Mana Shankara Vara Prasad Garu: సెన్సార్ టాక్ వచ్చేసిందోచ్..
Mana Shankara Vara Prasad Garu (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Mana Shankara Vara Prasad Garu: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ రన్ టైమ్ ఎంతంటే?

Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో రాబోతున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu). ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రతో నటిస్తున్న విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్‌ను ఓ రేంజ్‌లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్, పాటలు సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు అన్ని రకాలుగా సిద్ధమైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Also Read- Boman Irani: మా ఆవిడకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం.. అందుకే ‘రాజా సాబ్’లో!

సెన్సార్ నుంచి పాజిటివ్ టాక్..

ఈ సినిమా సెన్సార్ టాక్ చాలా పాజిటివ్‌గా వచ్చిందని తెలుస్తోంది. ఈ సంక్రాంతికి దాదాపు 7 సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో రెండు తమిళ సినిమాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్‌కు సంబంధించి 5 సినిమాలు విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ముందుగా ఈ బరిలోకి ప్రభాస్ ‘ది రాజా సాబ్’గా రాబోతున్నారు. ఆ తర్వాత చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ ‌గారు’, రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ చిత్రాలు క్యూ కట్టనున్నాయి. ఇప్పటికే ప్రభాస్ ‘రాజా సాబ్’ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధమవగా, చిరంజీవి సినిమా కూడా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు అన్ని రకాలుగా రెడీ అయ్యింది. సెన్సార్ నుంచి ఈ సినిమాకు యుబైఏ సర్టిఫికెట్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

Also Read- Prithviraj Shetty: యానిమల్, దురంధర్, కెజియఫ్‌లలో హీరోగా నేను చేస్తే బాగుండేది!

నిడివి ఎంతంటే?

సెన్సార్ సభ్యుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ప్రకారం మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన కామెడీ టైమింగ్‌తో, యాక్షన్‌తో అలరించనున్నారని అంటున్నారు. చివరిలో విక్టరీ వెంకటేష్ ఎంట్రీ తర్వాత సినిమా రచ్చ రచ్చగా ఉంటుందని, ఒక్కొక్కళ్లు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారని, అనిల్ రావిపూడి ఈసారి కామెడీ డోస్ కాస్త పెంచినట్లుగా టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమా నిడివి విషయానికి వస్తే.. 162 నిమిషాలు, అంటే 2 గంటల 42 నిమిషాలు అని తెలుస్తోంది. మొత్తంగా అయితే సెన్సార్ టాక్ మాత్రం చాలా పాజిటివ్‌గా ఉందని మాత్రం క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి హిట్ ఎంత అవసరమో తెలియంది కాదు. ‘భోళా శంకర్’ తర్వాత ఆయన నుంచి సినిమా రాలేదు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకుంటారని, ఆయన అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. చూద్దాం మరి.. జనవరి 12 ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఎలాంటి రిజల్ట్‌ను సొంతం చేసుకుంటారో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Sankranthi 2026: కళ్యాణ్ పడాల, తనూజ కలిసి డ్యాన్స్.. బిగ్ బాస్ తర్వాత మళ్లీ ఈ వేడుకలోనే!

The Raja Saab: ‘ది రాజా సాబ్’ థియేటర్లో మొసళ్లు.. వీళ్లు మాములు ఫ్యాన్స్ కాదు బాబోయ్!

MP Kiran Reddy: రాయలసీమ రొయ్యలపులుసు తిన్న దొంగ ఎవరు?.. ఎంపీ చామల వ్యంగ్యాస్త్రాలు

Jana Nayagan: ‘అఖండ 2’కు ఆర్థిక ఇబ్బందులు.. మరి ‘జన నాయగన్’కు?

Newborn Dies: గుడిలో వదిలివేసిన శిశువు మృతి.. వైద్యులు తెలిపిన కారణాలివే