వరంగల్, స్వేచ్ఛ : కాకతీయ యూనివర్సిటీ (Kakatiya University)లో విద్యార్థుల మధ్య శుక్రవారం గ్యాంగ్ వార్ చోటుచేసుకున్నది. యూనివర్సిటీలోని గణపతి దేవ హాస్టల్ డైనింగ్ హాల్‌లో జూనియర్, సీనియర్ విద్యార్థుల మధ్య జరిగిన వివాదం తీవ్రరూపం దాల్చి ఫైటింగ్‌కు దారిసింది. ఈ ఘనలో ఇద్దరు జూనియర్ విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని తోటి విద్యార్థులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
Also Read : GHMC లో ఆర్థిక సంక్షోభం.. ట్రాఫిక్ సమస్యలు తీరేదెప్పుడో?
కాగా, కొద్దిరోజులుగా డిగ్రీ, పీజీ విద్యార్థుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం లంచ్ టైంలో కామన్ మెస్ వద్ద విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకున్నారు. తోటి విద్యార్థులు సర్ది చెప్పడంతో అక్కడి నుండి ఇరువర్గాల వారు వెళ్లిపోయాయి. అయితే, సాయంత్రం మరోసారి ఇరువర్గాలు ఎదురు పడటంతో వివాదం మళ్ళీ మొదలైంది. టేబుళ్లు, కుర్చీలతో విద్యార్థులు దాడి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కేయూ (Kakatiya University) పోలీసులు యూనివర్సిటీకి చేరుకొని పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.