyber Fraud: రిటైర్డ్ ఐపీఎస్​ భార్యకు సైబర్ మోసగాళ్ల టోకరా.. ఎంత పని చేశార్రా!

Heavy Traffic: హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై వాహనాల రద్దీ.. డ్రోన్ కెమెరాలతో పోలీసులు పర్యవేక్షణ

Romeo Juliet Rule: రోమియో జూలియెట్ రూల్.. ‘పోక్సో’ దుర్వినియోగంపై కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన

MLA Bhukya Murali Naik: ప్రజల అభిప్రాయం మేరకే టికెట్స్.. పైరవీలు పనికిరావు: ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్