CM Chandrababu Naidu: తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డు చెప్పామా?
CM Chandrababu Naidu ( IMAGE CREDIT: SWETCHA REPORTER)
ఆంధ్రప్రదేశ్, గుంటూరు

CM Chandrababu Naidu: తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డు చెప్పామా? నీటి పంచాయితీపై.. ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

CM Chandrababu Naidu: ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరులో జరుగగా, ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) హాజరై తెలంగాణ నీటి పంచాయితీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ వన్‌గా ఉండాలని, దానికి తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. మనలో ఐకమత్యం ఉండాలని సూచించారు. తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలున్నా మాతృభాష తెలుగే అని చెప్పారు. ఎన్టీఆర్ సీఎం అయ్యాకే సాగర్ జలాలను ఉపయోగించుకునేలా ఎస్ఎల్బీసీ తెచ్చారని గుర్తు చేశారు. కల్వకుర్తి లిఫ్ట్, ఏఎమ్మార్ ఎత్తిపోతల, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులను తాను పూర్తి చేశానని వివరించారు. కృష్ణా డెల్టా మోడ్రనైజేషన్ పేరుతో నీటిని పొదుపు చేసి, ఆ నీటిని తెలంగాణకు కేటాయించి బీమా లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశామన్నారు.

Also Read: CM Chandrababu Naidu: అక్కడి ముస్లింలు కోటీశ్వరులు అయ్యారంటే నేనే కారణం: చంద్రబాబు నాయుడు

ఎత్తిపోతల వంటి పథకాలను చేపట్టాం

గోదావరి నదిపై గుత్ప, అలీ సాగర్, దేవాదుల ఎత్తిపోతల వంటి పథకాలను చేపట్టామని తెలిపారు. ఆంధ్రా ప్రాంతంలో చాగల్నాడు, పుష్కర, తాటిపూడి వంటి లిఫ్ట్ ప్రాజెక్టులు తెచ్చామన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుతో కృష్ణా డెల్టాకు నీరిచ్చామని, విభజన తర్వాత పోలవరానికి ప్రత్యేక నిధులిచ్చారు, ప్రత్యేక చట్టం రూపొందించారని తెలిపారు. గతేడాది సుమారు కృష్ణా, గోదావరి నదుల నుంచి 6,282 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లిందన్నారు. గోదావరి నీళ్లు పుష్కలంగా ఉన్నాయని, తెలంగాణ వాడుకున్నా అడ్డు చెప్పలేదని గుర్తు చేశారు.

కాళేశ్వరం కట్టినా అభ్యంతరం చెప్పలేదు 

విభజన తర్వాత కాళేశ్వరం కట్టినా అభ్యంతరం చెప్పలేదన్నారు. ప్రతీ ఏడాది గోదావరి నుంచి సముద్రంలోకి 3వేల టీఎంసీల నీళ్లు వృథాగా పోతున్నాయని చంద్రబాబు తెలిపారు. కృష్ణా, గోదావరి నదులు అనుసంధానం జరుగుతుందని, ఏపీలోని నదులన్నింటినీ అనుసంధానించాలని అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు ఉండకూడదన్న ఆయన, ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి అన్నీ మాట్లాడడం లేదని, ఐక్యత గురించే మాట్లాడతానని చెప్పారు. నీటి విషయంలోనైనా, సహకారం విషయంలోనైనా తెలుగు వారంతా కలిసి ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Also Read: Chandrababu Naidu: ప్రాంతాలు వేరైనా తెలుగు జాతి ఒక్కటే.. ఏపీ ముఖ్యమంత్రి సంచలన వాఖ్యలు!

Just In

01

Sankranthi 2026: కళ్యాణ్ పడాల, తనూజ కలిసి డ్యాన్స్.. బిగ్ బాస్ తర్వాత మళ్లీ ఈ వేడుకలోనే!

The Raja Saab: ‘ది రాజా సాబ్’ థియేటర్లో మొసళ్లు.. వీళ్లు మాములు ఫ్యాన్స్ కాదు బాబోయ్!

MP Kiran Reddy: రాయలసీమ రొయ్యలపులుసు తిన్న దొంగ ఎవరు?.. ఎంపీ చామల వ్యంగ్యాస్త్రాలు

Jana Nayagan: ‘అఖండ 2’కు ఆర్థిక ఇబ్బందులు.. మరి ‘జన నాయగన్’కు?

Newborn Dies: గుడిలో వదిలివేసిన శిశువు మృతి.. వైద్యులు తెలిపిన కారణాలివే