TG Education Policy: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలుపై కమిటీ!
TG Education Policy (imagecredit:twitter)
Telangana News

TG Education Policy: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలుపై.. కేకే అధ్యయన కమిటీ ఏర్పాటు!

TG Education Policy: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలుపై ప్రభుత్వ సలహాదారుడు కేకే ఆధ్వర్యంలో అధ్యయన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహా(Minister Damodara Rajanarasimha) పేర్కొన్నారు. మంగళవారం ఆయన శాసన మండలిలో మాట్లాడుతూ.. కమిటీ నివేదిక వచ్చాక రాష్ట్ర విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఎన్‌ఈపీ(NEP) అమలుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూ‌ క్యాంపస్‌ను భవిష్యత్తులో యూనివర్సిటీగా మార్చే అంశాన్ని పరిశీలిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.

భవిష్యత్తులో ఆ దిశగా చర్యలు

యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన విశాలమైన ప్రాంగణం, అన్నిరకాల, వసతులు అఫ్లియేషన్‌కు సరిపడా కాలేజీలు సంగారెడ్డి(Sangaredddy), మెదక్(Medak) జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. 2012లో తాము అధికారంలో ఉన్నప్పుడు జేఎన్‌టీయూ(JNTU) క్యాంపస్‌ను సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటు చేయించానని, ఆ కాలేజీని యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేయాలన్న ఆలోచన తనకు ఉందన్నారు. భవిష్యత్తులో ఆ దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. సంగారెడ్డి జిల్లాలో అనేక పరిశ్రమలు ఉన్నాయని, ఇక్కడి పరిశ్రమలకు అవసరమైన స్కిల్డ్ కోర్సెస్ అందించే అద్భుతమైన యూనివర్సిటీని భవిష్యత్తులో ఏర్పాటు చేసే ఆలోచన చేస్తామన్నారు. పేదరికం అనే సంకెళ్లను తెంచి, సామాన్యుడి తలరాతను మార్చే శక్తి ఉన్న ఏకైక ఆయుధం విద్య మాత్రమేనని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.

Also Read: ACB Rides: ఏసీబీ వలలో చిక్కిన నాగిరెడ్డి పేట తహసీల్దార్

ఒక్కో స్కూల్‌ను 200 కోట్లతో..

తరగతి గదిలో నేర్పే చదువే.. రేపటి సమాజాన్ని, దేశ భవిష్యత్తును నిర్మించే అసలైన పునాది అని ఆయన పేర్కొన్నారు. గతంలో సరియైన సౌకర్యాలు లేని అద్దె భవనాల్లో గురుకులాలను ప్రారంభించారని, దీంతో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారని మంత్రి తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్(Young India Residential Schools) పాలసీని తీసుకొచ్చామన్నారు. ఒక్కో స్కూల్‌ను 200 కోట్లతో, 25 ఎకరాల సువిశాల ప్రాంగణంలో అన్ని సౌకర్యాలతో నిర్మిస్తున్నామన్నారు. గురుకుల విద్యా సంస్థల్లో టైమ్ టేబుల్‌ను మార్చే అంశాన్ని పరిశీలించి.. విద్యార్థులు, టీచర్ల సౌకర్యం మేరకు అవసరమైన నిర్ణయం తీసుకుంటామన్నారు.

Also Read: Hydrogen Train: దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. గంటకు 150 కి.మీ వేగం.. టికెట్ రూ.5 మాత్రమే?

Just In

01

DCM Pawan Kalyan: ‘సినిమా ఫ్లాప్ అయినా.. డబ్బు వచ్చే స్టార్ డమ్ నాది’.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Toxic Actress: ‘టాక్సిక్’ గ్లింప్స్‌లో యాష్‌తో కనిపించిన నటి ఎవరో తెలుసా?.. నటి మాత్రమే కాదు..

Archery Training: గుడ్ న్యూస్.. మహబూబాబాద్‌లో ఉచిత విలువిద్య శిక్షణ శిబిరం

Student Death: మల్కాజ్‌గిరిలో దారుణం.. లెక్చరర్ల వేధింపులు అసభ్యమాటలకు ఇంటర్ విద్యార్థిని మృతి..!

Yash Toxic: రికార్డులు తిరగరాస్తున్న యష్ ‘టాక్సిక్’ హీరో ఇంట్రో గ్లింప్స్.. 24 గంటల్లోనే అంతా..?