BRS Corporators: కాంగ్రెస్‌లోకి ముగ్గురు ఖమ్మం కార్పొరేటర్లు
BRS Corporators (Image Source: Twitter)
Telangana News

BRS Corporators: బీఆర్ఎస్‌కు ఝలక్.. కాంగ్రెస్‌లోకి ఖమ్మం కార్పొరేటర్లు క్యూ.. సీఎం సమక్షంలో చేరికలు

BRS Corporators: ఖమ్మం జిల్లాలో కేటీఆర్ పర్యటనకు ముందు ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కేటీఆర్ ఖమ్మంలో అడుగుపెట్టిన రోజే ఆ పార్టీకి చెందిన మరో ముగ్గురు కార్పొరేటర్లు సీఎం రేవంత్ (CM Revanth Reddy) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao) ఆధ్వర్యంలో హైదరాబాద్ కు వచ్చిన కార్పొరేటర్లు దనియాల రాధ, తోట ఉమారాణి, రుద్రగాని శ్రీదేవిలకు కాంగ్రెస్ కండువ కప్పి సీఎం రేవంత్ పార్టీలోకి అహ్వానించారు.

మరికొందరు కార్పొరేటర్లు సైతం..

ఖమ్మం కార్పోరేషన్ కు చెందిన మరికొందరు కార్పొరేటర్లు సైతం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కార్పొరేటర్లు సీహెచ్ లక్ష్మీ, జి. చంద్రకళ, డి. సర్వసతి, అమృతమ్మ, ఎం. శ్రావణి కూడా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. ఖమ్మం జిల్లా నేతలు ఎమ్మెల్యే మట్టా రాగమయి, తుమ్మల యుగంధర్, మాజీ ఎమ్మెల్సీ బాలిసాని లక్ష్మీ తదితురులు కార్పొరేటర్లతో పాటు సీఎంను కలిశారు.

బీఆర్ఎస్‌కు పెద్ద దెబ్బే..!

ఖమ్మంలోని బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతుండటంతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్వయంగా రంగంలోకి దిగారు. ఖమ్మం టూర్ లో భాగంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లతో సమావేశమయ్యేందుకు అక్కడ అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే మరో ముగ్గురు కార్పొరేటర్లు సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరడం కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ శ్రేణులను షాక్ కు గురిచేసినట్లు తెలుస్తోంది. తాజాగా కాంగ్రెస్ లో చేరిన ముగ్గురు ఖమ్మం కార్పొరేటర్లు బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఇది బీఆర్ఎస్ కు పెద్ద ఎదురు దెబ్బేనని పొలిటికల్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో దీని ప్రభావం కచ్చితంగా బీఆర్ఎస్ పై పడుతుందని అభిప్రాయపడుతున్నారు.

Also Read: BJP – Congress: రాజకీయాల్లో సంచలనం.. ఒక్కటైన కాంగ్రెస్, బీజేపీ.. కమలానికే అధికార పీఠం

ఖమ్మంలో కేటీఆర్ రోడ్ షో

మరోవైపు పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఖమ్మంలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా రోడ్ షో నిర్వహించారు. కేటీఆర్ కు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. జై కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన ఖమ్మం జిల్లా సర్పంచ్ ల అభినందన సభలో కేటీఆర్ పాల్గొన్నారు.

Also Read: Sunil Kumar Arrest: రూ.28 కోట్ల పన్ను ఎగవేత.. కాంగ్రెస్ నేత సునీల్ కుమార్ అరెస్టు

Just In

01

Yash Toxic: రికార్డులు తిరగరాస్తున్న యష్ ‘టాక్సిక్’ హీరో ఇంట్రో గ్లింప్స్.. 24 గంటల్లోనే అంతా..?

GHMC: ఆ మూడు కార్పొరేషన్ల పాలన షురూ? తర్వాతే కీలక నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం!

Anasuya Post: ఏంట్రా ఇలా ఉన్నారు!.. ఎవరు యూటర్న్ తీసుకుంది?.. అనసూయ..

Jagtial District: చైనా మాంజా ప్రమాదం.. మెడ కోసుకుపోయి.. బాలుడికి తీవ్ర గాయాలు

Municipality Elections: ఆ జిల్లా మున్సిపాలిటీపై బీజేపీ ఫుల్ ఫోకస్.. గెలుపే లక్ష్యంగా వ్యూహం!