Akhanda 2: బోయపాటి ఇంటిని చుట్టుముట్టిన బయ్యర్లు.. నష్టం భరించేది ఎవరు?
Akhanda 2 (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Akhanda 2: బోయపాటి ఇంటిని చుట్టుముట్టిన బయ్యర్లు.. నష్టాన్ని భరించేది ఎవరు?

Akhanda 2: ‘అఖండ 2’ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమా అటు నిర్మాతలకు, ఇటు బయ్యర్లకు పెద్ద నష్టాన్నే తెచ్చిపెట్టింది అంటూ ఒకటే వార్తలు. ఈ సినిమా మేకింగ్ కంటే రెమ్యునరేషన్స్‌కే ఎక్కువ బడ్జెట్ అయినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇంతకు ముందు ఏ సినిమాకు లేని విధంగా తన రెమ్యూనరేషన్ రూ. 50 కోట్లు తీసుకున్నట్లుగా సమాచారం. ఇంకా ఆయన కుమార్తె తేజస్విని ఈ చిత్రాన్ని సమర్పించినందుకుగానూ దాదాపు రూ. 10 కోట్లు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఇక్కడికే రూ. 60 కోట్లు అయ్యాయి. నిర్మాత బోయపాటి శ్రీను (Boyapati Sreenu) రూ. 30 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా సమాచారం. ఇప్పుడీ సినిమా భారీగా నష్టాలను తెచ్చిపెట్టినట్లుగా టాక్ నడుస్తుంది.

ఇంటిని చుట్టుముట్టారు

ఈ సినిమా విడుదలకు ముందు ఆర్థిక ఇబ్బందులతో నిర్మాతల పరువు పోయింది. ఇప్పుడు విడుదల తర్వాత బోయపాటి మెడకు చుట్టుకుందన్నట్లుగా సోషల్ మీడియాలో నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ చిత్రాలతో భారీ విజయాలను అందుకున్న మాస్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Thaandavam). విడుదలకు ముందు సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలున్నాయి. కానీ, విడుదల జాప్యంతో సినిమా కలెక్షన్స్‌పై ఆ ప్రభావం తీవ్రంగా పడిందని చెప్పవచ్చు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రం బయ్యర్లకు ఊహించని నష్టాలను మిగిల్చడంతో, ఆగ్రహించిన డిస్ట్రిబ్యూటర్లు ఏకంగా దర్శకుడు బోయపాటి శ్రీను ఇంటిని చుట్టుముట్టినట్లుగా టాక్ నడుస్తుంది. గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలకు కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. కానీ ‘అఖండ 2’ వంటి చిత్రానికి ఇలాంటి పరిస్థితి ఏంటా అని నందమూరి అభిమానులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.

Also Read- Boman Irani: మా ఆవిడకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం.. అందుకే ‘రాజా సాబ్’లో!

బడ్జెట్టే భారమైందా..

ఈ సినిమా ప్రారంభం నుండే భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ‘అఖండ’ మొదటి భాగం ఇచ్చిన ఉత్సాహంతో నిర్మాతలు వెనకాడకుండా ఖర్చు చేశారు. ఈ క్రమంలోనే హీరో బాలకృష్ణ తన కెరీర్‌లోనే అత్యధికంగా రూ. 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ఇండస్ట్రీ టాక్. సినిమాకు క్రేజ్ రావడానికి బాలయ్య బ్రాండ్ ఇమేజ్ అవసరమే అయినా, ఈ భారీ మొత్తం బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపిందని భావించవచ్చు. సినిమా రిలీజ్ తర్వాత లెక్కలు తారుమారయ్యాయి. ‘అఖండ’ మొదటి పార్ట్‌లా ఇది లాభాల పంట పండిస్తుందని ఆశించిన బయ్యర్లకు కోట్లలో నష్టాలు వచ్చాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్, సీడెడ్ ఏరియాల్లో బయ్యర్లు భారీగా నష్టపోయారని తెలుస్తోంది. పెట్టిన పెట్టుబడిలో సగం కూడా తిరిగి రాకపోవడంతో, వారు ఇప్పుడు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ప్రొడక్షన్ హౌస్ నుండి సరైన స్పందన రాకపోవడంతో, బయ్యర్లందరూ కలిసి దర్శకుడు బోయపాటి శ్రీను నివాసానికి చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారట.

Also Read- Anasuya: నిన్న సారీ చెప్పి.. ఇప్పుడేంటి అలాంటి పోస్ట్ పెట్టింది

నష్టాన్ని భరించేది ఎవరు?

ప్రస్తుతం ఉచ్చు బోయపాటి శ్రీనుకి బిగుసుకుంటోంది. సాధారణంగా పెద్ద సినిమాల విషయంలో ఏదైనా నష్టం వస్తే దర్శకుడు లేదా హీరో తమ రెమ్యూనరేషన్‌లో కొంత భాగాన్ని వెనక్కి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఇక్కడ బాలయ్య తన పారితోషికాన్ని వెనక్కి ఇచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే, రిలీజ్ టైమ్‌లోనే ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులకు బాలయ్య కూడా తన రెమ్యునరేషన్‌లో నుంచి కొంత ఇచ్చారనే టాక్ ఉంది. సమర్పించిన తేజస్వినీని అసలు కదిలించలేదు. ఇక మిగిలింది బోయపాటి మాత్రమే. మరి బోయపాటి ఈ గండం ఎలా గట్టెక్కుతారు? తన తదుపరి సినిమాల లాభాల్లో వీరికి వాటా ఇస్తారా? లేక సెటిల్మెంట్ చేస్తారా అన్నది సస్పెన్స్‌గా మారింది. చూద్దాం.. ఏం జరుగుతుందో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Sankranthi 2026: కళ్యాణ్ పడాల, తనూజ కలిసి డ్యాన్స్.. బిగ్ బాస్ తర్వాత మళ్లీ ఈ వేడుకలోనే!

The Raja Saab: ‘ది రాజా సాబ్’ థియేటర్లో మొసళ్లు.. వీళ్లు మాములు ఫ్యాన్స్ కాదు బాబోయ్!

MP Kiran Reddy: రాయలసీమ రొయ్యలపులుసు తిన్న దొంగ ఎవరు?.. ఎంపీ చామల వ్యంగ్యాస్త్రాలు

Jana Nayagan: ‘అఖండ 2’కు ఆర్థిక ఇబ్బందులు.. మరి ‘జన నాయగన్’కు?

Newborn Dies: గుడిలో వదిలివేసిన శిశువు మృతి.. వైద్యులు తెలిపిన కారణాలివే