MLC Kavitha: జాగృతి విస్తృత స్థాయి భేటీలో కీలక నిర్ణయాలు
MLC Kavitha (imagecredit:twitter)
Political News, Telangana News

MLC Kavitha: తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి భేటీలో కీలక నిర్ణయాలు

MLC Kavitha: బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన జాగృతి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కల్వకుంట్ల కవిత అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యవర్గం, 23 అనుబంధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు, జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు. ముఖ్య నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్(BRS) పార్టీకి రాజీనామా చేసిన రోజే శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసినా శాసన మండలి చైర్మన్ రాజీనామాను ఆమోదించకపోవడం.. కౌన్సిల్ సమావేశంలో కవిత(kavitha) భావోద్వేగంతో కూడిన ప్రసంగం చేసి తన రాజీనామాను ఆమోదించాలని కోరడం, దానికి దారితీసిన పరిస్థితులపై సమావేశంలో చర్చించారు.

తెలంగాణ జాగృతి భవిష్యత్‌లో..

19 ఏళ్లుగా తెలంగాణ సాంస్కృతిక వికాసం, పునరుజ్జీవం, చారిత్రక వైభవాన్ని కాపాడేందుకు, కార్మికులు, కర్షకులు, వివిధ ప్రజల సంక్షేమం కోసం సేవలందించిన తెలంగాణ జాగృతి భవిష్యత్‌లో ఎలాంటి రూపంలో సేవలందించాలనే అంశంపైనా సమావేశంలో చర్చించారు. తెలంగాణ జాగృతి రానున్న రోజుల్లో ప్రజలకు ఎలాంటి సేవలందించాలి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(AP) నుంచి తెలంగాణ(Telangana) రాష్ట్రం ఆవిర్భించిన తర్వాత ప్రస్తుత రోజు వరకు ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు, వచ్చాయి.. ప్రజలు ఏం కోరుకుంటున్నారు.. ఏ రూపంలో జాగృతి సేవలు అవసరం అని భావిస్తున్నారో ప్రజాస్వామిక పద్ధతిలో అభిప్రాయాలు సేకరించాలని సమావేశంలో తీర్మానం చేశారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలైన నీళ్లు.. నిధులు.. నియామకాలు 12 ఏళ్లలో ఏమేరకు సాకారం అయ్యాయి.. ఇంకా చేయాల్సిన కృషి ఏమిటో నిర్దారించడానికి వేర్వేరు కమిటీలు వేయాలని నిర్ణయించారు.

స్టీరింగ్ కమిటీని ఏర్పాటు

తెలంగాణ స్టేట్ బడ్జెట్, ఎంప్లాయిమెంట్, ఇరిగేషన్, హెల్త్(Health), న్యాయ(Law), మహిళా సాధికారిత, కార్మిక సంక్షేమం, ఎస్సీ(SC), ఎస్టీ(ST), బీసీ(BC), ఎంబీసీ(MBC), మైనార్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ సంక్షేమం సహా వివిధ రంగాల్లో అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. ఆయా కమిటీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు జరిగిన అన్ని పరిణామాలను పరిగణలోకి తీసుకొని సంపూర్ణంగా అధ్యయనం చేసి ఈనెల 17 స్టీరింగ్ కమిటీకి నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు. జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్(Rup Singh) అధ్యక్షతన మరో ముగ్గురు సభ్యులతో కూడిన స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. స్టీరింగ్ కమిటీలో సీనియర్ జర్నలిస్టులు సయ్యద్ ఇస్మాయిల్, లోక రవిచంద్ర, జాగృతి సీనియర్ నాయకురాలు మంచాల వరలక్ష్మీని సభ్యులుగా నియమించారు. జాగృతి స్టీరింగ్ తమకు సమర్పించిన ఆయా కమిటీల నివేదికలను అధ్యయనం చేసి జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kavitha)కు నివేదిక సమర్పిస్తుంది.. అనంతరం జాగృతి విస్తృత స్థాయి కార్యవర్గం మరోసారి సమావేశం అయి నివేదికలోని అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటుంది.

Also Read: YS Sharmila: కూటమి ప్రభుత్వానికి సిగ్గుండాలి.. చంద్రబాబు సర్కార్‌పై షర్మిల ఫైర్.. విషయం ఏంటంటే?

Just In

01

Sankranthi 2026: కళ్యాణ్ పడాల, తనూజ కలిసి డ్యాన్స్.. బిగ్ బాస్ తర్వాత మళ్లీ ఈ వేడుకలోనే!

The Raja Saab: ‘ది రాజా సాబ్’ థియేటర్లో మొసళ్లు.. వీళ్లు మాములు ఫ్యాన్స్ కాదు బాబోయ్!

MP Kiran Reddy: రాయలసీమ రొయ్యలపులుసు తిన్న దొంగ ఎవరు?.. ఎంపీ చామల వ్యంగ్యాస్త్రాలు

Jana Nayagan: ‘అఖండ 2’కు ఆర్థిక ఇబ్బందులు.. మరి ‘జన నాయగన్’కు?

Newborn Dies: గుడిలో వదిలివేసిన శిశువు మృతి.. వైద్యులు తెలిపిన కారణాలివే