Couple Friendly: ‘కపుల్ ఫ్రెండ్లీ’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన నిర్మాతలు..
couple-friendly
ఎంటర్‌టైన్‌మెంట్

Couple Friendly: సంతోష్ శోభన్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన నిర్మాతలు.. ఎప్పుడంటే?

Couple Friendly: యంగ్ హీరో సంతోష్ శోభన్, మిస్ ఇండియా (2020) మానస వారణాసి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’ (Couple Friendly). యూవీ క్రియేషన్స్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా ఒక మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి విడుదల తేదీని ప్రకటించారు నిర్మాతలు.. ఈ సినిమా ఫిబ్రవరి 14, 2026 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ డేట్ తెలుపుతూ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమా కథ ప్రధానంగా చెన్నై నేపథ్యంలో సాగనుంది. ఒక యువ ఇంటీరియర్ డిజైనర్ తన కెరీర్‌లో బ్రేక్ కోసం ప్రయత్నిస్తుంటాడు. ఆ క్రమంలో బైక్ పూలింగ్ ద్వారా ఒక అమ్మాయిని కలవడం, వారి మధ్య చిగురించిన పరిచయం ప్రేమగా ఎలా మారింది అనేదే ఈ చిత్ర ఇతివృత్తం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఏక్ మినీ కథతో అందరి చూపూ తన వైపు తిప్పుకున్న సంతోశ్ శోభన్ ఒక ఆశక్తికరమైన ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. యువతను ఆకట్టుకునే విధంగా కథ ఉండబోతుందని నిర్మాతలు ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో స్పష్టమవుతోంది. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Read also-Anil Sunkara: ఆ రెండు సినిమాలు ప్లాప్ తర్వాత నిర్మాత ఏం చేశాడంటే?.. రూ.80 కోట్లు నష్టం..

ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, యువతను ఆకట్టుకునేలా బోల్డ్ అండ్ క్లాసీ లుక్ లో ఉంది. అలాగే ఈ చిత్రంలోని పాటలు మ్యూజికల్ హిట్‌గా నిలుస్తాయని మేకర్స్ ఆశిస్తున్నారు. హీరో సంతోష్ శోభన్ కు జోడీాగా హీరోయిన్ మానస వారణాసి నటిస్తున్నారు.  తమిళ దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. అశ్విన్ చంద్రశేఖర్ ఇంతకు మందు సినిమాటో గ్రఫర్ గా అనేక సినిమాలకు పనిచేశారు. దీంతో ప్రతి ప్రేమ్ కూడా చాలా అందంగా ఉంటుందని ప్రేక్షకులు ఆసిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాకు  సంగీతం ఆదిత్య రవీంద్రన్ అందిస్తున్నారు.  దీంతో ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి.  సినిమాటోగ్రఫీ దినేష్ పురుషోత్తమన్ వ్యవహరిస్తుండగా.. ఎడిటింగ్ బాధ్యతలు గణేష్ శివ నిర్వహిస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ, కొన్ని కారణాల వల్ల విడుదల ఆలస్యమైంది. చివరకు 2026 ప్రిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. సంతోష్ శోభన్ ఇదివరకే ‘ఏక్ మినీ కథ’, ‘మంచి రోజులొచ్చాయి’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకోగా, ఈ సినిమాతో మరో విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు. ఈ సినిమా ఎంత పవకూ ప్రేక్షకులను మెప్పిస్తోందో చూడాలి మరి.

Ticket Rates: టికెట్ రేట్లు పెంచడంపై తెలంగాణ హైకోర్టు ఏం చెప్పిందంటే?.. నిర్మాతలు సేఫ్..

Just In

01

Yash Toxic: రికార్డులు తిరగరాస్తున్న యష్ ‘టాక్సిక్’ హీరో ఇంట్రో గ్లింప్స్.. 24 గంటల్లోనే అంతా..?

GHMC: ఆ మూడు కార్పొరేషన్ల పాలన షురూ? తర్వాతే కీలక నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం!

Anasuya Post: ఏంట్రా ఇలా ఉన్నారు!.. ఎవరు యూటర్న్ తీసుకుంది?.. అనసూయ..

Jagtial District: చైనా మాంజా ప్రమాదం.. మెడ కోసుకుపోయి.. బాలుడికి తీవ్ర గాయాలు

Municipality Elections: ఆ జిల్లా మున్సిపాలిటీపై బీజేపీ ఫుల్ ఫోకస్.. గెలుపే లక్ష్యంగా వ్యూహం!